నిత్యం అక్కడ రాజకీయం రగులుతూనే ఉంది. నువ్వురెండంటే.. నేను నాలుగంటా.. అంటూ.. అధికార, విపక్ష నాయకులు ఢీ అంటే ఢీ అన్నట్టుగా రాజకీయ విమర్శలు చేసుకుంటున్నారు. రోడ్డున పడుతున్నారు. నువ్వా-నేనా సై! అంటూ.. కారాలు మిరియాలు నూరుతున్నారు. ఆ నియోజకవర్గమే.,. ఉమ్మడి అనంతపురంలోని తాడిపత్రి. అప్రతిహత విజయంతో 35 సంవత్సరాల పాటు జేసీ కుటుంబం ఇక్కడ గెలుపు గుర్రం ఎక్కింది. అలాంటి నియోజకవర్గంలో తొలిసారి వైసీపీ విజయం దక్కించుకుంది.
కేతిరెడ్డి పెద్దారెడ్డి ఇక్కడ 2019 ఎన్నికల్లో విజయం సాధించారు. అయితే.. మరో 9 మాసాల్లో ఎన్నికలు ఉన్నాయనగా.. ఆయన కు ప్రజల్లో విశ్వాసం తగ్గిపోయిందనే ప్రచారం జోరుగా సాగుతోంది. ఇది కూడా వాస్తవమేనని వైసీపీ నాయకులు కూడా చెబు తున్నారు. ఎందుకంటే.. సొంత పార్టీలోనే నేతలు పెద్దారెడ్డిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న పరిస్థితి కొన్నాళ్లుగా కనిపిస్తోంది. తనకు గిట్టనివారు సొంత పార్టీ వారైనా ఆయన కేసులు పెట్టిస్తుండడం.. వారిపై దూకుడుగా ఉండడాన్ని వారు సహించలేక పోతున్నా రు. అంతేకాదు.. ఆయన జైకొట్టిన వారిని కూడా ఇప్పుడు ఆయన దూరం చేసుకున్నారు.
రాజకీయంగా మేం పెద్దారెడ్డికి ఎంతో సపోర్టు చేశాం. ఆయన మమ్మల్ని కనీసం పట్టించుకోవడం లేదు. రాజకీయం అంటే.. కేవలం ఆయన దృష్టిలో జేసీ ఒక్కరే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. క్షేత్రస్థాయిలో మాకు ఒక్క ఇల్లు కానీ, ఫించను కానీ ఇప్పించలేక పోయారు. ఆయన వెంట ఉండి.. మేం తిప్పలు పడలేం. రాజకీయంగా దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాం
అని మెజారిటీ కార్యకర్తలు చెబుతున్న మాట వాస్తవం. అంతేకాదు.. మరికొందరు మౌనంగా ఉంటున్నారు అవకాశం కోసం ఎదురు చూస్తున్నవారు కూడా ఉన్నారు.
నిజానికి బలమైన జేసీ కంచుకోటలో వైసీపీ పాగా వేసేందుకు కేవలం కేతిరెడ్డి పెద్దారెడ్డి హవామాత్రమే పనిచేయలేదు. క్షేత్రస్థాయిలో ఆయనకు అనుకూలంగా వందలు వేల మంది కార్యకర్తలు పనిచేశారు.కానీ, ఆయన ఎమ్మెల్యే అయిన.. తర్వాత.. అర్జనుడికి పక్షి కన్ను కనిపించినట్టుగా.. కేవలం జేసీ కుటుంబంపై రాజకీయ వివాదాలు తప్ప.. క్షేత్రస్థాయిలో కార్యకర్తల సమస్యలుకానీ.. వారి పరిస్థితిని కానీ ఆయన పట్టించుకోవడం లేదు. ఇది.. ఇప్పుడు పూర్తిస్థాయిలో మైనస్ కావడం గమనార్హం. వచ్చే ఎన్నికల్లో ఆయనకు ఇదే సెగ పెడుతుందని.. దీనికి పెద్దగా ఆలోచించాల్సిన అవసరం కూడా లేదనే టాక్ వినిపిస్తుండడం గమనార్హం.
This post was last modified on July 20, 2023 8:22 pm
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…