విశ్వాసం ఉండొచ్చు.. కానీ అతి విశ్వాసం.. ఎవరికీ ఉండకూడదు. వ్యక్తులైనా.. పార్టీలైనా.. అతి విశ్వాసానికి పోయి.. చేతులు కాల్చుకున్న పరిస్థితి కళ్ల ముందే కనిపిస్తోంది. ఇటీవల జరిగిన కర్ణాటక ఎన్నికల్లో తమదే గెలుపని బీజేపీ పెద్దలు రాసి పెట్టుకున్నారు. క్షేత్రస్థాయి నుంచి పై స్థాయి వరకు నాయకులు అందరూ కర్ణాటకలో కమలం వికసిస్తుందని లెక్కలు వేసుకున్నారు. దీంతో ఎడా పెడా.. అనేక విమర్శలు.. కామెంట్లు కూడా చేశారు.
కానీ, కర్నాటకలో పరిస్థితి తిరగబడింది. కట్ చేస్తే.. ఏపీ విషయంలోనూ.. అధికార పార్టీ నాయకులు.. క్షేత్ర స్థాయిలో పరిస్థితిని అంచనా వేయడం ఏమో కానీ.. అతి విశ్వాసానికిపోతున్నారనే టాక్ వినిపిస్తోంది. గెలుపు అధికారం అనే విషయాలను పక్కన పెడితే.. జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ను వారు మరీ తక్కువ అంచనా వేసేస్తున్నారు. తాజాగా మంత్రి జోగి రమేష్ వంటి వారు హద్దులు దాటేసి.. పవన్‌పై వలంటీర్‌ను నిలబెట్టినా.. ఓడిపోతారంటూ కామెంట్ చేశారు.
అంటే.. పవన్ స్థాయి వలంటీర్ కన్నా తక్కువగానే ఉందని బహుశ వైసీపీ అంచనా వేస్తుండవచ్చు. కానీ, ఇది అతి విశ్వాసం అవుతుందే తప్ప.. విశ్వాసం మాత్రం కాదనే లెక్కలు వెలుగు చూస్తున్నాయి. వలంటీర్ వ్యవస్థపై ఎంత నమ్మకం ఉన్నా.. పవన్ వంటి బలమైన అభిమాన గణం ఉన్న నాయకుడిని వదులుకునేందుకు ఈ సారి ప్రజలు సిద్ధంగా లేరనే వాస్తవాన్ని మాత్రం ఆయన గ్రహించలేక పోతున్నట్టు స్పష్టంగా కనిపిస్తోంది.
తాము గెలుస్తామనేది ధీమా.. విశ్వాసం.. కానీ, ఎదుటి వారు ఓడిపోతారనడం అతి అవుతుంది. ఇదే ఇప్పుడు వైసీపీని పలుచన చేస్తోందని అంటున్నారు. ఇప్పటి వరకు పవన్ విషయంలో ప్రజల ఆలోచనా సరళి ఎలా ఉన్నా.. మంత్రిజోగి చేసిన వలంటీర్‌వ్యాఖ్య తర్వాత.. పవన్‌ను ఇంత చిన్నగా అంచనా వేస్తారా? మేమేంటో చూపిస్తాం.. అంటూ.. జనసైనికులు వ్యాఖ్యానిస్తున్నారు. ఇది పంతాల వరకు వెళ్తే.. పవన్ గెలుపును ఆపడం వైసీపీకి సాధ్యం కాదు. ఏదేమైనా.. విశ్వాసం ఉండొచ్చు.. కానీ, అతి విశ్వాసం.. మాత్రం సరికాదని పరిశీలకులు హితవు పలుకుతున్నారు.
This post was last modified on July 16, 2023 5:40 pm
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ కువైట్‌లో పర్యటిస్తున్నారు. 43 ఏళ్ల తర్వాత.. భారత ప్రధాని కువైట్‌లో పర్యటించడం ఇదే తొలిసారి. శనివారం…
ఈ సంక్రాంతికి వచ్చే సినిమాల లైనప్ ఖరారైనట్లే. నాలుగో సినిమా పోటీలో ఉంటుందని భావించారు కానీ.. ప్రస్తుతం ఆ పరిస్థితి…
పుష్ప-2 సినిమా ప్రీరిలీజ్ సందర్భంగా హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట అనంతరం చోటు చేసుకున్న పరిణామాలపై శనివారం…
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ మాజీ సీఎం అరవింద్ కేజ్రీవాల్‌కు మరో ఉచ్చు బిగుస్తోంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో…
కీర్తి సురేష్ అంటే ట్రెడిషనల్ హీరోయిన్ అన్న ముద్ర ఎప్పుడో పోయింది. ఈ మధ్య ఆమె గ్లామర్ హీరోయిన్లకు ఏమాత్రం…