తూర్పు గోదావరి జిల్లాలో కాపు సామాజిక వర్గం ప్రభావం చూపించే నియోజకవర్గం జగ్గంపేట. ఇక్కడ బాబా యి-అబ్బాయిల మధ్యే పోరు సాగుతోంది. ఒకరు వైసీపీలో ఉంటే.. మరొకరు టీడీపీలో చక్రం తిప్పుతున్నా రు. వారే జ్యోతుల ఫ్యామిలీకి చెందిన ప్రస్తుత ఎమ్మెల్యే జ్యోతుల చంటిబాబు, టీడీపీ సీనియర్ నాయకుడు.. జ్యోతుల నెహ్రూ. గత ఎన్నికల్లో వీరిద్దరూ తలపడ్డారు. అయితే, బాబాయి నెహ్రూ పై అబ్బాయి చంటి విజయం దక్కించుకుని వైసీపీ జెండా ఎగరేశారు.
ఇదిలావుంటే.. ఇప్పుడు టీడీపీ ఇక్కడ విజయం దక్కించుకునే అవకాశం ఉందనే సంకేతాలు వస్తున్నాయి. ఈ టికెట్‌ను అధికారికంగా ఇంకా కన్ఫర్మ్ చేయకపోయినా.. నెహ్రూకే మరోసారి చాన్స్ ఇస్తారని తెలు స్తోంది. ఇదే జరిగితే.. ఆయన గెలుపు తధ్యమనే ప్రచారం ఉంది. ఒక వేళ నెహ్రూ కనుక గెలిస్తే.. 1999 తర్వాత టీడీపీ ఇక్కడ రికార్డు సృష్టించినట్టు అవుతుంది. ఎందుకంటే.. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇక్కడ టీడీపీ విజయం దక్కించుకోలేక పోయింది.
1999లో జ్యోతుల నెహ్రూనే టీడీపీ తరఫున విజయం దక్కించుకున్నారు. తర్వాత.. 2004, 2009లో కాంగ్రెస్ ఇక్కడ విజయం దక్కించుకుని.. తోట నరసింహం గెలిచారు. ఇక, 2014లో వైసీపీలో చేరిన జ్యోతుల నెహ్రూ(వాస్తవానికి టీడీపీ నుంచి ప్రజారాజ్యంలోకి వెళ్లారు. అటు నుంచి వైసీపీలోకి వచ్చారు) ఆ ఎన్నికల్లో జగ్గంపేట నుంచి విజయం దక్కించుకున్నారు. అయితే, 2017-18 మధ్య ఆయన మళ్లీ టీడీపీ చెంతకు చేరుకున్నారు.
2019లో వైసీపీ తరఫున ఆయన సోదరుడి కుమారుడు జ్యోతుల చంటిబాబు వైసీపీ తరఫున టికెట్ దక్కించుకుని పోటీ చేయగా.. అదే ఎన్నికల్లో టీడీపీ తరఫున నెహ్రూ పోటీ చేశారు. కానీ నెహ్రూ మాత్రం ఓటిపోయారు. ఇక, ఇప్పుడు మరోసారి ఆయనకే టికెట్ ఇస్తే.. గెలుపు గుర్రం ఎక్కడం ఖాయమనే అంచనాలు వస్తున్నాయి. ఒకవేళ నెహ్రూ గెలిస్తే.. 1999 తర్వాత అంటే సుమారు నాలుగు ఎన్నికల తర్వాత(20 ఏళ్లకు) టీడీపీ గెలిచే స్థానం ఇదేనని అంటున్నారు.
This post was last modified on July 9, 2023 6:45 pm
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటిపై రాళ్ల దాడి జరిగింది. ఈ ఘటనలో కొందరు ఆందోళన కారులను పోలీసులు అరెస్టు…