తెలుగుదేశం యువ నేత నారా లోకేష్ ‘యువగళం’ పాదయాత్రతో తనను తాను సరికొత్తగా ఆవిష్కరించుకున్న తీరు.. రాజకీయ వర్గాల్లో హాట్ టాపిక్‌గా మారింది. సబ్జెక్ట్ లేదని, మాట తడబడుతుందని.. ఇలా ఎన్నో విమర్శలు ఎదుర్కొన్న లోకేష్.. యువగళంలో అందరినీ ఆశ్చర్యపరిచాడు.
జనాలను ఆకట్టుకునే ప్రసంగాలు.. ఇంటరాక్షన్ కార్యక్రమాలతో శభాష్ అనిపించుకున్నాడు. జనాలతో లోకేష్ మమేకమైన తీరు.. వివిధ అంశాలపై తన ప్రసంగాలు.. ఏపీ సీఎం జగన్ మీద వేసిన పంచులు చర్చనీయాంశం అయ్యాయి. యాత్ర ముందుకు సాగే కొద్దీ స్పందన పెరిగింది.
జగన్‌కు బాగా బలం ఉన్న రాయలసీమ జిల్లాల్లో లోకేష్ యాత్రకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. మీడియాలో ఈ యాత్రకు, లోకేష్‌కు మంచి కవరేజీ వచ్చింది. సోషల్ మీడియాలో ఈ యాత్ర గురించి బాగా చర్చ జరిగింది. ఐతే గత రెండు మూడు వారాల ముందు నుంచి మాత్రం లోకేష్ యాత్ర గురించి పెద్దగా సౌండ్ లేదు.
లోకేష్ ఇటీవలే తన యాత్రలో 2 వేల కిలోమీటర్ల మైలురాయిని పూర్తి చేశాడు. వెయ్యి కిలోమీటర్లు పూర్తయినపుడు జరిగిన హడావుడి.. మీడియా కవరేజీ, సోషల్ మీడియాలో సందడితో పోలిస్తే ఇప్పుడు పరిస్థితి భిన్నం.
దీని గురించి పెద్ద చర్చే లేదు. ఇందుకు ప్రధాన కారణం జనసేనాని పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. బేసిగ్గా సినిమా నటుడు కావడం వల్ల పవన్‌కు ఉన్న ఆకర్షణకు తోడు.. యాత్రలో పవన్ చేసిన ప్రసంగాలు రాజకీయంగా కాక రేపాయి. వ్యతిరేక మీడియా సైతం పవన్‌కు కవరేజీ ఇవ్వక తప్పని పరిస్థితి నెలకొంది. కొన్ని రోజలుగా ఏపీ రాజకీయం మొత్తం పవన్ చుట్టూ తిరుగుతుండటం విశేషం. మీడియాను, సోషల్ మీడియాను అతనే ఆక్రమించేశాడు.
తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పేరు సైతం పెద్దగా వినిపించడం లేదు. లోకేష్ యాత్ర సంగతి చెప్పాల్సిన పని లేదు. అతను చాలా వరకు సైడ్ అయిపోయాడు. పవన్ మళ్లీ బ్రేక్ తీసుకుంటే తప్ప లోకేష్ మళ్లీ లైమ్ లైట్లోకి వచ్చేలా లేడు.
This post was last modified on July 14, 2023 7:33 am
అక్కినేని నాగచైతన్యకు చాలా కాలానికి ఓ మంచి హిట్ పడడంతో ఊపిరి పీల్చుకున్నారు. థాంక్యూ, కస్టడీ లాంటి డిజాస్టర్ల తర్వాత…
మన దగ్గరేమో ప్యాన్ ఇండియా సినిమాలు విపరీతమైన ఆలస్యాలకు లోనవుతూ, విడుదల తేదీలు మార్చుకుంటూ నానా తిప్పలు పడుతున్న వైనాన్ని…
నిజమే... జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం ఒక్కటంటే ఒక్క మాటతో ఆ రెండు గ్రామాల రూపురేఖలు మారిపోయాయి. మరికొన్నాళ్లుంటే...…
కంటెంట్ కన్నా ఎక్కువ వివాదాలతో వార్తల్లో నిలిచిన లూసిఫర్ సీక్వెల్ ఎంపురాన్ 2 తాజాగా ఇరవైకి పైగా కత్తిరింపులు, రెండు…
గత ఏడాది డిసెంబర్లో విడుదలై ఆల్ ఇండియా బ్లాక్ బస్టర్ సాధించిన పుష్ప 2 ది రూల్ కొనసాగింపు పుష్ప…
తెలంగాణలో 10వ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ప్రశ్న పత్రాల లీకేజీ వ్యవహారం దుమారం రేపిన సంగతి తెలిసిందే. పరీక్ష మొదలైన…