ఏలూరు సభలో గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లపై, ఏపీ ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో పెను దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే పవన్ పై వైసీపీ నేతలు తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా పవన్ పై మాజీ మంత్రి పేర్ని నాని సంచలన వ్యాఖ్యలు చేశారు. వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలకు పవన్ బహిరంగ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు కాళ్లు పవన్ మొక్కితే ఇబ్బంది లేదని, కానీ వాలంటీర్లపై తప్పుడు మాటలు మాట్లాడితే సహించబోమని వార్నింగ్ ఇచ్చారు.
జగన్ ను ఏకవచనంతో పిలిచి చూడాలని ఛాలెంజ్ చేశారు. పవన్ ఒక్కడికే నాలుక లేదని, వైసీపీ జెండా మోసే ప్రతి కార్యకర్తకు నాలుక ఉందని హెచ్చరించారు. చంద్రబాబు హయాంలో మహిళల మిస్సింగ్ గురించి పవన్ ఎప్పుడూ మాట్లాడలేదని మండిపడ్డారు. టీడీపీ హయాంలో మొత్తం 16 వేలకు పైగా మిస్సింగ్ కేసులు నమోదయ్యాయని, వాటిపై మాట్లాడకుండా వాలంటీర్లపై విమర్శలు చేయడం సరికాదని అన్నారు.
చంద్రబాబు ఏం చెప్తే అది మాట్లాడటం, విషం చిమ్మడం సరికాదని, వాటికి ఆధారాలు చూపించాలని డిమాండ్ చేశారు. సచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థను చూసి పవన్, చంద్రబాబులకు భయం పట్టుకుందని, రెండున్నర లక్షల మంది వాలంటీర్లు ప్రజలకు సేవలు చేయడాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారని అన్నారు. అందుకే వాలంటీర్లను చెడ్డగా చిత్రీకరించే ప్రయత్నం చేస్తున్నారని నిప్పులు చెరిగారు.
జనసేన ప్రభుత్వంగానీ, టీడీపీ ప్రభుత్వం గానీ వచ్చిన వెంటనే వాలంటీర్ల వ్యవస్థను రద్దు చేస్తామని మేనిఫెస్టోలో పెట్టగలరా అని నాని…చంద్రబాబు, పవన్ లకు సవాల్ విసిరారు. వాలంటీర్లపై చేసిన వ్యాఖ్యలు పవన్ జీవితానికి మాయని మచ్చ కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబుతో రాజకీయాలు చేయాలంటే మా తమ్ముడు కరెక్ట్ అని చిరంజీవి గతంలో అభిప్రాయపడ్డారని, చిరంజీవి అలా ఎందుకు అన్నారో ఇప్పుడు అర్థమైందని చెప్పారు. చిరంజీవికి, పవన్ కు నక్కకు నాగలోకానికి ఉన్నంత తేడా ఉందని అన్నారు.
This post was last modified on July 10, 2023 9:22 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…