వారాహి విజయయాత్ర మొదలైన దగ్గర్నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఫైర్ మామూలుగా లేదు. వైసీపీ ప్రభుత్వం మీద, అలాగే ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మీద ఆయన ఒక రేంజిలో ఫైర్ అవుతున్నారు. జగన్‌ను ఇక నుంచి మీరు అని కాకుండా నువ్వు అనే అంటానని.. ఆయన ముఖ్యమంత్రి పదవిలో కూర్చోవడానికి అర్హుడు కాడని పవన్ ఇటీవల వారాహి యాత్రలో చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశం అయిన సంగతి తెలిసిందే.
తాజాగా జనసేన కార్యకర్తల సమావేశంలో జగన్ మీద ఇంకాస్త గట్టిగానే టార్గెట్ చేశాడు జనసేనాని. జగన్ వేదికల మీద ప్రసంగాలు చేసేటపుడు ఎంత తడబడతారో తెలిసిందే. ఒకప్పుడు నారా లోకేష్ ఇలా తడబడితే విపరీతంగా గేలి చేసిన వైసీపీ శ్రేణులు ఇప్పుడు జగన్ తడబాటు చూసి ఏమంటాయన్నది ప్రశ్న. దీనికి అటునుంచి సమాధానమే ఉండదు.
ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్.. జగన్ తడబాటు మీద కౌంటర్లు వేస్తూ ప్రసంగించాడు. జగన్ పేరు ఎత్తకుండా మనం ఎలాంటి వ్యక్తి పాలనలో ఉన్నామంటే అని పవన్ తన ప్రసంగాన్ని మొదలుపెట్టగా.. అంతలోనే జనసైనికులు సైకో అని అరిచారు.
అందుకు పవన్ నవ్వుతూ.. అది అందరికీ తెలిసిందే కదా అని తన ప్రసంగాన్ని కొనసాగించాడు. పిండాకూడు అంటే పిండి వంటలు అనుకునేవాడు, తద్దినానికి అట్ల తద్దికి తేడా తెలియనివాడు, శ్రాద్ధానికి శ్రావణ శుక్రవారానికి తేడా తెలియనివాడు, అ కి ఆ కి తేడా తెలియనివాడు, వారాహి కి వరాహి కి తేడా తెలియనివాడు.. పెళ్ళికి వెళ్ళు ఒకటే నవ్వు, చావింటికి వెళ్ళు ఒక్కటే నవ్వు ఎవరైనా చెప్పండయ్యా జగన్‌కు అంటూ పవన్ పంచులు వేస్తుంటే జనసైనికుల నుంచి మామూలు రెస్పాన్స్ లేదు.
జగన్ పై ఇది మాస్ ర్యాగింగ్ అంటూ సోషల్ మీడియాలో పవన్ అభిమానులు, జనసైనికులు ఈ వీడియోను వైరల్ చేస్తున్నారు.
This post was last modified on July 12, 2023 8:22 am
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…