భారతదేశంతోపాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలంతా చంద్రయాన్-3 ఎప్పుడెప్పుడు నింగికెరుతుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ిచంద్రయాన్-2 విఫలమైన నేపథ్యంలో ఈ ప్రయోగంపై ఇస్రో ఎన్నో ఆశలు పెట్టుకుంది. ఈ క్రమంలోనే శ్రీహరికోట రాకెట్ ప్రయోగ కేంద్రం నుంచి ఈ మధ్యాహ్నం నింగికెగిసిన చంద్రయాన్-3 మాడ్యూల్ నిర్దేశిత కక్ష్యలోకి విజయవంతంగా ప్రవేశించింది. చంద్రయాన్-3ని గగనానికి మోసుకెళ్లిన ఎల్వీమ్3-ఎం4 రాకెట్ అన్ని దశలు సాఫీగా పూర్తి చేసింది.
అనుకున్న సమయానికే చంద్రయాన్-3ని నిర్దేశిత కక్ష్యలోకి విడుదల చేసింది. ఎల్వీమ్3-ఎం4 రాకెట్ నుంచి చంద్రయాన్-3 ప్రొపల్షన్ మాడ్యూల్ విజయవంతంగా విడిపోయింది. దాంతో ఇస్రో శాస్త్రవేత్తల్లో సంబరాలు మిన్నంటాయి. తమ కృషి ఫలించినందుకు ఇస్రో చైర్మన్ డాక్టర్ ఎస్.సోమనాథ్ హర్షం వ్యక్తం చేశారు. ఎల్వీఎమ్3-ఎం4 రాకెట్ చంద్రయాన్-3ని భూకక్ష్యలోకి చేర్చిందని వెల్లడించారు. ప్రపంచంలోనే ఏ దేశం కూడా చంద్రుడిపై ఉన్న దక్షిణ ధృవంపైకి శాటిలైట్ ని పంపలేదు. కానీ. ఆ ఘపత దక్కించుకున్న తొలిదేశంగా భారత్ అవతరించింది.
చంద్రయాన్-3 విజయవంతంగా చేర్చిందని, కక్ష్యను విస్తరించుకుంటూ చంద్రుడి కక్షలోకి ప్రవేశిస్తుందని ఆయన వెల్లడించారు. 40 రోజుల తర్వాత అంటే ఆగస్టు 23 నుంచి 24 తేదీలు మధ్యలో చంద్రుడిపై చంద్రయాన్ దిగుతుందని వెల్లడించారు. ఈ విజయం పట్ల భారత ప్రధాని నరేంద్ర మోడీ హర్షం వ్యక్తం చేశారు. ఇస్రో శాస్త్రవేత్తలను మోడీ అభినందించారు. భారత అంతరిక్ష పరిశోధన రంగం చరిత్రలో ఇది సరికొత్త అధ్యాయం అని అన్నారు. ఈ విజయం భారతీయ శాస్త్రవేత్తల అంకితభావానికి, అకుంఠిత దీక్షకు నిదర్శనమని కొనియాడారు. శాస్త్రవేత్తల స్ఫూర్తికి, చాతుర్యానికి వందనం చేస్తున్నానని మోడీ తెలిపారు.
This post was last modified on July 14, 2023 8:08 pm
సంక్రాంతి బాక్సాఫీస్ వద్ద ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. వందల కోట్లతో తీసిన రాజా సాబ్ కు మిశ్రమ స్పందన…
నిన్న రాత్రి నుంచి మెగాస్టార్ చిరంజీవి అభిమానుల ఉత్సాహం మామూలుగా లేదు. చిరు కొత్త సినిమా ‘మన శంకర వరప్రసాద్…
పోలవరం అత్యత్భుతమైన ప్రాజెక్టు, ఈ ప్రాజెక్టు పూర్తి అయితే దక్షిణ భారత్‌లో ఏ రాష్ట్రమూ మనతో పోటీ పడలేదు.. అని…
మెగా కంబ్యాక్ గా అభిమానులు మురిసిపోతున్న మన శంకరవరప్రసాద్ గారు థియేటర్లు ప్రీమియర్ల నుంచి రెగ్యులర్ షోల దాకా చాలా…
బాహుబలి, బాహుబలి-2 చిత్రాలతో దేశవ్యాప్తంగా తిరుగులేని ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ సంపాదంచుకున్నాడు ప్రభాస్. ఇదంతా రాజమౌళి పుణ్యం అంటూ కొందరు…
చాలా గ్యాప్ తర్వాత చిరంజీవి సినిమాకు సోషల్ మీడియాలో విపరీతమైన పాజిటివ్ వైబ్స్ కనిపిస్తున్నాయి. ప్రీమియర్లతో విడుదలైన మన శంకరవరప్రసాద్…