ఏపీ అధికార పార్టీ వైసీపీలో చాలా మంది నాయకులకు టికెట్లు ఇచ్చేది లేదని సీఎం జగన్ చెబుతున్నారు. సరే.. ఈమాట ఎలా ఉన్నా.. కీలకమైన నాయకులు, మంత్రులు అంతో ఇంతో ప్రయత్నాలు చేసి.. టికెట్లు దక్కిం చుకున్నా.. వారికి ఇప్పుడు ఓటమి భయం పట్టుకుందనే వాదన బలంగా వినిపిస్తోంది. రాయలసీమ నుంచి ఉత్తరాంధ్ర వరకు కూడా.. సుమారు 5 నుంచి ఆరుగురు మంత్రులకు ఇంటి పోరు ఎక్కువగా కనిపిస్తోంది.
ఎక్కడికక్కడ నాయకులకు సొంత పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి తీవ్రస్థాయిలో ఎదురుగాలి వీస్తోం ది. మంత్రులుగా ఉన్నవారిని కూడా వారు బహిరంగంగానే హెచ్చరిస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలా గెలుస్తారో చూస్తామని సవాళ్లు కూడా రువ్వుతున్నారు. దీంతో కీలక నేతలకు టికెట్ భయం కన్నా.. ఓటమి భయం వెంటాడుతుండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఉదాహరణకు నగరి, చిలకలూరిపేట, శ్రీకాకుళం, పలాస, కళ్యాణదుర్గం, శృంగవరపు కోట నియోజకవర్గాల్లోని మంత్రులకు సొంత పార్టీ నేతల నుంచి తీవ్రమైన ఎదురు గాలి వీస్తోంది. పలాసలో అయితే బహిరంగంగానే నాయకులు ఓడిస్తామని చెబుతున్నారు. ఇక, నగరిలో అయితే.. పొరుగు నియోజకవర్గాలకు చెందిన ఎమ్మెల్యేలు ఒకరిద్దరు కూడా.. మంత్రి రోజా ఓటమికి తాము కూడా చేయి కలుపుతామని చెబుతున్నా రు. దీంతో రోజా పరిస్థితి అత్యంత దారుణంగా ఉందని అంటున్నారు.
ఇక, శ్రీకాకుళంలో వ్యతిరేకత అండర్ కరెంటును తలపిస్తోంది. మంత్రి ధర్మానకు వ్యతిరేకంగా గత రెండు నెలలుగా గ్రూపు రాజకీయాలు సాగుతున్నాయి. దీంతో ఆయనను ప్రతిపక్ష నేతలు ఓడించాల్సిన అవసరం లేదని.. సొంత పార్టీ నాయకులే ఓడిస్తారని చెబుతున్నారు. అదేవిధంగా చిలకలూరిపేటలోనూ.. మంత్రి వ్యతిరేకంగా పోస్టర్లు వెలుస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాల్లో నాయకత్వం అయితే.. ఆమెను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కళ్యాణదుర్గంలోనూ.. మంత్రికి వ్యతిరేకంగా ముఠా రాజకీయాలు సాగుతున్నాయి. దీంతో మంత్రులుగా ఉన్నవారికి సెగతప్పదని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on July 11, 2023 12:12 pm
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…