వైసీపీలో కుమ్ములాటలు.. ఆత్మ స్థయిర్యం కోల్పోతున్న వైనం స్పష్టంగా తెరమీదికి వచ్చింది. ఎక్కడికక్కడ నాయకులు తమకు టికెట్ వస్తుందో రాదో అనే భయం వెంటాడుతోంది. ఈ క్రమంలో వారు.. ఎవరికివారే మౌనంగా ఉంటున్నారు. ఇది.. ఏకంగా.. వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి కార్యక్రమంపై ప్రభావం చూపించిందని అంటున్నారు పరిశీలకులు. శనివారం(జూలై 8) వైఎస్ జయంతి. కానీ, ఎక్కడా ఆ జోష్ కనిపించడం లేదు.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తొలి మూడేళ్లపాటు వైఎస్ జయంతిని రాష్ట్ర వ్యాప్తంగా నాయకులు ఘనంగా నిర్వహించారు. కొన్ని చోట్ల పేదలకు అన్నదానాలు కూడా చేశారు. ఇక, రాష్ట్ర వ్యాప్తంగా.. వైఎస్ కీర్తిని కూడా ప్రచారం చేశారు. అయితే.. అనూహ్యంగా ఈ ఏడాది ఎక్కడా అలాంటి సంబరాలు ఏవీ కనిపించ డం లేదు. ముఖ్యమంత్రి జగన్.. యథావిథిగా.. తన తండ్రి ఘాట్‌కు వెళ్లిపోయారు. పులివెందులలో పర్యటిస్తున్నారు.
మరి క్షేత్రస్థాయిలో వైఎస్ జయంతిని ఎవరు నిర్వహించాలి? అనే ప్రశ్నకు మాత్రం నాయకుల నుంచి ఎలాంటి ఆన్సర్ కనిపించడం లేదు. దీనికి కారణం.. మీరు చేస్తారంటే.. మీరు చేస్తారులే.. అని నాయకులు ఒకరిపై ఒకరు ఆరోపించుకుంటున్న పరిస్థితి కనిపిస్తోంది. కానీ, ఎవరూ ముందుకు రావడం లేదు.. వైఎస్ జయంతిని నిర్వహించడమూ లేదు. మరోవైపు.. ఇంకొందరు నాయకులు తెలివి ప్రదర్శిస్తున్నారనే కామెంట్లు వినిపిస్తున్నాయి.
ఉచితంగా వచ్చే సోషల్ మీడియాలో వైఎస్ ఎంబ్లమ్‌లు రూపొందించి.. వాటిపై తమ ఫొటోలు వేసుకుని.. నివాళులర్పిస్తున్నట్టు.. జయంతిని ఘనంగా నిర్వహిస్తున్నట్టు ప్రచారం చేస్తున్నారు. అంటే.. వీరు వైఎస్ ను ఒక రకంగా.. సోషల్ మీడియాకే పరిమితం చేసినట్టు అయింది. ఇక, సీమలోని ఒకరిద్దరు ఎమ్మెల్యేలు మాత్రమే తమ సొంత కార్యాలయాల్లో వైఎస్ చిత్రపటానికి నివాళులర్పించారు. సో.. మొత్తంగా చూసుకుంటే.. వైసీపీలో వైఎస్ జోష్ ఎక్కడా కనిపించడం లేదని అంటున్నారు పరిశీలకులు.
This post was last modified on July 8, 2023 1:41 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…