తెలంగాణలో బలపడాలని.. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావాలని పదే పదే చెబుతున్న కమల నాథులకు.. స్థానిక నేతల మధ్య పెరుగుతున్న అంతరం కలవర పరుస్తోంది. ఒకవైపు పార్టీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్‌కు వ్యతిరేకంగా కొందరు చక్రం తిప్పుతున్నారు. మరికొందరు.. పార్టీకి దూరంగా ఉంటున్నారు. ముఖ్యంగా అధికార పార్టీ బీఆర్ఎస్‌ను వీడి వచ్చిన ఈటల రాజేందర్, కాంగ్రెస్‌కు దూరమైన కోమటిరెడ్డి రాజగోపాల్ వంటివారు బీజేపీలో ఉన్నా.. ఎప్పుడు కాడి పడేస్తారో.. అనే చర్చ సాగుతోంది.
ఇలాంటి సమయంలో అనూహ్యంగా జితేందర్ రెడ్డి చేసిన ఓ పోస్టు మరింత కలకలం రేపింది. దున్నపోతు తోక గట్టిగా లాగి.. డొక్కలో తన్ని మరీ.. దారిలో పెడుతున్న ఓ వీడియోను ఆయన తన సోషల్ మీడియా ఖాతాలో పోస్టు చేశారు. ఇది తీవ్ర స్థాయిలో చర్చకు దారి తీసింది. బీజేపీ నేతలకు కూడా ఇలాంటి ట్రీట్‌మెంట్ అవసరమని ఆయన కామెంట్ చేశారు. అంతేకాదు.. ఈట్వీట్‌ను ఆయన బీజేపీ అగ్రనేత అమిత్ షా, మరో నేత బీఎల్ సంతోష్, బన్సాలీలకు ట్యాగ్ చేశారు.
అయితే.. దీనిని జితేందర్ రెడ్డి కొన్ని నిమిషాలకే డిలీట్ చేశారు. కానీ, అది అప్పటికే జోరుగా వైరల్ అయిపోయింది. దీంతో తీవ్ర వివాదానికి దారితీసింది. రాష్ట్రంలో బీజేపీకి కీలక నేతలుగా ఎవరున్నారో.. వారు సరిగా పనిచేయడం లేదని.. వారిని సరైన దారిలో పెట్టాలనే అర్ధం వచ్చేలా జితేందర్ రెడ్డి ఈ వీడియోను పోస్టు చేశారనే చర్చ సాగుతోంది. తెలంగాణ బీజేపీ నాయకులు సరైన దారిలో లేరని, వారిని దారిలో పెట్టేందుకు కఠినంగా వ్యవహరించాలనే ఉద్దేశంతో జితేందర్ రెడ్డి పెట్టి ట్వీట్ కాకరేపుతున్న నేపథ్యంలో అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…