ఏపీలో ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నా.. ముందస్తు కోయిలలు కూస్తున్నాయనే సంకేతాలు వస్తున్న దరిమిలా.. రాష్ట్రంలో ఒకవిధమైన ఎన్నికల వాతావరణం నెలకొంది. దీంతో ఏ పార్టీ పుంజుకుంది.. ఏ పార్టీ తిరిగి అధికారంలోకి వస్తుంది? అనే ఇంట్రస్టింగ్ టాపిక్ జనాల మధ్య హల్చల్ చేస్తోంది. మరోవైపు సర్వే రాయుళ్లు కూడా.. రంగంలోకి దిగి.. ఆ పార్టీకి ఇన్ని.. ఈ పార్టికి ఇన్ని.. ఓట్లు వస్తాయనే లెక్కలు చెబుతున్నారు.
సరే.. ఎవరు ఏం చెప్పినా.. అంతిమంగా తేలిన ఫలితాన్ని బట్టి చూస్తే వైసీపీ సర్కారుకు భారీ దెబ్బ తగిలే ప్రమాదం పొంచి ఉందని తెలుస్తోంది. సుమారు 7 నుంచి 8 శాతం చొప్పున ఓటు బ్యాంకుకు గండిపడు తోందని అంటున్నారు. గత ఎన్నికల్లో 50.91 శాతంతో పుంజుకున్న వైసీపీ.. కనీ వినీ ఎరుగని విజయాన్ని సొంతం చేసుకుంది. ఏకంగా 151 అసెంబ్లీ స్థానాలను కైవసం చేసుకుంది.
అయితే.. ఇప్పుడు ఈ లెక్క మారిపోయిందని దాదాపు అన్ని సర్వేరాయుళ్లు పేర్కొంటున్నారు. వీరిలో వైసీపీ అనుకూల.. వ్యతిరేక సర్వేరాయుళ్లు కూడా ఉండడం గమనార్హం. మొత్తంగా 7-8 శాతం ఓటు బ్యాంకు కోల్పోవడం ఖాయమని ముక్తకంఠంతో పేర్కొంటున్నారు. అంటే.. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే.. వైసీపీ కేవలం 42-43 శాతం ఓటు బ్యాంకుకే పరిమితం అవుతుందని అంటున్నారు.
ఇదే జరిగితే.. తిరిగి అధికారంలోకి రావాలని భావిస్తున్న సీఎం జగన్ ఆశలు ఏమేరకు సానుకూలంగా మారతాయి? అనేది చర్చనీయాంశమే. ఎందుకంటే.. గత ఎన్నికల్లో కేవలం 1000-2000 ఓట్ల తేడాతో 50 స్థానాల్లో వైసీపీ నాయకులు గెలిచారు. కానీ, ఇప్పుడు 7 నుంచి 8 శాతం చొప్పున ఓటు బ్యాంకు తగ్గుతుందన్నఅంచనాల నేపథ్యంలో సుమారు 50 నుంచి 70 సీట్లలో పార్టీ ఓటమి చెందే సూచనలు కనిపిస్తున్నాయని అంటున్నారు పరిశీలకులు. మరి దీనిని అడ్డుకునేందుకు.. కట్టడి చేసేందుకు జగన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారో చూడాలి.
This post was last modified on July 7, 2023 5:15 pm
తీవ్ర ఆర్థిక ఒత్తిళ్ల కారణంగా లోన్ యాప్ల వేధింపుల కారణంగా పలు ఆత్మహత్యలు వెలుగు చూస్తున్న పరిస్థితుల్లో కేంద్ర ప్రభుత్వం…
పుష్ప-2 సినిమా ప్రీమియర్ షో సందర్భంగా హైదరాబాద్లోని సంధ్య ధియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట.. ఈ క్రమంలో రేవతి అనే…
ఏపీ సీఎం చంద్రబాబు సహా కూటమి సర్కారు అమరావతిని పరుగులు పెట్టించేందుకు రెడీ అయింది. ఎక్కువగా కాన్సన్ట్రేషన్ రాజధానిపైనే చేస్తున్నారు.…
అమెరికాలో జరిగిన గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ తెలుగు రాష్ట్రాల్లో జరిగిన,…
ఓ వైపు సంధ్య థియేటర్ గొడవ ఎంత ముదురుతున్నా కూడా పుష్ప 2 కలెక్షన్లు మాత్రం తగ్గడం లేదు. శనివారం…
ఇంకో పద్దెనిమిది రోజుల్లో విడుదల కాబోతున్న గేమ్ ఛేంజర్ ప్రమోషన్స్ ఈ రోజుతో పీక్స్ కు చేరుకోవడం మొదలయ్యింది. మొట్టమొదటిసారి…