వైసీపీ అధినేత సీఎం జగన్ సోదరి, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. అంతేకాదు.. వెంటనే అమలు కూడా చేసేశారు. దీంతో అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అంతేకాదు.. రాజకీయంగా కూడా ఈ చర్య చర్చనీయాంశంగా మారింది. శనివారం వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ నుంచి కడపకు వచ్చిన షర్మిల వెంట ఆమె కుమారుడు రాజారెడ్డి, కుమార్తె అంజలి కూడా ఉన్నారు. అయితే.. కడప విమానాశ్రయానికి వచ్చీరావడంతోనే షర్మిల తన ఇద్దరు బిడ్డలను వెంట బెట్టుకుని వేంపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి వెళ్లారు.
ఎవరూ ఊహించని విధంగా ఇడుపులపాయలో తన పేరుతో ఉన్న 9.53 ఎకరాలను కుమారుడు రాజారెడ్డి పేరుతో షర్మిల రిజిస్ట్రేషన్ చేశారు. అదేవిధంగా ఇడుపులపాయ ఎస్టేట్ వ్యవహారాలు చూసే వెంగమునిరెడ్డి నుంచి షర్మిల కొనుగోలు చేసిన 2.12 ఎకరాల భూమిని కుమార్తె అంజలి పేరిట రిజిస్ట్రేషన్ చేశారు. అనంతరం షర్మిల కుటుంబ సభ్యులు వేంపల్లి రిజిస్ట్రేషన్ కార్యాలయం నుంచి ఇడుపులపాయ ఎస్టేట్‌కు చేరుకున్నారు. అయితే.. ఈ అనూహ్య పరిణామం వెనుక ఏం జరిగిందనే చర్చ సాగుతోం ది.
షర్మిల పేరుతో ఉన్న రికార్డులను వెంటనే మార్చేందుకు కారణం.. వచ్చే ఎన్నికల్లో తాను పోటీ చేసినప్పుడు అఫిడవిట్ సమస్య లు వస్తాయనైనా భావించి ఉండాలని.. లేక.. రాజకీయంగా దీనిని వినియోగించుకునే చర్యల్లో భాగమైనా అయి ఉండాలని పొలిటికల్ పరిశీలకులు చెబుతున్నారు. లేకపోతే.. అన్న జగన్‌తో ఉన్న విభేదాల నేపథ్యంలో ఇలా హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నారా? అనే చర్చ కూడా సాగుతోంది. ఏదేమైనా షర్మిల ఎందుకు ఇంత హఠాత్తుగా నిర్ణయం తీసుకున్నారనేది మాత్రం ఆసక్తిగా మారింది.
This post was last modified on July 7, 2023 9:53 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…