కీలకమైన అంశం ఒకటి చాలా ఆలస్యంగా బయటకు వచ్చింది. అది కూడా మంత్రి కేటీఆర్ తనకు తానుగా ట్వీట్ చేసిన తర్వాత మాత్రమే బయటకు రావటం మరో విశేషంగా చెప్పక తప్పదు. ఇంతకూ జరిగిందేమంటే.. బుధవారం ఫుడ్ ప్రాసెసింగ్.. లాజిస్టిక్ పాలసీలపై మంత్రి కేటీఆర్ పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వటం తెలిసిందే. త్వరలో చేపట్టే పాలసీలను మంత్రులకు వివరించారు.
ఇంచుమించే ఇదే విషయం గురువారం అన్ని పేపర్లలోనూ.. టీవీ చానళ్లలోనూ ప్రసారమైంది. అయితే.. అన్ని మీడియా సంస్థలు.. అసలు పాయింట్ ను వదిలేసి కొసరి పాయింట్ ను పట్టుకొని వార్తల్ని ప్రజలకు అందించారు.
కొద్ది గంటల క్రితం మంత్రి కేటీఆర్ స్పందిస్తూ.. గౌరవనీయ ముఖ్యమంత్రి ఆదేశాల ప్రకారం.. ఫుడ్ ప్రాసెసింగ్.. లాజిస్టిక్స్ పాలసీలను కేబినెట్ మిత్రులందరికి వివరించినట్లుగా మంత్రి కేటీఆర్ ట్విట్టర్ లో పేర్కొన్నారు. అంతేకాదు.. ఈ ప్రజంటేషన్ కార్యక్రమం ఏకంగా ఎనిమిది గంటల పాటు సాగిందని.. ఆ సందర్భంగా చర్చకు వచ్చిన కీలక అంశాల్ని త్వరలో జరిగే కేబినెట్ మీటింగ్ లో చర్చించనున్నట్లు వెల్లడించారు.
అప్పటివరకు కేబినెట్ మంత్రులంతా కలిసి మంత్రి కేటీఆర్ ఆధ్వర్యంలో సమావేశం జరగటం.. అది కేబినెట్ తరహాలోనే జరిగిందన్న విషయం బయటకు వచ్చింది. ఇంత కీలక పరిణామం జరిగినా.. మీడియాలో కవర్ కాకపోవటం గమనార్హం.
ఇలా ముఖ్యమంత్రి లేకుండా మంత్రులంతా కలిసి సమావేశమైన సందర్భాలు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రెండుసార్లు చోటు చేసుకుంటే.. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మాత్రం ఇదే తొలిసారిగా చెప్పక తప్పదు.
అలిపిరి దగ్గర చంద్రబాబు మీద దాడి జరిగిన సమయంలో అప్పటి హోంమంత్రి దేవేందర్ గౌడ్ నాయకత్వంలో కేబినెట్ భేటీ జరగ్గా.. అలిపిరి వద్ద వైఎస్ ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్ ప్రమాదానికి గురైన సందర్భంలో నాటి కాంగ్రెస్ సీనియర్ నేత రోశయ్య ఆధ్వర్యంలో కేబినెట్ భేటీ జరిగింది.
తాజాగా..సీఎం కేసీఆర్ ఫాంహౌస్ లో ఉన్న వేళ.. కేటీఆర్ నాయకత్వాన తాజా భేటీ జరగటం.. అందులో మంత్రులతో పాటు.. ప్లానింగ్ బోర్డు వైస్ ఛైర్మన్లు.. అధికారులు పాల్గొనటం గమనార్హం.
This post was last modified on August 14, 2020 5:45 pm
‘ఆర్ఆర్ఆర్’ సినిమాతో గ్లోబల్ స్టార్లుగా ఎదిగిపోయారు జూనియర్ ఎన్టీఆర్, రామ్ చరణ్. ఆ చిత్రం అంతర్జాతీయ స్థాయిలో ప్రేక్షకులను ఉర్రూతూలగించింది.…
ప్రస్తుతం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రపంచం పుంజుకుంటోంది. ప్రధానంగా ఐటీ సంస్థల నుంచి ప్రభుత్వ కార్యాలయాల వరకు కూడా ఏఐ ఆధారిత…
ప్రస్తుతం శైలేష్ కొలను దర్శకత్వంలో హిట్ 3 ది థర్డ్ కేస్ పూర్తి చేసే పనిలో ఉన్న న్యాచురల్ స్టార్…
వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్కు సొంత బాబాయి.. వైఎస్ వివేకానందరెడ్డి దారుణ హత్య కేసు లో తాజాగా…
గత ఏడాది సంక్రాంతికి ‘హనుమాన్’తో సెన్సేషన్ క్రియేట్ చేసింది ప్రశాంత్ వర్మ-తేజ సజ్జ జోడీ. పాన్ ఇండియా స్థాయిలో పెద్ద…
మాటల మాంత్రికుడు.. సోషల్ మీడియాలో దుమ్మురేపి.. ప్రస్తుతం ప్రజాప్రతినిధిగా శాసన మండలిలో ఉన్న తీన్మార్ మల్లన్న తన వాయిస్ ద్వారా…