Political News

బెజవాడ పై కేసీఆర్ నజర్

సోలాపూర్ ట్రిప్‌తో జోష్ నింపుకున్న గులాబీ బాస్ ఇప్పుడు ఏపీలోనూ అడుగులు వేయడానికి రెడీ అవుతున్నారు. ఇంతకుముందు మహారాష్ట్రలో మూడు సభలు పెట్టినప్పటికీ ఈసారి భారీ వాహన శ్రేణితో బల ప్రదర్శనలా ఆ రాష్ట్రానికి వెళ్లడంతో కేసీఆర్ అందరి దృష్టిని ఆకర్షించారు. ముఖ్యంగా మహారాష్ట్ర పార్టీలు ఆయనపై మాటల దాడి ప్రారంభించాయి. శివసేన ఉద్దవ్ వర్గం నేతలు ఉద్ధవ్ ఠాక్రే, సంజయ్ రౌత్‌లు కేసీఆర్‌ తెలంగాణ వ్యవహారాలు చూసుకుంటే చాలు, మహారాష్ట్రకు అవసరం లేదని చెప్పగా ఎన్సీపీ అధినేత శరద్ పవార్, ఆ పార్టీ నేతలు కూడా కేసీఆర్‌ను టార్గెట్ చేశారు.

శరద్ పవార్ లాంటి నేతలు కేసీఆర్‌పై విమర్శలు చేయడంతో కేసీఆర్ స్థాయి పెరగడంతో పాటు వార్తల్లో, చర్చల్లో నిలుస్తున్నారు. కేసీఆర్ కోరుకుంటున్నదీ ఇదే. మహారాష్ట్రలో మూడు సభలు పెట్టినా రాని చర్చ ఇప్పుడు అక్కడి నేతలు విమర్శల వేడి పెంచడంతో వచ్చింది. మరాఠీ మీడియాలోనూ కేసీఆర్ ఫస్ట్ పేజీ వార్తల్లో కనిపిస్తున్నారు. కేసీఆర్‌కు కావాల్సింది కూడా ఇదే.

మహారాష్ట్రలో తాను అనుకుంటున్నట్లుగానే జరుగుతుండడంతో అక్కడ ఎంట్రీ లెవల్ దాటి ముందుకెళ్తున్నారు కేసీఆర్. ఇకపై కేసీఆర్ లేకుండా బీఆర్ఎస్‌ నుంచి కేటీఆర్, హరీశ్ వంటి నేతలూ మహారాష్ట్రలో సభలు నిర్వహించబోతున్నారు.. వీరితో పాటు స్థానిక నేతలు ఎక్కడికక్కడ సభలు నిర్వహించబోతున్నారు. ఈ గ్యాప్‌లో కేసీఆర్ మరో కొత్త రాష్ట్రంలో పని ప్రారంభిస్తారు. కేసీఆర్ త్వరలో పని ప్రారంభించబోతున్న రాష్ట్రం ఆంధ్రప్రదేశ్.

వచ్చే ఎన్నికలలో ఏపీలో పోటీ చేస్తామని కేసీఆర్ కుమారుడు కేటీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. సో… ఏపీలోనూ ప్లాట్ ఫాం రెడీ చేసుకోవాలి. ఇప్పటికే ఏపీలో పార్టీ అధ్యక్షుడిని, కొంత కార్యవర్గాన్ని ప్రకటించారు. త్వరలో కేసీఆర్ ఏపీలో భారీ బహిరంగ సభ నిర్వహించేలా ప్లాన్ చేస్తున్నారు. గుంటూరు, విజయవాడ ప్రాంతాల్లో ఈ సభ ఉంటుందని బీఆర్ఎస్‌ వర్గాల నుంచి వినిపిస్తోంది. అంతేకాదు.. సోలాపూర్ వెళ్లినప్పుడు హడావుడి చేసినట్లే వందల కార్లతో హైదరాబాద్, విజయవాడ హైవేపై ర్యాలీగా వెళ్లేలా ప్లాన్ చేస్తున్నారు.

