ఔను.. ఈ మాటే తాడేపల్లి వర్గాల్లో వినిపిస్తోంది. ప్రస్తుతం ఎమ్మెల్యేలుగా ఉన్నవారు.. మంత్రులుగా ఉన్న వారిలో చాలా మంది సీఎం జగన్‌కు చాలా క్లోజ్. ఆయన పేరును పచ్చ వేయించుకున్నవారు.. ఆయన పేరుతో ఇంటి నిర్మాణాలు చేసుకున్నవారు. వారి పిల్లలకు జగన్ పేరు పెట్టుకున్నవారు..ఆయన ఫొటోల ను కూర్చి.. ఉంగరాలు చేయించుకున్నవారు ఇలా.. కొందరు మంత్రులు.. మరికొందరు ఎమ్మెల్యేలు ఉన్నారు.
వీరంతా కూడా.. జగన్‌కు క్లోజ్ అన్నమాట వాస్తవం. అయితే.. వీరి పరిస్థితి ఇప్పుడు ఇబ్బందుల్లో పడింది. జగన్‌కు క్లోజ్‌గా ఉంటే సరిపోతుందా.. జనాలకు క్లోజ్ అయితేనే కదా.. గెలుపు గుర్రాలు ఎక్కేది. ఇక్కడే సమస్య తెరమీదికి వచ్చింది. నాలుగేళ్లుగా.. తమను పట్టించుకోలేదని, ఇప్పుడు వచ్చారా? అంటూ.. గడప గడపకీ మన ప్రభుత్వం కార్యక్రమంలో ఇతర నేతలకు ఎదురవుతున్న సమస్యే వీరికి కూడా ఎదురవుతోం ది.
ఇలాంటి వారిలో మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి, మాజీ మంత్రి పేర్ని నాని, ప్రస్తుత మంత్రి నారాయ ణస్వామి, మంత్రి అమర్నాథ్, అంబటి రాంబాబు సహా.. ఎమ్మెల్యేలు ఉన్నారు. వీరంతా జగన్‌కు క్లోజే. కానీ, జనాలకు దూరమవుతున్నారనే వాదన వినిపిస్తోంది. ఎక్కడికక్కడ వీరిని ప్రజలు నిలదీస్తున్నారు. దీంతో వీరి పరిస్థితి ఇబ్బందుల్లో పడింది. పోనీ.. ఇలాంటి వారిని పక్కన పెడదామా? అంటే.. సాధ్యం కాదు.
జగన్‌కు ఉన్న సాన్నిహిత్యం, సామాజిక వర్గాల పరంగా చూసుకున్నా.. వారికి ప్రాధాన్యం ఇవ్వాలి. ఇక, ఎమ్మెల్యేల విషయానికి వస్తే.. మాజీ మంత్రి, విజయవాడ పశ్చిమ నేత వెల్లంపల్లి శ్రీనివాసరావు, గడికోట శ్రీకాంత్ రెడ్డి(రాయచోటి), రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి (ప్రొద్దుటూరు) ఇలా చెప్పుకొంటూ పదుల సంఖ్యలో వీరు తేలుతున్నారు. దీంతో జగన్ ఏం చేస్తారనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఏతావాతా ఎలా చూసుకున్నా.. జగన్‌కు క్లోజ్ అనేది పక్కన పెట్టి జనాలకు వీరు చేరువ కావాల్సిన అవసరం ఉందనే టాక్ వినిపిస్తోంది.
This post was last modified on July 9, 2023 1:58 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…