మాజీ మంత్రి.. ప్రస్తుతం బీజేపీ నాయకుడిగా ఉన్న హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ విషయంలో తెలంగాణ సర్కారు నాలుగు మాసాల కిందటికి.. ఇప్పటికి.. భిన్నంగా రియాక్ట్ అయిందనే వాదన బలంగా వినిపిస్తోంది. నాలుగైదు నెలల కిందట.. ఈటలపై నిప్పులు చెరిగిన బీఆర్ఎస్ అధినేత నుంచి మంత్రుల వరకు.. రాజకీయాలను వేడెక్కించారు. అంతేకాదు.. హుజూరాబాద్ ఉప ఎన్నికలో ఆయనను ఓడించేందు కు గట్టి ప్రయత్నమే చేశారు.
ఇక, ఈటల కూడా.. అధికార పార్టీపై దూకుడుగానే వ్యవహరించారు.. మాటకు మాట కౌంటర్ ఇచ్చారు. తీవ్రంగా కూడా వ్యాఖ్యానించారు. అయితే.. ఇది నిన్నటి ముచ్చట. కానీ, ఇప్పుడు అనూహ్యంగా పరిణామా లు మారిపోయాయి. రెండురోజుల కిందట ఈటల సతీమణి జమున.. మీడియాతో మాట్లాడుతూ.. తన భర్త ప్రాణాలకు ముప్పు పొంచి ఉందని.. ఆయనను హత మార్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పారు.
ఆమె ఈ వ్యాఖ్యలు చేసిన తర్వాత.. సహజంగానే.. ఇరు పక్షాలకు మధ్య ఉన్న రాజకీయ వైరం కారణంగా.. బీఆర్ ఎస్ ప్రభుత్వం ఆమె చేసిన వ్యాఖ్యలను పట్టించుకునే పరిస్థితి ఉండదని.. అందరూ భావించారు. ఈటల సతీమణి కూడా ఇదే అనుమానం వ్యక్తం చేశారు. అయితే.. ఈ వాదనకుభిన్నంగా.. ఏకంగా.. మంత్రి కేటీఆర్ రంగంలోకి దిగిపోయి.. పోలీసు ఉన్నతాధికారులతో మాట్లాడేశారు. ఏకంగా డీజీపీతోనే ఫోన్‌లో మాట్లాడారు. తర్వాత.. ఎస్పీతో మాట్లాడారు.
క్షేత్రస్థాయిలో పరిస్థితిని వెంటనే తెలుసుకుని భద్రతకల్పిస్తామనని కూడా చెప్పారు. కట్ చేస్తే.. అసలు ఇంతగా ఎందుకు రియాక్ట్ అవుతున్నారనేది చర్చనీయాంశంగా మారింది. ఈటలపై నిన్నటి వరకు నిప్పులు చెరిగి బీఆర్ఎస్.. ఇప్పుడు ప్రేమ చూపించడం వెనుక పరిణామం ఏంటనేది ఆసక్తిగా మారింది. దీనిపై పరిశీలకులు చెబుతున్న మాట.. కుదిరితే.. ఈటలను మళ్లీ పార్టీలోకి తీసుకునేందుకు బీఆర్ఎస్ ప్రయత్నిస్తోందనే! ప్రస్తుతం బీజేపీలో ఉన్న ఈటల అసంతృప్తితో ఉన్నారు.
పైగా..వ చ్చే ఎన్నికల్లో మూడోసారి గెలవాలని బీఆర్ఎస్ భావిస్తోంది. ఇలాంటి సమయంలో ఉభయ కుశలోపరిగా.. ఈటలను పార్టీలో చేర్చుకుంటే బెటర్ అని.. ఒక అంచనాకు వచ్చే ఇలా స్పాట్‌లో రియాక్ట్ అయిందని పరిశీకులు చెబుతున్నారు. ఇక, ఈటల కూడా.. ఇతర పార్టీలకన్నా బీఆర్ ఎస్‌లో ఉండడమే బెటర్ అని కనుక అనుకుంటే.. ఈ చేరికకు పెద్దగా సమయం పట్టకపోవచ్చని కూడా అంటున్నారు.
This post was last modified on June 30, 2023 10:34 am
మహేష్ బాబు వంశీ మూవీ తో తెలుగు తెరకు పరిచయమై ఆ తర్వాత మెగాస్టార్ అంజి చిత్రంతో మంచి గుర్తింపు…
భారత ఎన్నికల వ్యవస్థ, ఎన్నికల సంఘం పనితీరుపై ప్రపంచ కుబేరుడు, టెస్లా అధినేత ఎలాన్ మస్క్.. సంభ్రమాశ్చర్యాలకు గురయ్యారు. తాజాగా…
ఈ ఏడాది జరిగిన ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీకి 11 స్థానాలు మాత్రమే దక్కాయి. మొత్తం 175 స్థానాలు ఉన్న…
విజయ్ దేవరకొండతో ‘గీత గోవిందం’ సినిమాను మొదలుపెట్టే సమయానికి రష్మిక మందన్నా.. తన తొలి చిత్ర కథానాయకుడు, నిర్మాత రక్షిత్…
నాగచైతన్యతో విడిపోయిన దగ్గర్నుంచి తనతో బంధం గురించి సమంత ఎప్పుడూ నెగెటివ్గానే మాట్లాడడాన్ని గమనించవచ్చు. నేరుగా చైతూ పేరు ఎత్తి…
భారత స్టార్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మళ్లీ క్రికెట్ ఆడతాడని.. టీమ్ ఇండియా జెర్సీలో కనిపిస్తాడని చాలామంది ఊహించలేదు.…