ఏపీలో మంత్రులు, ఎమ్మెల్యేల వ్యవహార శైలి తీవ్ర వివాదంగా మారుతోంది. ఇప్పటికే కొందరు కీలక నాయకులు ప్రజలతో ఇష్టా ను సారం మాట్లాడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి. అయితే.. అదిష్టానం వారిని హెచ్చరిస్తున్న పాపాన పోవడం లేదు. దీంతో నాయకుల్లో ఎలాంటి మార్పూ రావడం లేదు. తాజాగా మంత్రి ధర్మాన ప్రసాదరావు.. తీవ్రస్థాయిలో ప్రజలను హెచ్చరించా రు. “మళ్లీ వైసీపీని గెలిపించకపోయారో..“ అంటూ ఆయన చేసిన హెచ్చరిక వ్యాఖ్యలు సంచలనం సృష్టిస్తున్నాయి.
శ్రీకాకుళం జిల్లా కేంద్రానికి సమీపంలోని తంగివానిపేటలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇంటింటికీ ఆయన వెళ్లారు. అయితే.. ఈ సందర్భంగా కొందరు సమస్యలు ప్రస్తావించారు. దీంతో మంత్రి ధర్మాన కొంత అసహనం వ్యక్తం చేశారు.
ఇదే సమయంలో పేద ప్రజల జీవితాల్లో వెలుగులు నింపేందుకు జగన్ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని, అయినా.. ఏదో రాలేదని ఎందుకు అడుగుతున్నారని వారిని నిలదీశారు. ఏవో చిన్న చిన్న కారణాలు చూపించి వైసీపీ ప్రభుత్వానికి… అండగా నిలవకపోతే మీరే నష్టపోతారని ధర్మాన హెచ్చరించారు.
గత నాలుగు ఎన్నికల్లో స్థానికంగా ఉన్న శ్రీకాకుళం నియోజకవర్గం పరిధిలోని పెద్దపాడు, తంగివానిపేట, వానవానిపేట, శాస్త్రులపేటల్లో.. తనకు మెజార్టీ రాలేదని ప్రజలకు ధర్మాన తెలిపారు. అందుకే అభివృద్ధి పనులు చేయమని అడిగే హక్కు ఇక్కడి ప్రజలకు లేదన్నారు. అయినా తాను చాలా విశాల దృక్ఫథంతో ఆలోచించి ఓట్లు వేయని గ్రామాల అభివృద్ధికి కూడా లక్షల రూపాయలు వెచ్చించి అభివృద్ధి చేస్తున్నానని తెలిపారు. గతంలోను ఇప్పుడు కూడా ఎంతోమంది పేదలకు ఇళ్లు ఇచ్చానని చెప్పారు.
“మీరు ఓట్లు వేసి గెలిపించిన టీడీపీ నేతలు.. ఒక్క అభివృద్ధి పనైనా చేశారా“ అని మంత్రి ధర్మాన ప్రజలను నిలదీశారు. టీడీపీకి, చంద్రబాబుకు ఎందుకు ఓటు వేయ్యాలని ప్రశ్నించారు. ఇదే విషయాన్ని మహిళలు కూడాతమ భర్తలను ప్రశ్నించాలని సూచించారు. అనేక మంది టీడీపీ నేతలకు భయపడి సమావేశానికి కూడా రాలేదని.. కొందరు వైసీపీ ప్రభుత్వంలో సంక్షేమ పథకాల తీసుకుని కూడా టీడీపీకి ఓటు వేస్తామని చెబుతున్నారని.. ఇది సరికాదని.. అలా చేస్తే.. మీరే నష్టపోతారని ఆయన హెచ్చరించారు.
This post was last modified on June 29, 2023 11:02 am
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…