రోజుకో లెక్క.. రెండు రోజులకో సర్వే.. ఎన్నికలకు ముందు ఇది సర్వత్రా కామన్. అలానే ఏపీలోనూ ఇలాంటి సర్వేలే వస్తున్నాయి. వీటిలో కొన్ని వాస్తవాలు కూడా కనిపిస్తున్నాయి. ఇలానే తాజాగా పట్టణాల్లో నిర్వహించి న మౌత్ ఒపీనియన్ సర్వేలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి. వచ్చే ఎన్నికల్లో పట్టణాల్లో టీడీపీ పరిస్థితి ఏంటి? వైసీపీ పరిస్థితి ఏంటి? అనేది ఈ సర్వేల ప్రధాన సారాంశం.
ఈ క్రమంలో పట్టణ వోటు బ్యాంకు మొత్తం టీడీపీ క్లీన్ స్వీప్ చేస్తుందని మెజారిటీ ప్రజలు అభిప్రాయపడ డం గమనార్హం. కూలి నుంచి ఉద్యోగస్తుల వరకు అందరిదీ సైకిల్ బాటేనన్నది ఈ సర్వేలు చెబుతున్న మాట. అంతేకాదు.. చంద్రబాబు వస్తేనే.. అంటూ మెజారిటీ ప్రజలు అనేక విషయాలు చెబుతున్నారట. ముఖ్యంగా రాజధానిని కోరుతున్నవారు పట్టణాల్లోనే ఎక్కువ గా ఉంటున్నారు. ఇదే విషయం సర్వేలోనూ స్పష్టమైంది.
విజయవాడలో వ్యాపారం అంతగా లేదు. ఏదైనా రాజధాని ఉంటే.. ఇతర రాష్ట్రాల నుంచి కూడా ప్రజలు అక్కడకు వస్తారు. లావాదేవీలు కూడా సాగుతాయి. కానీ మాకు రాజధాని లేదు. దీంతో ఇబ్బందులు పడుతున్నాం అని ప్రముఖ మార్కెట్ కాళేశ్వరరావు సూపర్ మార్కెట్ కు చెందిన వ్యాపార వర్గాలు చెబుతున్నాయి. ఇక, విశాఖలో వెలుగు చూస్తున్న ఘటనల నేపథ్యంలో ఇక్కడి వారు కూడా ప్రశాంత జీవితం కోరుకుంటున్నారు.
అదేవిధంగా కర్నూలు, అనంతపురం, చిత్తూరు వంటి మెజారిటీ నగరాల్లోనూ టీడీపీ క్లీన్ స్వీప్ చేయడం తథ్యమనే వాదన బలంగా వినిపిస్తోంది. కట్ చేస్తే.. ఇది ఎంత వరకు నిజం అని డౌట్ రావొచ్చు. కానీ, అదేసమయంలో టీడీపీ అధినేత వేసిన వ్యూహాలను బట్టి ఇది నిజమనే నమ్మాలి. ఆయన పట్టణ ఓటు బ్యాంకు విషయంలో వస్తున్న సర్వేలను నమ్ముతున్నారు. నిర్ధారించుకున్నారు కూడా. అందుకే ఇప్పుడు పల్లె బాట పడుతున్నారు. సో.. మొత్తానికి టీడీపీ పట్టణ ఓటు బ్యాంకును స్వీప్ చేయడం ఖాయమని చెబుతున్నారు.
This post was last modified on July 16, 2023 5:41 pm
ఇప్పుడు దేశమంతా ఇండియన్ హీరో కెప్టెన్ స్మిత్ మచ్చర్ గురించే మాట్లాడుతోంది. దేశమే కాదు యావత్ ప్రపంచంలోనూ ఇదే చర్చ…
యువ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన టీజీ భరత్.. దూకుడు మామూలుగా లేదనే టాక్ వినిపిస్తోంది. టీడీపీ నాయకుడిగా.. యువ…
ఈ నెల విడుదలవుతున్న సినిమాల్లో అత్యధిక బడ్జెట్ తో రూపొందిన ప్యాన్ ఇండియా మూవీ రణబాలినే. విజయ్ దేవరకొండ, రష్మిక…
కొన్ని నెలల క్రితం మోహన్ లాల్ దృశ్యం 3 మీద చాలా విమర్శలొచ్చాయి. మలయాళం వెర్షన్ డబ్బులు తెచ్చి ఉండొచ్చేమో…
గత సంవత్సరం తండేల్ తర్వాత హీరోయిన్ సాయిపల్లవి దర్శనం బొత్తిగా లేకుండా పోయింది. ఈ ఏడాది ఏక్ దిన్ తో…
కొన్ని సినిమాల ల్యాండ్ మార్క్ యానివర్సరీలు గుర్తు చేసుకోవడం అవసరం. ఎందుకంటే ఇప్పటి బ్లాక్ బస్టర్ల మూలాలు ఎంతో కొంత…