ఉమ్మడి గుంటూరు జిల్లాలో పక్క పక్కన ఉండే మూడు నియోజకవర్గాల్లో వైసీపీకి వ్యతిరేకత తెరమీదికి వచ్చింది. నిన్న మొన్నటి వరకు తమదే గెలుపని భావించినప్పటికీ.. ఇప్పుడు మారుతున్న పరిణామాల నేపథ్యంలో పార్టీ అంతర్మథనంలో చిక్కుకుందని తెలుస్తోంది. ప్రస్తుతం ఉన్న అంచనాల మేరకు వినుకొండ, గురజాల, నరసారావు పేట. ఈమూడు నియోజకవర్గాల్లోనూ వైసీపీలో వ్యతిరకత కనిపిస్తోందని అంటున్నారు.
వినుకొండ నుంచి గత ఎన్నికలలో బొల్లా బ్రహ్మనాయుడు విజయం దక్కించుకున్నారు. గడపగడపకు పాదయాత్రతో పాటు.. తను సొంతగా కూడా.. కొన్ని కార్యక్రమాలు చేస్తున్నారు. కానీ, క్షేత్రస్థాయిలో ప్రజల నాడి ఎలా ఉన్నప్పటికీ.. సొంత పార్టీలోనే ఆయనకు సెగ తగులుతుండడం గమనార్హం. ఫంక్షన్లకు వెళ్లి గిఫ్టులు ఇస్తే.. పని జరగదని.. కీలక నాయకులు బాహాటంగానే విమర్శలు గుప్పిస్తున్నారు. క్షేత్రస్థాయిలో గత ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఏమేరకు అమలయ్యాయని వారు ప్రశ్నిస్తున్నారు.
ఇక, గురజాల నియోజకవర్గంలో ప్రజల నాడి డిఫరెంట్‌గా ఉంది. ఇక్కడ క్షేత్రస్థాయిలో టీడీపీకి బలం ఎక్కువగా ఉండడంతోపాటు.. మాజీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు హవా కొనసాగుతుండడంతో వైసీపీకి ఇక్కడ మళ్లీ గెలుపు పై అంచనాలు తప్పుతున్నాయి. ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యేల మధ్య కొనసాగుతున్న ఆధిపత్య రాజకీయాలతో అభివృద్ధి పూర్తిగా కుంటుపడిందనే వాదన వినిపిస్తోంది. దీంతో కాసు మహేష్ రెడ్డికి వ్యతిరేకత కనిపిస్తోందని అంటున్నారు.
ఇక, నరసరావుపేటలోనూ వైసీపీకి వ్యతిరేకత బాగానే పెరిగిందని అంటున్నారు. వరుస విజయాలు దక్కించుకున్న గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డికి సొంత కుంపట్లు పెరిగిపోయాయి. ప్రజల్లో సానుభూతి ఉన్నా.. ఆయనకు వ్యతిరేకంగా నాయకులు చేస్తున్న గ్రూపు రాజకీయాలు పార్టీలో అసంతృప్తులు వంటివి డామినేట్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో పక్కపక్కనే ఉండే ఈ మూడు నియోజకవర్గాల పరిస్థితి పార్టీ అధిష్టానాన్ని ఉక్కిరిబిక్కిరికి గురి చేస్తోందని అంటున్నారు తాడేపల్లి వర్గాలు.
This post was last modified on July 14, 2023 7:21 am
ఇప్పటి స్టార్ హీరోల కెరీర్లు చూస్తున్నాం. జీవిత కాలంలో మహా అయితే ఇరవై నుంచి నలభై సినిమాలు చేస్తే గొప్పనేలా…
ప్యారడైజ్ వచ్చేసింది కాబట్టి వేరే ఏ సినిమాలకు జనాలు లేరనుకుంటే పప్పులో కాలేసినట్టే. ఓటిటిలో వచ్చాక కూడా ఇరుముడి ఇంకా…
డిసెంబర్ 25 క్రిస్మస్ పండక్కు రిలీజ్ కావాల్సిన దాదా మళ్ళీ వాయిదా పడుతుందనే అనుమానాలు ఫిలిం నగర్ వర్గాల్లో మొదలయ్యాయి.…
సోషల్ మీడియా రాను రాను మరీ తీవ్రంగా మారిపోతోంది. ప్యారడైజ్ బాగుందా లేదానేది పక్కనపెడితే బెనిఫిట్ షో అయిన దగ్గరి…
డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవాలనుకునే వారికి ఆంధ్రప్రదేశ్‌లో కొత్త సదుపాయం అందుబాటులోకి వచ్చింది. లెర్నర్ లైసెన్స్ కోసం ఇప్పటివరకు స్లాట్ బుక్…
సోషల్ మీడియా రెండు వైపులా పదునున్న కత్తి. ఏదైనా పని జరగాలి, మెసేజ్ జనానికి చేరాలి అంటే.. దీని ద్వారా…