Political News

అసంతృప్తుల‌కు చంద్ర‌బాబు చెక్‌..

టీడీపీ అధినేత చంద్ర‌బాబు తాజాగా కీల‌క నిర్ణ‌యం తీసుకుని.. వెంట‌నే అమ‌లు చేసేశారు. పార్టీలో అసంతృప్తుల‌ను త‌గ్గించ‌డంతోపాటు.. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ఆశిస్తున్న‌వారిని ఆయ‌న తేల్చేశారు. ఈ క్ర‌మంలో కొంద‌రికి టికెట్లు.. మ‌రికొంద‌రికి పార్టీలో కీల‌క ప‌ద‌వులు ప్ర‌క‌టించారు. వెంట‌నే ఈ నియామ‌కాలు.. ఆదేశాలు అమ‌ల్లోకి వ‌స్తాయ‌ని తేల్చి చెప్పారు. నియ‌మితులైనవారు.. టికెట్ ద‌క్కిన వారు త‌క్ష‌ణం ప్ర‌జ‌ల్లోకి వెళ్లాల‌ని.. వారి స‌మ‌స్య‌లు తెలుసుకుని.. పార్టీ మినీ మేనిఫెస్టోను వివ‌రించాల‌ని చంద్ర‌బాబు ఆదేశించారు.

టికెట్లు వీరికి..

  • నెల్లూరు సిటీ అసెంబ్లీ ఇన్‌చార్జిగా మాజీ మంత్రి నారాయణను నియమించారు.
  • కర్నూలు పార్లమెంట్ ఇంచార్జ్‌గా బోయ సామాజిక వర్గానికి చెందిన బీటీ నాయుడును నియ‌మించారు.
  • నంద్యాల పార్లమెంట్ స్థానం ఇంచార్జ్‌గా మల్లెల రాజశేఖర్ గౌడ్ ను నియ‌మించారు.

ప‌ద‌వులు వీరికి

  • ప్రస్తుతం నెల్లూరు అసెంబ్లీ ఇన్‌చార్జిగా ఉన్న కోటంరెడ్డి శ్రీనివాసుల రెడ్డిని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియామించారు. పార్టీ అదికారంలోకి రాగానే ఎమ్మెల్సీ ఇస్తామని హామీ ఇచ్చారు.
  • ఎస్.కోట టికెట్ ఆశిస్తున్న గొంప కృష్ణకు పార్టీ రాష్ట్ర కార్యదర్శి పదవిని అప్ప‌గించారు.
  • దివంగత ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడు కుమారుడు బోస్‌కు కార్య నిర్వాహక కార్యదర్శి పదవిని అప్ప‌గించారు.
  • కర్నూలు పార్లమెంట్ అధ్యక్షునిగా ఉన్న సోమిశెట్టిని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియ‌మించారు.

This post was last modified on July 1, 2023 8:22 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

టైగర్ పవన్ కు మోడీ ప్రశంస

ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు మ‌రోసారి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ నుంచి ప్రశంస‌లు ల‌భించాయి. గ‌తంలోనూ ప‌లు…

31 minutes ago

‘చంద్ర‌బాబు ప‌నిరాక్షసుడు’

పండుగ అన‌గానే ఎవ‌రైనా కుటుంబంతో సంతోషంగా గ‌డుపుతారు. ఏడాదంతా ఎంత బిజీగా ఉన్నా పండగ పూట‌.. కొంత స‌మ‌యాన్ని ఫ్యామిలీకి…

4 hours ago

ఊపిరి పీల్చుకున్న విశ్వంభర

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…

6 hours ago

పోకిరి రేంజ్ ట్విస్ట్ ఇచ్చిన రావిపూడి

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…

11 hours ago

ఇళయరాజా అభయమందుకున్న వరప్రసాద్ గారు

మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…

12 hours ago

విజ‌య్‌కు సీబీఐ సెగ‌… `పొత్తు` కోసమా?

త‌మిళ దిగ్గ‌జ న‌టుడు, త‌మిళగ వెట్రి క‌గ‌ళం(టీవీకే) అధ్య‌క్షుడు విజ‌య్ వ్య‌వ‌హారం.. మ‌రింత ముదురుతోంది. గ‌త ఏడాది సెప్టెంబ‌రు 27న‌…

13 hours ago