ఏపీ సీఎం జగన్ వ్యవహార శైలిపై తాజాగా కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు సీరియస్ అయింది. తాము ఒక కార్యక్రమం కోసం ఇచ్చిన సొమ్ములను.. ఆ కార్యక్రమానికి ఖర్చు చేయకపోగా.. కనీసం మాట మాత్రం కూడా చెప్పకుండా.. వేరే వాటికి ఎలా వాడేస్తారని నిలదీసింది. ఈ క్రమంలో సుమారు 639 కోట్ల రూపాయలను ఏం చేశారని కేంద్ర సర్కారు నిలదీసింది. అంతేకాదు.. తక్షణం ఈ నిధులను సంబంధిత ఖాతాలో జమ చేసి రసీదులను పంపించాలని ఆదేశించింది. ఈ విషయం ప్రభుత్వంలో తీవ్ర కలకలం రేపింది.
ఏం జరిగిందంటే..
కేంద్రంలోని నరేంద్ర మోడీ సర్కారు.. ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద.. అన్ని రాష్ట్రాల్లోని పేదలకు ఇళ్లు నిర్మించా లనే లక్ష్యాన్నినిర్ణయించుకుంది. ఈ క్రమంలో 90 శాతం నిధులను కేంద్రమే ఇస్తోంది. మిగిలిన 10 శాతం నిధులను రాష్ట్రాలు భరించాలని, లబ్ధి దారులను ఎంపిక చేసి.. ఇళ్లను నిర్మించి ఇవ్వాలని పేర్కొంది. ఈ క్రమంలో ఏపీకి సంబంధించి కూడా ఏటా నిధులు ఇస్తోంది. అయితే.. ఈ నిధుల్లో తాజాగా రూ.639 కోట్లను జగన్ ప్రభుత్వం వేరే పథకాలకు వాడేసింది.
గృహ నిర్మాణానికి ఇచ్చిన నిధులు దారిమళ్లించిన ఘటన తెలిసిన వెంటనే మోడీ సర్కారు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసింది. కనీసం జీవో కూడా లేకుండా రూ.1,039 కోట్ల నిధుల్లో రూ.639 కోట్లను దారిమళ్లించడంపై తీవ్ర అభ్యంతరం తెలిపింది. తక్షణమే సింగిల్ నోడల్ ఖాతాకు ఆ నిధులు జమ చేయాలని ఆదేశించింది. పీఎం ఆవాస్ యోజన పథకం కింద గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో ఇళ్లకు కేంద్రం ఈ ఏడాది రూ.3,084 కోట్లు మంజూరు చేసింది. అందులో రూ.1879 కోట్లు కేంద్రం విడుదల చేసింది.
ఈ మొత్తంలో నుంచి మరో రూ.639 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడేసింది. రాష్ట్ర వాటాగా ఇవ్వాల్సిన రూ.385 కోట్లతో పాటు రూ.113 కోట్ల రూపాయల మేర బిల్లులను రాష్ట్ర గృహనిర్మాణశాఖ బకాయి పెట్టింది. ప్రస్తుతం ఉమ్మడిగా నిర్వహించే సింగిల్ నోడల్ ఖాతాలో కేవలం రూ.1.5 కోట్లు మాత్రమే మిగిలాయి. మరో వైపు పీఎం ఆవాస్ యోజనలో రాష్ట్ర వాటా రూ.221 కోట్లు ఇవ్వకపోవడంతో కేంద్రం రూ.1,174 కోట్ల నిధుల్ని నిలిపివేసింది. ఈ పరిణామాలపై ఉప్పందిన కేంద్రం తాజాగా జగన్‌ను నిలదీయడం గమనార్హం.
This post was last modified on July 9, 2023 11:19 am
రాయలసీమలో ఇండియన్ స్కూల్ ఆఫ్ అగ్రికల్చర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జరిగిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రముఖ…
దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…
సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…
ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…
కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…
ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…