‘‘మీ కొడుకు ప్రెసిడెంట్ మెడల్ తీసుకున్నాడండీ’’.. అన్నాడొకాయ.
‘‘అవునా నిజమా. ఎంత మంచి వార్త చెప్పారు. నాకు తెలుసు వాడు ప్రయోజకుడవుతాడని. ఇప్పుడు వాడెక్కడ?’’.. మురిసిపోతూ అడిగింది ఒకావిడ.
‘‘పక్క సందులో వైన్ షాప్ దగ్గర పడున్నాడు వెళ్లి తీసుకురండి’’.. అని బదులిచ్చారాయన.
ఇదీ సోషల్ మీడియాలో కనిపిస్తున్న ప్రెసిడెంట్ మెడల్ జోకుల్లో ఒకటి. ఇంతకీ ఏంటీ ప్రెసిడెంట్ మెడల్.. దానికి వైన్ షాపుతో సంబంధం ఏంటి అని ఆశ్చర్యం కలుగుతోందా? ఏపీలో మందు బాబులందరికీ ఈ పేరు బాగానే సుపరిచితం ఇప్పుడు. అది ఈ మధ్యే ఏపీలోకి అరంగేట్రం చేసిన ఓ మద్యం బ్రాండు పేరు. దీని మీద కొన్ని రోజులుగా అనేక జోకులు వస్తున్నాయి. మీమ్స్ తయారవుతున్నాయి.
ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మద్యపాన నిషేధం హామీ సంగతేమో కానీ.. ఏపీలో ఇప్పటిదాకా ఉన్న మద్యం బ్రాండ్లన్నీ పక్కన పెట్టేసి అన్నీ లోకల్ బ్రాండ్లతోనే నింపేసిన సంగతి తెలిసిందే. ఇప్పటిదాకా కనీ వినీ ఎరుగని ఎన్నో లోకల్ బ్రాండ్లు ఇప్పుడక్కడ హల్ చల్ చేస్తున్నారు. ఏదో ఒక లేబుల్ వేయడం.. ఇష్టమొచ్చిన రేటు పెట్టడం.. అమ్మేసేయడం.. ఇదీ వరస.
అసలే మద్యం ధరలు 75 శాతం పెంచారు. పైగా ఊరూ పేరు లేని బ్రాండ్లు తెచ్చిపెట్టారు. దీంతో మందు బాబుల కష్టం మామూలుగా లేదు. వాళ్ల వైపు వకాల్తా పుచ్చుకోవడం కాదు కానీ.. ఈ బ్రాండ్ల విషయంలో అందరిలోనూ తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. ఇది మందుబాబుల సమస్య కావడంతో ఎవరూ పట్టించుకునే వారు లేకపోయారు.
This post was last modified on August 16, 2020 7:34 pm
అధికారంలో ఉన్నాం. అయినా మాకు పనులు జరగడం లేదు. అనే వ్యాఖ్యను అనంతపురం జిల్లాకు చెందిన ఒక సీనియర్ నాయకుడు…
డాలర్లు, మంచి లైఫ్ స్టైల్ కోసం విదేశాలకు వెళ్లాలని ప్రతి ఒక్కరూ కలలు కంటారు. కానీ అక్కడ కొన్నాళ్లు గడిపాక…
వైసీపీ అధినేత జగన్ ఇలానే ఉండాలి అంటూ టీడీపీ నాయకులు వ్యాఖ్యానిస్తున్నారు. దీనికి కారణం రాజకీలంలో ఎవరూ ఎవరినీ దెబ్బతీయరు.…
రాయ్పూర్ వన్డేలో 359 పరుగులు చేసినా టీమిండియా ఓడిపోవడం బిగ్ షాక్ అనే చెప్పాలి. బ్యాటర్లు అదరగొట్టినా, బౌలర్లు చేతులెత్తేయడంతో…
కాసేపు అఖండ 2 విషయం పక్కనపెట్టి నిజంగా ఇలాంటి పరిస్థితి టాలీవుడ్ లో మొదటిసారి చూస్తున్నామా అనే ప్రశ్న వేసుకుంటే…
ఉండవల్లిలోని చంద్రబాబు క్యాంపు కార్యాలయానికి తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ఈ రోజు వెళ్లారు. తెలంగాణ రైజింగ్ సమిట్కు…