సుఖేష్ చంద్రశేఖరన్..పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరంలేదు. రెగ్యులర్ గా మీడియాను ఫాలో అయ్యేవాళ్ళకి సుఖేష్ పేరు వినబడగానే ఇట్టే గుర్తుకు వచ్చేస్తుంది పెద్ద క్రిమినల్ అని. ఎంతటి వాళ్ళనైనా ఇట్టే బుట్టలో వేసుకునేంత అసామాన్య తెలివి తేటలున్న జాదూగాడని. ఇలాంటి క్రిమినల్ విధి వక్రీకరించి ఇపుడు ఢిల్లీలోని జైలులో ఉన్నాడు. ఇలాంటి క్రిమినల్ ఇపుడు అన్నా, చెల్లెలు వెంటపడ్డాడు. చెల్లులును ఎప్పటినుండో వెంటాడుతున్న సుఖేష్ కొత్తగా అన్నను కూడా చేర్చాడంతే.
ఇంతకీ సుఖేష్ వెంటాడుతున్న అన్నా చెల్లెలు ఎవరో తెలిసిపోయిందా ? అవును కల్వకుంట్ల కవిత, కల్వకుంట్ల రామారావే. అవును వీళ్ళిద్దరు కేసీయార్ వారసులే. వీళ్ళల్లో కవిత విషయంలో ఎప్పటినుండో సుఖేష్ నానా రచ్చ చేస్తున్నాడు. తనకు కవితకు మధ్య కోట్లాది రూపాయల లావాదీవీలు నడిచినట్లు ఈ జాదూగాడు కొన్ని వాట్సప్ చాట్లను రిలీజ్ చేశాడు. దాంతో అప్పట్లో తెలంగాణాలో కొంత సంచలనమైన మాట వాస్తవం. అయితే ఇలాంటి చాట్లనే సుఖేష్ రెగ్యులర్ గా విడుదల చేస్తుండటంతో జనాలు పట్టించుకోవటం మానేశారు.
అలాంటిది ఇపుడు సడెన్ గా కవితతో పాటు కేటీయార్ ను పిక్చర్లోకి లాగారు. కవిత, కేటీయార్ ఇద్దరూ రక్తాన్ని పీల్చే జలగల్లాంటి వాళ్ళంటు తాజాగా ఆరోపించారు. తన సాక్ష్యాలను, వాగ్మూలాన్ని వాపసు తీసుకుంటే తనకు శంషాబాద్ దగ్గర స్ధలం ఇస్తానని, వంద కోట్ల రూపాయలు ఇస్తామని ఆఫర్లు పంపుతున్నట్లు ఆరోపించారు. నిజానికి తనిష్టం వచ్చినవాళ్ళపైన వాట్సప్ చాట్లు రిలీజ్ చేయటానికి సుఖేష్ కు మొబైల్ ఫోన్ ఎక్కడ దొరుకుతోందన్నదే అర్ధంకావటంలేదు.
జైలులో ఉన్న వ్యక్తికి మొబైల్ ఎక్కడిది ? ఒకవేళ తన లాయర్ మొబైల్ ద్వారా వాట్సప్ చాటింగులను విడుదల చేస్తుంటే పోలీసులు, దర్యాప్తు అధికారులు ఏమిచేస్తున్నట్లు ? సుఖేష్ కు చెందిన అన్నీ ఆధారాలను దర్యాప్తు అధికారులు స్వాధీనం చేసుకోవాలి కదా. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కవిత పాత్రకు సంబంధించిన ఆధారాలున్న తన దగ్గరున్నట్లు సుఖేష్ చెప్పటమే విచిత్రంగా ఉంది. ఇన్ స్టాల్మెంట్ల వారీగా వాట్సప్ చాటింగులను ఎలా విడుదల చేస్తున్నాడో అర్ధంకావటంలేదు. ఈ విషయాన్నే కేటీయార్ సుఖేష్ ఒక రోగ్ అంటు కొట్టిపాడేశారు.
This post was last modified on July 15, 2023 1:03 pm
ఏపీ సీఎం చంద్రబాబు గతానికి భిన్నంగా ఏపీలో పాలన సాగిస్తున్నారు. గతంలో ఆయన మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన సమయంలో…
అదేంటో పోలీస్, క్రైమ్ మీద మలయాళంలో ఎన్ని సినిమాలు వచ్చినా వాటికి కేరళ ప్రేక్షకులు ఆదరణ అందిస్తూనే ఉంటారు. తాజాగా…
టాలీవుడ్ మూవీ లవర్స్ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న కాంబినేషన్ హీరో వెంకటేష్, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ జంటది. రచయితగా…
అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తే భారత్‌కు భారీ లాభం జరుగుతుందా? ఇండియన్…
పేరున్న హీరో హీరోయిన్లు లేకపోయినా.. ప్రి రిలీజ్ బజ్ కూడా పెద్దగా లేకపోయినా.. కంటెంట్‌తో ప్రేక్షకులను అమితంగా ఆకట్టుకుని పెద్ద…
ఇమేజ్, మార్కెట్ ఉన్న స్టార్లే కాదు అప్ కమింగ్ హీరోలకు సైతం ఏడాదికి ఒక సినిమా రిలీజ్ చేయడమే మహా…