తెలంగాణలో రైతులకు 24 గంటల విద్యుత్ అవసరం లేదంటూ టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారం రేపుతోన్న సంగతి తెలిసిందే. ఈ వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలు మండిపడుతూ కాంగ్రెస్ కు వ్యతిరేకంగా నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కూడా తప్పుపట్టారు. రైతులకు మూడు గంటలు విద్యుత్ సరిపోతుంది అంటూ రేవంత్ చేసిన వ్యాఖ్యలపై కేటీఆర్ సెటైర్లు వేశారు. 3 పంటలు కావాలా 3 గంటలు కావాలా అంటూ కాంగ్రెస్ ను ఉద్దేశించి చురకలంటించారు.
ఇక, ఎమ్మెల్సీ కవిత కూడా రేవంత్ రెడ్డి వ్యాఖ్యలపై సోషల్ మీడియా వేదికగా పంచ్ లు వేశారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు 3 గంటలు మాత్రమే ఉచిత విద్యుత్ ఇస్తుందంటూ రేవంత్ పై విమర్శలు గుప్పించారు.
ఈ నేపథ్యంలోనే తాజాగా తన వ్యాఖ్యలపై రేవంత్ రెడ్డి స్పందించారు. కల్వకుంట్ల అన్నాచెల్లెళ్లు 3 గంటలని దుష్ప్రచారం చేసిన మూడు చెరువుల నీళ్లు తాగిన మూడోసారి అధికారంలోకి రావడం కల్ల అంటూ రేవంత్ ట్వీట్ చేశారు. రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని, రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తామని అన్నారు. ఈ ప్రకారం కాంగ్రెస్ తెలంగాణ ఇన్ చార్జ్ మాణిక్ ఠాక్రే మాట్లాడిన వీడియోను రేవంత్ ఆ ట్వీట్ కు యాడ్ చేశారు. బాయ్ బాయ్ కెసిఆర్ అంటూ హ్యాష్ ట్యాగ్ ను ట్రెండ్ చేస్తున్నారు.
అంతకుముందు, అమెరికాలోని తానా 23వ మహాసభల సందర్భంగా తెలంగాణలో ఉచిత విద్యుత్ పై రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే. రాష్ట్రంలో 90 శాతం మంది చిన్న, సన్నకారు రైతులే ఉన్నారని, 3 ఎకరాలలో వ్యవసాయం చేసే రైతులకు 3 గంటల విద్యుత్ సరిపోతుందని రేవంత్ వ్యాఖ్యానించారు. మొత్తంగా 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని, 8 గంటలు సరిపోతుందని రేవంత్ చేసిన వ్యాఖ్యలు దుమారం రేపాయి. కేసీఆర్ కమిషన్లకు కక్కుర్తి పడి 24 గంటలు ఉచిత విద్యుత్ ఇస్తున్నారని రేవంత్ చేసిన వ్యాఖ్యలు బీఆర్ఎస్ నేతలకు ఆగ్రహం తెప్పించాయి.
This post was last modified on July 13, 2023 7:32 am
ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్కు మరోసారి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ నుంచి ప్రశంసలు లభించాయి. గతంలోనూ పలు…
పండుగ అనగానే ఎవరైనా కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. ఏడాదంతా ఎంత బిజీగా ఉన్నా పండగ పూట.. కొంత సమయాన్ని ఫ్యామిలీకి…
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…