తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రేవంత్‌రెడ్డి.. మంత్రి కేటీఆర్ పై సటైర్లు రువ్వారు. ఇటీవల కేటీఆర్ ఢిల్లీలో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన కేంద్ర మంత్రి అమిత్‌షాతో భేటీ అవుతారనే ప్రచారం జరిగింది. అయితే.. ఆయన పీయూష్ గోయల్‌ను కలిసి.. వినతి పత్రం ఇచ్చి వచ్చారు. ఇక, ఏం జరిగిందో ఎవరికీ తెలియదు. కానీ, తాజాగా రేవంత్‌రెడ్డి కేటీఆర్ ఢిల్లీ టూర్‌పై సటైర్లు రువ్వారు.
నాన్నకు ప్రేమతో.. అంటూ.. కేటీఆర్ ఢిల్లీ చుట్టూ ప్రదక్షిణలు చేసి వచ్చారని అన్నారు. సీఎం కేసీఆర్ సీటుకు ఎసరు వచ్చే ప్రమాదం ఉందని.. దీనిని ముందే పసిగట్టి తనయుడు కేటీఆర్.. ఢిల్లీ పెద్దల కాళ్లు పట్టుకునేందుకు.. హస్తినాపురం చుట్టూ ప్రదక్షిణలు చుట్టారని ఎద్దేవా చేశారు. కేటీఆర్ పర్యటన కంటోన్మెంట్ రోడ్ల కోసమో, మెట్రో రైలు కోసమో, రాష్ట్ర ప్రయోజనాల కోసమో కాదని రేవంత్ విమర్శలు గుప్పించారు.
కల్వకుంట్ల కుటుంబ సభ్యుల కంపెనీలపై ఐటీ దాడుల నేపథ్యంలోనే కేటీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారని.. వాటిని కాపాడుకునేందుకు మంత్రుల కాళ్లు పట్టుకున్నారని వ్యాఖ్యలు చేశారు. ఐటీ దాడుల్లో చాలా రహస్య ఆస్తుల వివరాలు దొరికాయని, పత్రికల్లో, మీడియాలో కూడా అవి రాకుండా కేటీఆర్ మేనేజ్ చేశారని దుయ్యబట్టారు. ఐటీ దాడుల్లో పట్టుకున్న ఆస్తులను విడిపించుకోవడానికి కేసీఆర్ ప్రధాని మోడీకి లొంగిపోయారని దుయ్యబట్టారు.
ఢిల్లీ చుట్టూ ఎన్నిసార్లు ప్రదక్షిణలు చేసినా తెలంగాణ గల్లీల్లో కేసీఆర్‌ను ఎవరూ నమ్మరని రేవంత్ విమర్శించారు. పదేళ్లు కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకున్నారని మండిపడ్డారు. 100 కోట్ల లిక్కర్ స్కాంలో కేజ్రీవాల్‌పై విచారణ జరిపిస్తున్న మోడీ… లక్ష కోట్లు దోచుకున్న కేసీఆర్‌ను ఎందుకు వదిలేశారని.. దీనిని బట్టి బీజేపీకి బీటీంగా బీఆర్ ఎస్ ఉందంటే తప్పెలా అవుతందని రేవంత్ ప్రశ్నించారు.
This post was last modified on June 29, 2023 4:10 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…