భీమవరంలో నిర్వహించిన బహిరంగ సభలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్….వైసీపీ నేతలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడిన సంగతి తెలిసిందే. మంత్రి రోజా మొదలు సీఎం జగన్ వరకు అందరినీ టార్గెట్ చేసిన పవన్ విమర్శలు గుప్పించారు. ఈ నేపరథ్యంలోనే పవన్ కు వైసీపీ మంత్రులు ఎమ్మెల్యేల నుంచి అదే రేంజ్ లో కౌంటర్లు ఎదురవుతున్నాయి. ఈ క్రమంలోనే తాజాగా పవన్ పై వైసీపీ ఫైర్ బ్రాండ్ నేత, మంత్రి అంబటి రాంబాబు ప్రతి విమర్శలు చేశారు.
విజయం లేని, రాని రాజకీయ పార్టీ జనసేన అని అంబటి సెటైర్లు వేశారు. వారాహి విజయ యాత్ర పేరులో మాత్రమే విజయం ఉందని చురకలంటించారు. ఉభయగోదావరి జిల్లాలలో చంద్రబాబుకు జనసేన అమ్ముడుపోయిందని, ఇక్కడ పోటీ చేసి అధికారంలోకి వచ్చే దమ్ముందా అని పవన్ ను ప్రశ్నించారు. జగన్ పోవాలి అని పవన్ నినాదం అందుకన్నారని, జగన్ పోతే ఎవరు రావాలో కూడా చెప్పాలని అంబటి ప్రశ్నించారు. జగన్ పోతే సంక్షేమ పథకాలన్నీ పోతాయని, అందుకే జగన్ పోవాలన్న వాడే పోవాలని ప్రజలు కోరుకుంటున్నారని అన్నారు. ప్రజా సమస్యలపై పవన్ కు ధ్యాస లేదని ఎద్దేవా చేశారు.
పవన్ సినిమాల్లో మాత్రమే కథానాయకుడని నిజజీవితంలో కంత్రీ నాయకుడని షాకింగ్ కామెంట్స్ చేశారు. హలో ఏపీ నా పార్టీని అమ్మేశాను అంటూ వారాహిపై పవన్ ఊరేగుతున్నారని, స్థిరత్వం లేని పవన్ రాజకీయాలకు పనికిరాడని సెటైర్లు వేశారు. పవన్ కళ్యాణ్ ఎక్కినందుకు వారాహి వాహనం వరాహమైందని, ఆయన మతిభ్రమించి మాట్లాడుతున్నారని విమర్శించారు. వివాహ వ్యవస్థ పై పవన్ కి నమ్మకం లేదని ఎద్దేవా చేశారు. పవన్ పంది మీద ఊరేగుతున్న పిచ్చికుక్క అని సంచలన వ్యాఖ్యలు చేశారు. తప్పుడు కేసులు పెట్టినా జగన్ భయపడకుండా ప్రజల కోసం పోరాడారని, నలుగురు విప్లవకారుల పేర్లు చెబితే పవన్ విప్లవకారుడైపోడని ఎద్దేవా చేశారు.
పవన్ పెళ్లిళ్ల వీరుడని, ప్రజలకు నీతులు చెబుతున్నాడని సెటైర్లు వేశారు. జగన్ పేదల పక్కన నిలబడితే పవన్ చంద్రబాబు పక్కన చేరారని చురకలటించారు. పవన్ మాటలు అసాంఘిక శక్తులను రెచ్చగొట్టేలా సంస్కారహీనంగా ఉన్నాయి అంబటి ఆగ్రహం వ్యక్తం చేశారు. అధైర్యవంతులే ఆవేశపడతారని,.తెగించి రావడానికి పవన్ ఏమన్నా యుద్ధం చేస్తున్నారా? అని ప్రశ్నించారు. సినిమాలు చేసి పవన్ కోట్లు సంపాదిస్తున్న పవన్ కు సామాన్యుల కష్టాలు తెలియవని దుయ్యబట్టారు.
This post was last modified on July 1, 2023 4:34 pm
టాలీవుడ్లో మెగా హీరోలకు ఉన్న ఫ్యాన్ సపోర్ట్ ఇంకెవరికీ ఉండదనే అభిప్రాయాలున్నాయి. ముందు తరంలో ముందు మెగాస్టార్ చిరంజీవి, ఆ…
ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ చిన్నాన్న వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసు ఇంకా ఓ కొలిక్కి రాని…
పూనూరు గౌతం రెడ్డి. విజయవాడకు చెందిన వైసీపీ నాయకుడు. అయితే.. గతంలో ఆయన వంగవీటి మోహన్రంగాపై చేసిన వివాదాస్పద వ్యాఖ్యలతో…
సూర్య సినిమా ‘కంగువ’ మీద విడుదల ముంగిట ఏ స్థాయిలో అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వెయ్యి కోట్ల…
అసెంబ్లీ వేదికగా కూటమి పార్టీల ఎమ్మెల్యేలు, ఎంపీలు, వారి పీఏలకు, పార్టీల కార్యకర్తలకు సీఎం చంద్ర బాబు వార్నింగ్ ఇచ్చారు.…