వచ్చే ఎన్నికల్లో అధికారం దక్కించుకునేందుకు తీవ్రస్థాయిలో శ్రమిస్తున్న తెలుగు దేశం పార్టీలో కొందరు పనిచేస్తుండగా.. మరికొందరు ఉత్సవ విగ్రహాలుగా ఉన్నారనే వాదన కొన్నాళ్లుగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. ఎన్నికలు దగ్గర పడేసరికి ఈవాదన మరింత బలంగా వినిపిస్తోంది. ఎక్కడికక్కడ చాలా మంది నాయకులు.. తమ అంతర్గత సంభాషణల్లో ఇదే వాదనను తెరమీదికి తెస్తున్నారు.
“మేం నాలుగేళ్లుగా పార్టీ కోసం పనిచేస్తున్నాం. కానీ, ఈ నాలుగేళ్లలో మౌనంగా ఉన్న నాయకులు.. కనీసం పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయని నాయకులకు ప్రాధాన్యం ఇస్తున్నారు. దీనివల్ల కేడర్‌కు సమాధానం చెప్పుకోలేక పోతున్నాం” అని.. మాజీ ఎమ్మెల్యే ఒకరు బాహాటంగా మీడియా ముందు వ్యాఖ్యానించా రు. మరికొందరు.. క్షేత్రస్థాయిలో ఎవరు పనిచేస్తున్నారో.. ఎవరు చేయడంలో తెలుసుకుని టికెట్లు ఇస్తే బాగుంటుందని చెబుతున్నారు.
ప్రస్తుతం చంద్రబాబు నాయుడు.. నియోజకవర్గాలకు అభ్యర్థులను ఖరారు చేసే పనిలో బిజీగా ఉన్నారు. ముందస్తు ఎన్నికలు జరిగే అవకాశం ఉందని భావిస్తున్న నేపథ్యంలో మెజారిటీ స్థానాల్లో అభ్యర్థులను ఖరారు చేసే పనిని చేపట్టారు. ఈ క్రమంలోనే పార్టీలో యాక్టివ్‌గా ఉంటున్న నాయకులు.. ఎన్టీఆర్ భవన్ కు వచ్చి.. తమ వాదనను.. విన్నపాలను అధిష్టానానికి అందజేస్తున్నారు.
అయితే.. వచ్చే ఎన్నికలు అత్యంత కీలకమైనవని.. అందరినీ కలుపుకొని పోయేందుకు పార్టీ అన్ని విధా లా పనిచేస్తోందని చంద్రబాబు వారికి నచ్చ జెపుతున్నారు. ప్రస్తుతం వ్యక్తులతో సంబంధం లేకుండా పార్టీని అధికారంలోకి తీసుకురావాలనే లక్ష్యంతోనే అందరూ పనిచేయాలని ఆయన సూచిస్తున్నారు. దీనికి కొందరు సమ్మతిస్తుండగా.. మరికొందరు మాత్రం బిక్కమొహం వేసుకుని వెళ్లిపోతున్నారు. అయితే.. పార్టీ అధినేత మాత్రం గెలుపు గుర్రాలు అనే వారికి మాత్రమే టికెట్‌లు ఇస్తామని.. ఇందులో మొహమాటాలకు తావు లేదని తేల్చి చెబుతున్నారు.
This post was last modified on July 10, 2023 1:22 pm
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…