రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ స్ధానాల్లో మళ్ళీ గెలుపుపై చంద్రబాబునాయుడు దృష్టిపెట్టినట్లు సమాచారం. హ్యాట్రిక్ స్ధానాల్లో నాలుగోసారి గెలిచి పార్టీసత్తాను చాటాలన్నది చంద్రబాబు ఆలోచన. ఇందుకు వీలుగా గెలుపుకోసం హ్యాట్రిక్ వీరులతో చంద్రబాబు ఇప్పటికే అవసరమైన సూచనలు, సలహాలు అందించినట్లు పార్టీవర్గాలు చెప్పాయి. 2009, 2014, 19 ఎన్నికల్లో టీడీపీ వరుసగా విజయాలు సాధించిన సీట్లు రాష్ట్రం మొత్తం మీద ఏడు నియోజకవర్గాలున్నాయి. వీటిల్లో గెలుపును కంటిన్యుచేస్తే నాలుగోసారి కూడా గెలిచినట్లవుతుందన్నది చంద్రబాబు ఆలోచన.
హ్యాట్రిక్ సీట్లు సాధించిన నియోజకవర్గాలు కుప్పం, హిందుపురం, గన్నవరం, మండపేట, విశాఖపట్నం తూర్పు, రాజమండ్రి రూరల్, ఇచ్చాపురం ఉన్నాయి. వీటిల్లో రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో బుచ్చయ్య చౌదరి గెలిచింది రెండుసార్లే అయినా అంతకుముందు అంటే 2009లో చందన రమేష్ గెలిచారు. అంటే రెండు ఎన్నికల్లో అభ్యర్ధులు మారినా మూడు ఎన్నికల్లో వరుసగా టీడీపీనే గెలుస్తోంది.
ఇక గన్నవరంలో వల్లభనేని వంశీ గెలిచినా తర్వాత చంద్రబాబుకు దూరమైపోయి జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యారు. దాంతో రాబోయే ఎన్నికల్లో గన్నవరంలో టీడీపీ జెండా ఎగరేయాలని చంద్రబాబు చాలా పట్టుదలగా ఉన్నారు. ఇక్కడ బచ్చుల అర్జునుడిని ఇన్చార్జిగా నియమించినా ఆయన ఈమధ్యనే మరణించారు. అందుకనే ఇక్కడ గట్టి అభ్యర్ధిని రంగంలోకి దింపేందుకు కొన్ని పేర్లను పరిశీలిస్తున్నారు. నందమూరి వంశం నుండి ఎవరినైనా పోటీపెడితే ఎలాగుంటుందనే ఆలోచన కూడా ఉంది. మరి ఈ సీటు విషయంలో ఏమిచేస్తారో చూడాలి.
అలాగే హిందుపురంలో కూడా రెండు ఎన్నికల్లో నందమూరి బాలకృష్ణ గెలిచారు. మూడోసారి గెలిస్తే బాలకృష్ణ హ్యాట్రిక్ విజయం సాధించినట్లవుతుంది. పార్టీ 1983లో పెట్టినప్పటినుండి ఇప్పటివరకు ఓటమెరుగని నియోజకవర్గం హిందుపురమే. ఇచ్చాపురంలో బెందాళం అశోక్ కూడా 2014, 19 ఎన్నికల్లో రెండుసార్లు గెలిచారు. మూడో ఎన్నికల్లో పోటీచేసి హ్యాట్రిక్ కొట్టాలని పట్టుదలగా ఉన్నారు. వెలగపూడి రామకృష్ణ విశాఖపట్నం తూర్పులోను, మండపేటలో జోగేశ్వరరావు ఇప్పటికే హ్యాట్రిక్ విజయాలు సాధించారు. కుప్పంలో చంద్రబాబు మాత్రమే వరుసగా ఆరుసార్లుగా గెలుస్తున్నారు. మొత్తానికి అభ్యర్ధులకు లేదా టీడీపీకి హ్యాట్రిక్ విజయాలపై చంద్రబాబు ప్రత్యేక దృష్టిపెట్టినట్లు అర్ధమవుతోంది.
This post was last modified on July 10, 2023 1:35 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…