‘‘సంస్కారం గురించి పవన్ మాట్లాడటం.. సన్నీ లియోన్ వేదాలు వల్లించినట్లుంది’’.. ఇదీ ఒకప్పటి స్టార్ హీరోయిన్, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా సెల్వమణి తాజాగా చేసిన కామెంట్. ఈ కామెంట్ ఎవరైనా చిన్న స్థాయి రాజకీయ నాయకుడు అన్నాడంటే సన్నీ లియోన్ గురించి అవగాహన లేక అన్నాడులే అని లైట్ తీసుకోవచ్చు. కానీ రెండు దశాబ్దాలకు పైగా సినిమా రంగంలో ఉన్న ఒక స్టార్ హీరోయిన్.. బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న ఒక మహిళా నేత ఇలాంటి కామెంట్ చేయడం దారుణం అనే చెప్పాలి.
సన్నీ లియోన్ ఏమీ మన ఇండియాలో ఇల్లీగల్‌గా తీసే ‘బి’ గ్రేడ్ సినిమాల్లో, పోర్న్ చిత్రాల్లో నటించలేదు. కెనడాలో పోర్నోగ్రఫీ అనేది అఫీషియల్. అది అక్కడ ఒక ఇండస్ట్రీ. ఇండియాలో పుట్టి కుటుంబంతో కలిసి కెనడాలో స్థిరపడ్డ సన్నీ.. అక్కడ కుటుంబానికి తెలిసీ.. పోర్న్ ఇండస్ట్రీలో తన పేరు రిజిస్టర్ చేసుకుని.. తన పేరు అఫీషియల్‌గా చెప్పుకునే ఆ సినిమాల్లో నటించింది.
ఇండియాకు వచ్చాక మొదట్లో వ్యతిరేకత ఎదుర్కొన్నప్పటికీ.. తర్వాత ఇక్కడ బాగానే కుదురుకుంది. ఆమిర్ ఖాన్ సహా ఎంతోమంది ప్రముఖులు ఆమెకు మద్దతుగా నిలిచారు. సినిమా వాళ్లు ఎవ్వరూ ఆమెను చిన్నచూపు చూడలేదు. ఆమెను ఒక ప్రొఫెషనల్‌గానే చూశారు. ఆమె ఇక్కడ మెయిన్ స్ట్రీమ్ సినిమాల్లో నటించింది. తెలుగులో కూడా కరెంటు తీగ, జిన్నా సినిమాల్లో కీలక పాత్రలు పోషించింది. ఒకసారి పోర్న్ సినిమాలకు దూరం అయ్యాక ఆమె ఇమేజ్ మారిపోయింది. ఇండియాలో ఛారిటీ కార్యక్రమాలు చేపట్టడమే కాదు.. ఒక అనాథ అమ్మాయిని దత్తత తీసుకుని తన ఇద్దరు కవల పిల్లలతో సమానంగా పెంచుతోంది సన్నీ. ఇలాంటి అమ్మాయిని కించపరిచేలా ‘‘సన్నీ లియోన్ వేదాలు వల్లించినట్లుంది’’ అనడం రోజా కుసంస్కారానికి నిదర్శనం.
ఒక ప్రొఫెషనల్ నటి అయి ఉండి రోజా ఇలాంటి కామెంట్ చేయడం ఎంతమాత్రం సహేతుకం కాదు. అందులోనూ పవన్ కళ్యాణ్‌ను ఇన్వాల్వ్ చేసి ఈ కామెంట్ చేయడంతో రోజా తన సినిమాల్లో చేసిన విన్యాసాలకు సంబంధించి వీడియోలన్నీ బయటికి తీసి.. అలాగే ఆమె రాజకీయ, వ్యక్తిగత జీవితంలో వివాదాల వివరాలు జోడించి ఆమెను సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు నెటిజన్లు.
This post was last modified on July 15, 2023 2:55 pm
తెలంగాణలో కాంగ్రెస్ నేతలు వర్సెస్ అల్లు అర్జున్ వ్యవహారం ముదిరి పాకాన పడింది. అల్లు అర్జున్ పై అసెంబ్లీలో సీఎం…
మెగాస్టార్ చిరంజీవి, నందమూరి బాలకృష్ణల మధ్య సినిమాల పరంగా దశాబ్దాల నుంచి పోటీ నడుస్తోంది. వీరి అభిమానుల మధ్య ఉండే…
పెద్ద సినిమాలకు అర్ధరాత్రి అయినా, తెల్లవారుజామున అయినా స్పెషల్ షోలు వేసుకోవాలంటే సులువుగా అనుమతులు.. అలాగే రేట్లు ఎంత పెంచుకోవాలని…
మలయాళ లెజెండరీ ఆర్టిస్ట్ మోహన్ లాల్ ఎంత గొప్ప నటుడో కొత్తగా చెప్పాల్సిన పని లేదు. నాలుగు దశాబ్దాల కెరీర్లో…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటన ఇప్పుడు ఎంతగా చర్చనీయాంశం అవుతోందో తెలిసిందే. గత కొన్ని రోజుల నుంచి రెండు తెలుగు…
క్రిస్మస్ కి రావాలని ముందు డిసెంబర్ 20 ఆ తర్వాత 25 డేట్ లాక్ చేసుకుని ఆ మేరకు అధికారిక…