వచ్చే ఎన్నికల్లో విజయం దక్కించుకునేందుకు టీడీపీ చేస్తున్న ప్రయత్నాలు ప్రజల్లోకి బలంగా చేరుతు న్నాయి. ఇప్పటికే యువ నాయకుడు, మాజీ మంత్రి నారా లోకేష్ యువగళం పాదయాత్రతో దూకుడు ప్రదర్శిస్తున్నారు. మరోవైపు.. పార్టీ అధినేత చంద్రబాబు తనదైన శైలిలో నాయకులను లైన్‌లో పెడుతు న్నారు. ఆయనే స్వయంగా రంగంలోకి దిగి.. పార్టీని డెవలప్ చేస్తున్నారు. ఈ క్రమంలో మూడు రకాలుగా ఓటు బ్యాంకును వర్గీకరించారు.
వీటిలో పట్టణాలు, నగరాలు, గ్రామీణ ఓటు బ్యాంకు ఉన్నాయి. పట్టణ, నగర ఓటు బ్యాంకుపై చంద్రబాబుకు ఒక అవగాహన వచ్చింది. ప్రస్తుత ప్రభుత్వం వేస్తున్న పన్నులు.. ఇతర భారాలు, పెరుగుతున్న ధరలతో సామాన్యులు అల్లాడిపోతున్నారు. ఈ క్రమంలో వారు తమకు ఒకింత సాంత్వన ఇచ్చే సర్కారురావాలని కోరుకుంటున్నారు. ఇది టీడీపీకి అనుకూలంగా ఉందని చంద్రబాబు భావిస్తున్నారు. అంటే.. పట్టణాలు నగరాల్లో తన విజన్‌పై ప్రజల్లో అవగాహన ఉందని నమ్మకానికి వచ్చారు.
ఇక, ఇప్పుడు కీలకమైన గ్రామీణ ఓటు బ్యాంకుపై దృష్టి పెట్టారు. ఈ క్రమంలో గ్రామీణ స్థాయిలో సమస్యల పై ఆయన చక్రం తిప్పుతున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత చంద్రబాబు హయాంతో పోల్చు కుంటే.. ప్రస్తుతం గ్రామీణ స్థాయిలో పంచాయతీలకు ఎలాంటి ప్రాధాన్యం లేకుండా పోయిందనే వాదన బలంగా వినిపిస్తోంది. పైగా సర్పంచులు కూడా రోడ్డెక్కి అనేక చోట్ల ఉద్యమాలు చేశారు.. చేస్తున్నారు. తమకు కేటాయించిన నిధులను కూడా ప్రభుత్వం వాడేసుకుంటోందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఈ క్రమంలో చంద్రబాబు వ్యూహాత్మకంగా చక్రం తిప్పుతున్నారు. సర్పంచుల సమస్యలపై ఉమ్మడి ఐక్య వేదికను ఏర్పాటు చేయిస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఒకవైపు.. గ్రామీణ స్థాయిలో సమస్యలు వెల్లడించడం.. మరోవైపు సర్పంచులకు భరోసా ఇచ్చే కార్యక్రమాలు చేపట్టడం వంటివి ఒకే సమయంలో చేపట్టాలని చంద్రబాబు నిర్ణయించారు. ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్సీ.. సర్పంచుల చాంబర్ అధ్యక్షుడు వైవీబీ రాజేంద్రప్రసాద్‌ను మళ్లీ యాక్టివ్ చేశారని సీనియర్లు చెబుతున్నారు.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణస్థాయిలో సమస్యలను తెరమీదికి తేవడం.. పార్టీ పరంగా వారికి భరోసా ఇవ్వడంతో గ్రామీణ ఓటు బ్యాంకును తమకు అనుకూలంగా తిప్పుకోవాలనే ప్లాన్ చేస్తున్నట్టు చెబుతున్నారు.
This post was last modified on July 13, 2023 7:38 am
సాధారణంగా ప్రేమ విఫలమైతేనో, పెళ్లి ఆగిపోతేనో ఎవరైనా కొన్నాళ్లు డిప్రెషన్లోకి వెళ్తారు. ఆ బాధ నుంచి బయటపడటానికి నెలల సమయం…
తమ ప్రభుత్వం ప్రజలకు చేసిన మంచి పనుల గురించి వివరించడంలో చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారు. ఏపీ పునర్నిర్మాణానికి తమ ప్రభుత్వం…
టాలీవుడ్లో అత్యంత పొడవైన హీరోల లిస్టు తీస్తే.. అందులో రెబల్ స్టార్ ప్రభాస్ పేరే ముందు చెప్పుకోవాలన్నది వాస్తవం. టాలీవుడ్…
తెలంగాణ రాష్ట్రాన్ని వచ్చే 2047 నాటికి 3(30 లక్షల కోట్ల రూపాయలు) ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా రూపొందించడమే లక్ష్యంగా…
కాంగ్రెస్ అగ్రనేతే కాదు.. లోక్‌సభలో విపక్ష నాయకుడు కూడా అయిన రాహుల్‌గాంధీ.. తరచుగా తప్పులు చేస్తూనే ఉన్నారు. అయితే.. ఎప్పటికప్పుడు…
2009లో విడుదలైన బాలీవుడ్ మూవీ 3 ఇడియట్స్ ఒక సంచలనం. అమీర్ ఖాన్ లాంటి స్టార్ హీరోని కాలేజీ స్టూడెంట్…