ఏపీలో విశాఖ ఉక్కు, విభజన హామీలు, మూడు రాజధానులు వంటి అంశాలను ప్రధానాస్త్రాలుగా చేసుకుంటూ రాజకీయం చేయాలన్నది బీఆర్ఎస్ ప్లాన్. అంతేకాదు… పాలక వైసీపీ, విపక్ష టీడీపీ, జనసేన పార్టీలు ఏవీ కేంద్రంలోని బీజేపీని ఒక్క మాట కూడా అనకుండా తమలో తామే కొట్టుకుంటుండడంతో అక్కడ బీజేపీపై తీవ్ర విమర్శలు చేస్తూ తమ రాజకీయం ప్రారంభించాలన్నది కేసీఆర్ ప్లాన్.

విజయవాడ, గుంటూరు ప్రాంతాలలో తొలి సభ నిర్వహించిన తరువాత ఉత్తరాంధ్ర, రాయలసీమల్లోనూ వరుసగా సభలు నిర్వహించి దూసుకెళ్లాలని కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారు. మహారాష్ట్ర తరహాలోనే చేరికలనూ ప్రోత్సహిస్తూ హైప్ క్రియేట్ చేసుకోవాలని.. పాలక వైసీపీ నేతలను రెచ్చగొడితే చాలు తాము నిత్యం వార్తల్లో ఉంటూ ప్రజల్లో తమ పేరు వినిపిస్తుందని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. వైసీపీ నేతల నోటి వీక్‌నెస్‌ను తాము ఉపయోగించుకుంటామని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇప్పటికే హరీశ్ రావు వంటివారు తరచూ వైసీపీని విమర్శిస్తూ ప్లాట్ ఫాం వేస్తుండగా త్వరలో కేసీఆర రంగంలోకి దిగుతారని చెప్తున్నారు.

This post was last modified on June 29, 2023 5:31 pm

Share

Recent Posts

`వైనాట్ పులివెందుల` ఎందాకా వచ్చింది?

వైసీపీ అధినేత, మాజీ సీఎం జ‌గ‌న్‌.. సొంత నియోజ‌క‌వ‌ర్గం పులివెందుల‌ను త‌మ హ‌స్త‌గ‌తం చేసుకోవాలన్నది.. టీడీపీ ఆకాంక్ష‌. ముఖ్యంగా స్థానిక…

1 hour ago

పదేళ్ల పాత రీమేక్ బెడిసి కొట్టిందా

ప్రేక్షకులు చాల అడ్వాన్స్ ఉన్నారు, తెలివి మీరిపోయారనే సత్యాన్ని చాలా మంది దర్శక నిర్మాతలు గుర్తించడం లేదు. ఆ ఏముందిలే…

6 hours ago

ఈ ద‌ర్శ‌కుడు ఛాన్సులు భ‌లే ప‌డ‌తాడే..

ఇండస్ట్రీలో వ‌రుస‌గా ఫెయిల్యూర్లు ఇచ్చాక అవ‌కాశాలు ద‌క్కించుకోవ‌డం అంత తేలికైన విష‌యం కాదు. కానీ కొంద‌రు డైరెక్ట‌ర్లు మాత్రం త‌మ…

7 hours ago

బీఆర్ఎస్ మాక్ అసెంబ్లీ… సెటైర్లు

తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాల నుంచి బీఆర్ఎస్ సభ్యులను సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సెషన్ మొత్తం వారిపై…

8 hours ago

త్రివిక్రమ్ మేజిక్ పని చేసినట్టేనా

ఆదర్శ కుటుంబం టీజర్ వచ్చాక అందులో కంటెంట్ ఎలా ఉంటుందో ప్రేక్షకులకు ఐడియా వచ్చేసింది. అభిమానులు హ్యాపీగానే ఉన్నారు. వెంకీ…

8 hours ago

సీఎం అయినా స్నేహం త‌ర్వాతే..

ఫిలిం ఇండ‌స్ట్రీలో చాలా ఏళ్ల పాటు నంబ‌ర్ స్థానానికి పోటీ ప‌డ్డ ఇద్ద‌రు టాప్ హీరోల మ‌ధ్య మంచి స్నేహం…

10 hours ago