దెబ్బకు ఠా! అనే మాట వినే ఉంటారు. ఆ విషయం ఎలా ఉన్నా.. ఈ విషయంలో తెలంగాణలో కాంగ్రెస్ నేతలు ఒక్క మాటకు లైన్‌లోకి వచ్చేశారనే టాక్ వినిపిస్తోంది. అంతేకాదు.. పార్టీ అధిష్టానానికి కూడా బిగ్ రిలీఫేనని చెబుతున్నారు పరిశీలకులు. మంచికో.. చెడుకో.. ఆలోచించి అన్నారో.. లేక అన్యాపగా అనేశారో.. రేవంత్‌రెడ్డి ముఖ్యమంత్రి పీఠంపై ఒక వ్యాఖ్య అయితే చేసేశారు. ప్రస్తుత ములుగు నియోజకవర్గం ఎమ్మెల్యే సీతక్కను సీఎం చేయొచ్చు.. అని రేవంత్ వ్యాఖ్యానించారు.
ఈ మాట నిజమవుతుందా? కాదా.. అనే మీమాంస.. సందేహాలను పక్కన పెడితే.. కాంగ్రెస్‌లో సీఎం రేసులో ఉన్నవారి ముందర కాళ్లకు చక్కని బంధం అయిపోయింది. అంతేకాదు.. ఈ ఒక్క మాటతో కాంగ్రెస్ అధిష్టా నానికి కూడా బిగ్ రిలీఫ్ వచ్చేసినట్టేనని అంటున్నారు పరిశీలకులు. ఎందుకంటే.. రేపు పార్టీ అధికారంలోకి వచ్చినా.. సీఎం సీటు కోసం.. కర్ణాటకలో ఇద్దరు మాత్రమే కొట్టుకున్నంత పనిచేస్తే.. ఇక్కడ నలుగురు నుంచి పది మంది వరకు నాయకులు సీఎం రేసులో ఉన్నారు.
సో… ఈ పరిణామం.. ఎన్నికల్లో గెలిచిన కష్టం కన్నా ఎక్కువగా కాంగ్రెస్‌కు ఏర్పడుతుంది. కర్ణాటకలోనూ ఇదే కదా జరిగింది. ఎంతో కష్టపడి పార్టీని గెలిపించినా.. చివరకు ముఖ్యమంత్రి పీఠం విషయానికి వస్తే.. మాత్రం దానికి మించిన కష్టం పార్టీ పడాల్సి వచ్చింది. ఇక, తెలంగాణలో అధికారం కోసం ఆవురావురు మంటున్ననాయకులు రేపు ప్రజలు అధికారం కట్టబెట్టాక.. సీఎం సీటు కోసం కర్ణాటకను మించిన ఫైట్ చేసుకుంటారనడంలో సందేహం లేదు.
దీంతో అధిష్టానానికి తిప్పలు తప్పవు. సో.. ఇప్పుడు రేవంత్ చేసిన ఒకే ఒక్క ప్రకటన ఈ సమస్యలకు ఏకైక పరిష్కారంగా ఉందని అంటున్నారు పరిశీలకులు. ఇటు అధికార పార్టీని బలంగా ఎదుర్కొనేందుకు .. ప్రజల్లో సానుభూతి తెచ్చుకునేందుకు.. గెలుపు గుర్రం ఎక్కడానికి.. ముఖ్యంగా రేపు సీఎం సీటు కోసం నేతలు కొర్రీలు పెట్టుకోకుండా ఉండేందుకు కూడా సీతక్క మంత్రం పనిచేస్తుందని అంటున్నారు. సీతక్క అయితే.. విభేదించే నాయకులు దాదాపు ఉండరు. పైగా సామాజిక వర్గం పరంగా కూడా ఎవరూ అడ్డు చెప్పడానికి వీల్లేదు. సో.. దెబ్బకు ఠా! అన్నట్టుగా రేవంత్ చేసిన ప్రకటన కాంగ్రెస్‌ను దారిలో పెట్టేస్తుందని అంటున్నారు.
This post was last modified on July 11, 2023 2:25 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…