Political News

నాకివ్వండి స‌ర్‌.. కాదు.. నాకే ఇవ్వాలి స‌ర్‌..

ఎన్నిక‌ల ముందు టికెట్ల వ్య‌వ‌హారం టీడీపీలో వివాదాల‌కు దారితీస్తోంది. దీంతో పార్టీ అధినేత చంద్ర‌బాబు ఇలాంటి నియోజ‌క‌వ ర్గాల విష‌యంలో ఆయ‌న నొప్పింప‌క.. తానొవ్వ‌క అనే ఫార్ములాను అనుస‌రిస్తున్నారు. గిరిజ‌న నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీ ఆధిప‌త్యం కొన‌సాగుతోంది. అయితే.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో మాత్రం ఆయా నియోజ‌క‌వ‌ర్గాల్లోనూ తాము బ‌ల‌ప‌డాల‌ని .. గెలుపు గుర్రం ఎక్కాల‌ని చంద్ర‌బాబు కృత నిశ్చ‌యంతో ఉన్నారు. ఈ క్ర‌మంలో ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గాల‌వారీగా నాయ‌కుల‌ను పిలిచి.. చ‌ర్చించి టికెట్లు క‌న్ఫ‌ర్మ్ చేయాల‌ని నిర్ణ‌యించారు.

ఈ క్ర‌మంలో కీల‌క‌మైన అర‌కు అసెంబ్లీ నియోజ‌క‌వ‌ర్గంపై ఇటీవ‌ల చ‌ర్చించారు. ఇక్క‌డ ఇద్ద‌రు యువ నాయ‌కులు టీడీపీలో టికెట్ కోసం ప‌ర‌స్ప‌ర్ పెనుగులాడుతున్నారు. వీరిలో ఒక‌రు మాజీ యువ మంత్రి కిడారి శ్రావ‌ణ్‌కుమార్ కాగా, మ‌రొక‌రు దొన్ను దొర‌. వీరిలో కిడారి ప్ర‌స్తుతం నియోజ‌క‌వ‌ర్గం టీడీపీ ఇంచార్జ్‌గా వున్నారు. 2014 ఎన్నిక‌ల్లో కిడారి తండ్రి ఇక్క‌డ నుంచి వైసీపీ టికెట్‌పై విజ‌యం ద‌క్కించుకున్నారు. త‌ర్వాత టీడీపీలో చేరారు. అయితే.. మావోయిస్టులు జ‌రిపిన కాల్పుల్లోఆయ‌న కొద్దికాలానికే మ‌ర‌ణించారు. దీంతో శ్రావ‌ణ్‌కుమార్‌కు చ‌ట్ట‌స‌భ‌ల్లో ప్రాతినిధ్యం లేక‌పోయినా.. చంద్ర‌బాబు మంత్రి ప‌ద‌వి ఇచ్చారు.

ఇక‌, అప్ప‌టి నుంచి కూడా ఆయ‌నే ఇక్క‌డ ఇంచార్జ్‌గా కొన‌సాగుతున్నారు. గ‌త ఎన్నిక‌ల్లో ఓడిపోయారు. ఇక‌, ఎస్టీ టీడీపీ సెల్ ఇంచార్జ్‌గా ఉన్న దొన్నుదొర పార్టీని బ‌లోపేతం చేయ‌డంలో ముందున్నారు. తాజాగా టికెట్ విష‌యానికి వ‌చ్చేస‌రికి ఇద్ద‌రూ కూడా పోటీ ప‌డుతున్నారు. వీరికి గిరిజ‌నుల్లో రెండు వేర్వేరు తెగ‌ల మ‌ద్ద‌తు ఉంది. పైగా అర‌కులో సంఖ్యాబ‌లం ఎక్కువ‌గా ఉన్న గిరిజ‌న తెగ‌కు దొన్ను దొర ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు. దీంతో త‌న‌కు ఈ సారి అవ‌కాశం ఇవ్వాల‌ని ఆయ‌న కోరుతున్నారు. అయితే.. పార్టీ త‌ర‌ఫున త‌న తండ్రి ప్రాణాలు ప‌ణంగా పెట్టార‌ని.. కాబ‌ట్టి త‌న‌కే ఇవ్వాల‌ని కిడారి కోరుతున్నారు.

అంతేకాదు.. సంప్ర‌దాయంగా కూడా ఈ టికెట్ త‌న‌కే ఇవ్వాల‌ని కిడారి ఒత్తిడి చేస్తున్నారు. ప్ర‌స్తుతం వైసీపీ ఎమ్మెల్యే కూడా త‌న తెగ‌కు చెందిన వారేన‌ని.. సునాయాసంగా ఓడిస్తాన‌ని ఆయ‌న చెబుతున్నారు. దీంతో టీడీపీలో యాక్టివ్‌గా ఉన్న ఇద్ద‌రూ టికెట్ కోసం పోరు స‌ల్ప‌డంతో చంద్ర‌బాబు ఈ నియోజ‌క‌వ‌ర్గంలో అభ్య‌ర్థిని ఎంపిక చేయ‌డంపై వాయిదా మంత్రం ప‌ఠించారు. మ‌రో రెండు మాసాల త‌ర్వాత‌.. నివేదిక‌లు తెప్పించుకుని.. అప్పుడు నిర్ణ‌యిస్తాన‌ని ఆయ‌న తేల్చి చెప్పారు. మ‌రి అప్ప‌టికి ఏం జ‌రుగుతుందో చూడాలి.

Share

Recent Posts

కలిసొచ్చే కాలానికి ఛాన్స్ కొట్టేసిన కామ్రేడ్

కొన్నిసార్లు అనుకోని అదృష్టం వల్ల శకునాలు కలిసి వచ్చి జాతకం మారిపోతుంది. ఇది సినిమాలకు కూడా వర్తిస్తుంది. వెంకటేష్ వీరాభిమాని…

6 hours ago

జైలర్ 2 ప్రపంచం ఎంత కొత్తగా ఉంటుంది

సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న జైలర్ 2 విడుదల అక్టోబర్ 15 జరగనుంది.…

8 hours ago

బండ్ల గణేష్ పేరు వాడుకుంది ఎవరు?

ప్రముఖ నిర్మాత, నటుడు, వ్యాపారవేత్త బండ్ల గణేష్ గురించి ఇరు తెలుగు రాష్ట్రాల ప్రజలకు పరిచయం అక్కర లేదు. నిర్మొహమాటంగా,…

8 hours ago

వివేకా కేసులో వాస్తవాలు కక్కిస్తాం

మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో వాస్తవాలు కక్కిస్తామంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు వార్నింగ్ ఇచ్చారు. కుట్రలే గొడ్డలి…

10 hours ago

వారణాసి ముందు ఇది పెద్ద దెబ్బే

డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ బాక్సాఫీస్ ఫలితం చాలా త్వరగా తేలిపోయింది. ప్రీమియర్ల నుంచి మొదలైన మిక్స్డ్ టాక్ చివరికి…

11 hours ago

కీర్తి సురేష్ ఉన్నా లాభం లేకపోయింది

మొన్న అక్టోబర్ రెండు గాంధీ జయంతికి చాలా సినిమాలొచ్చాయి. వాటిలో తమిళ డబ్బింగ్ డోరతీ కూడా ఉంది. సున్నితమైన అంశం…

12 hours ago