తొందరలోనే రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఎంఎల్ఏల పనితీరుపై ఐప్యాక్ విస్తృతంగా సర్వేల మీద సర్వేలు నిర్వహిస్తోంది. ఐప్యాక్ బృందం తయారుచేసిన సర్వే రిపోర్టుపై జగన్మోహన్ రెడ్డి శుక్రవారం సుదీర్ఘంగా సమీక్ష నిర్వహించారు. ఎంఎల్ఏల మీద ఉన్న ప్లస్సులు, మైనస్సులతో పాటు జనాల్లో ఉన్న అభిప్రాయాలు, వ్యతిరేకత తదితర అంశాలపైన కూడా ఐప్యాక్ బృందం క్లారిటితో రిపోర్టు సబ్మిట్ చేసినట్లు సమాచారం. అందుకనే జగన్ కూడా అంత సుదీర్ఘంగా సమీక్షలు నిర్వహిస్తున్నది.
సరే ఈ విషయాన్ని పక్కనపెట్టేస్తే చాలామంది ఎంఎల్ఏలు తమ నియోజకవర్గాల్లో సొంతంగా సర్వేలు చేయించుకుంటున్నారు. దీనికి కారణం ఏమిటంటే ఐప్యాక్ చేస్తున్న సర్వేల మీద పూర్తిగా నమ్మకంలేకేనా అన్నదే అర్ధంకావటంలేదు. ఎంఎల్ఏలు చేయించుకుంటున్న సర్వేల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత స్పష్టంగా బయటపడుతోందట. ఐప్యాక్ చేస్తున్న సర్వేల్లో ప్రభుత్వం అంతా బ్రహ్మాండమని, ఎంఎల్ఏల్లో కొందరిపైన వ్యతిరేకత ఉందని ఫీడబ్యాక్ వస్తోంది.
ఇదే సమయంలో ఎంఎల్ఏలు చేయించుకుంటున్న సర్వేల్లో ప్రభుత్వం మీద వ్యతిరేకత స్పష్టంగా బయటపడుతోందట. ప్రభుత్వం ఇన్ని సంక్షేమపథకాలు అమలుచేస్తున్నా ఇంకా వ్యతిరేకత ఎందుకుందో ఎంఎల్ఏలకు అర్ధంకావటంలేదని సమాచారం. వివిధ రకాల పన్నులు పెంచడం, విద్యుత్ చార్జీలు పెరుగుతుండటం, నిత్యావసరాల ధరలు పెరిగిపోతుందటం లాంటివి జనాలపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు అర్ధమవుతోందట. వచ్చేఎన్నికల్లో పోటీ ఆయా పార్టీల అభ్యర్ధుల మధ్య కాకుండా డైరెక్టుగా జగన్మోహన్ రెడ్డి-చంద్రబాబు మధ్యే అన్నట్లుగా ఉందట.
అందుకనే వైసీపీ ఎంఎల్ఏలు రాబోయే ఎన్నికల్లో టీడీపీ పొత్తుల విషయమై చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. టీడీపీ ఒంటరిగా పోటీచేస్తే ఫలితం ఒకలాగుంటుంది. అదే టీడీపీ గనుక జనసేనతో పొత్తులో వెళితే రిజల్టు ఇంకోలాగ ఉంటుంది. ఇదే సమయంలో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి వెళితే ఫలితం మరోలాగ ఉంటుందని ఎంఎల్ఏలకు కూడా జనాల ఫీడ్ బ్యాక్ అందుతోందట. అందుకనే టీడీపీ పెట్టుకోబోయే పొత్తులపైన వైసీపీలో కూడా బాగా ఆసక్తి పెరిగిపోతోంది. మొత్తంమీద పొత్తుల సంగతిని పక్కనపెట్టేస్తే ఐప్యాక్ కు సమాంతరంగా ఎంఎల్ఏలు కూడా ఫీడ్ బ్యాక్ కోసం సర్వేలు చేయించుకున్నారన్న విషయం తేలిపోయింది.
This post was last modified on July 8, 2023 1:32 pm
బయట తన హీరోలతోనే కాక తన టీంలో అందరితో చాలా సరదాగా ఉంటూ.. క్లోజ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తుంటాడు రాజమౌళి.…
కన్నడ కి అతి దగ్గర గా ఉండే లిపి తెలుగే. బళ్లారి ఆంధ్ర సరిహద్దు పట్టణం తెలుగు కూడా మాట్లాడుతారు.…
వెల్లులి బెట్టి పొగిచిన పుల్లని గోంగూర రుచిని బొగడగ వశమా? అంటూ గోంగూర రుచిని పొగిడారో తెలుగు కవి. గోంగూరకు…
ఏడు పదుల వయసులో రకరకాల పాత్రలు చేస్తూ తనకు తాను ఛాలెంజ్ విసురుకుంటున్న మలయాళం స్టార్ మమ్ముట్టి కొత్త సినిమా…
ఒకరికి శాపం మరొకరికి వరం అయ్యిందన్న తరహాలో అఖండ 2 వాయిదా బాలీవుడ్ మూవీ దురంధర్ కు భలే కలిసి…
బాలయ్య కెరీర్ లోనే మొదటిసారి ఇలాంటి పరిస్థితి చూస్తున్నామా అన్నట్టుగా అఖండ 2 తాలూకు పరిణామాలు ఫ్యాన్స్ ని బాగా…