ఏపీలోని వైసీపీ పాలన పై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తనదైన శైలిలో నిప్పులు చెరిగారు. రాష్ట్రాన్ని ఎక్కడికో తీసుకువెళ్తానని 2019లో రోడ్లవెంట తిరిగి.. ఓట్లు గుంజుకున్న సీఎం జగన్.. రాష్ట్రాన్ని నిజంగానే ఎక్కడికో తీసుకువెళ్లారని.. ఎవరూ ఇలా ఊహించలేదని కూడా వ్యాఖ్యానించారు. రాష్ట్ర పంటగా గంజాయిని.. రాష్ట్ర ఆయుధంగా గొడ్డలిని.. ఆయన పరిచయం చేశారని పవన్ సటైర్లు వేశారు. రాష్ట్ర గుర్తుల గురించి.. నేటి యువతకు, పిల్లలకు ఇదే బోధించాలా? అని ప్రశ్నించారు. ఒకప్పుడునెమలి, పూర్ణకుంభం వంటివి చదువుకున్నామని.. కానీ.. ఇప్పుడు గంజాయి.. గొడ్డలే గుర్తుకు వస్తోందని అన్నారు.
జగన్ … నీ గురించి చెబితే.. రక్త కక్కుకుంటావ్ అని పవన్ తీవ్రంగా విమర్శించారు. జగన్ తన చిన్న వయసులోనే తాత రాజారెడ్డి ప్రోద్బలంతో అప్పటి పులివెందుల ఎస్‌ఐ ప్రకాశ్‌బాబుని స్టేషన్‌లో పెట్టి కొట్టాడు. పోలీసు వ్యవస్థపై గౌరవం లేని వ్యక్తి జగన్. సొంత ఎంపీ.. అది కూడా ఇక్కడి నరసాపురానికి సేవ చేయాలని వచ్చిన మా ప్రత్యర్థి.. కనుమూరి రఘురామకృష్ణరాజును పోలీసులతో కొట్టించాడు
అని పవన్ విరుచుకుపడ్డారు.
ఉభయ గోదావరి జిల్లాల్లో ఎవరు గెలుస్తారో చూద్దామని పవన్ సవాల్ విసిరారు. వైసీపీతో సై అంటే సై. నిండా మునిగినోడికి చలేంటి
అని పవన్ వ్యాఖ్యానించారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తనను గెలిపిస్తారని ఆశిస్తున్నట్టు చెప్పారు. అప్పుడు జనసేన సత్తా ఏంటో అసెంబ్లీలో చాటుతామని తెలిపారు. ఏది ఏమైనా సేవ, పోరాటం మాత్రం ఆపను. బీసీలకు సంపూర్ణ రాజ్యాధికారం రావాలి. దళితులు పారిశ్రామికవేత్తలు కావాలి. అగ్రవర్ణాల్లోని పేదలకు ఆర్థిక సాయం చేసేందుకు అండగా ఉంటాం
అని జనసేనాని చెప్పారు.
తాను ప్రభుత్వ పాలసీలపై మాట్లాడుతుంటే .. వ్యక్తిగతంగా తనపై కొందరు మంత్రులు, నాయకులు చిల్లర మాటలు మాట్లాడుతున్నారని పవన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌లో పెరిగిన సీఎం జగన్.. నీ వ్యక్తిగత జీవితం గురించి లోతైన విషయాలు నాకు చాలా తెలుసు. మీరు, మీ మంత్రుల చిట్టా మొత్తం విప్పగలను. నేను చెప్పేది వింటే జగన్ చెవుల్లో నుంచి రక్తం కారుతుంది. రక్తం కక్కుకుంటావ్ కూడా! ఫ్యాక్షన్ బ్యాక్ గ్రౌండ్, క్రిమినల్స్ అని జగన్ ఎగురుతున్నారేమో.. విప్లవ స్ఫూర్తితో రాజకీయాల్లోకి వచ్చాం. చిల్లర మాటలు మాట్లాడితే ఎలా ఎదుర్కోవాలో నాకు బాగా తెలుసు
అని పవన్ వార్నింగ్ ఇచ్చారు.
This post was last modified on June 30, 2023 11:01 pm
అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…
హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…
ఏపీ సీఎం చంద్రబాబు అంటేనే..'టెక్నాలజీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయన సాధించిన ప్రగతి ఇప్పటికీ ఘన…
మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…
సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనకు సంబంధించి జరుగుతున్న గొడవంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్యమంత్రి రేవంత్…
ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి పరిస్తితి ఎదురవుతోందో తెలిసిందే. ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో కూటమి…