ఓపక్క కరోనా దెబ్బకు యావత్ ప్రపంచం కిందా మీదా పడుతున్న వేళ.. వ్యాక్సిన్ రాకకు మరికొన్ని నెలలు పడతాయన్న అంచాలున్న వేళ.. అందరిని సర్ ప్రైజ్ చేస్తూ.. దీనికి వ్యాక్సిన్ వచ్చిందంటూ రష్యా చేసిన ప్రకటన అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఎందుకంటే.. తాను నిర్వహించిన క్లినికల్ ట్రయల్స్ మొదలు.. వ్యాక్సిన్ తయారీకి సంబంధించిన వివరాలు ప్రపంచానికి పెద్దగా షేర్ చేసుకోకపోవటమే కారణం.
మరి.. ఈ వ్యాక్సిన్ ప్రభావం ఎంత? అదెలా పని చేసే అవకాశం ఉంది? అసలు దీన్ని ఎంతవరకు నమ్మొచ్చు? వ్యాక్సిన్ పై ఎలాంటి సమాచారం బయటకు రాని నేపథ్యంలో దానికి సంబంధించిన వివరాలపై శాస్త్ర సాంకేతిక రంగానికి చెందిన ప్రముఖులు ఏమనుకుంటున్నారన్న ప్రశ్నలకు సమాధానాలుగా సీసీఎంబీ (సెంటర్ ఫర్ సెల్యులర్ అండ్ మాలిక్యులర్ బయాలజీ) డైరెక్టర్ రాకేశ్ మిశ్రా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
కోవిడ్ -19కు చెక్ చెప్పేలా రష్యా తయారు చేసిన వ్యాక్సిన్ సమర్థంగా పని చేస్తే ప్రజలు లక్కీనేనని పేర్కొన్నారు. అయితే.. దీని సమర్థత.. భద్రత గురించి ఇంకా ఏమీ తెలీదన్నారు. క్లినికల్ ట్రయల్స్ ను రష్యా సంపూర్ణంగా నిర్వహించలేదన్న ఆయన.. టీకా తయారీలో మూడో దశ ట్రయల్స్ ఎంతో కీలకమన్నారు. ఎందుకంటే.. ఆ దశలో టీకాను ఎక్కువ మందిపై ప్రయోగించి.. వైరల్ ఇన్ఫెక్షన్ వస్తుందో లేదో రెండు నెలలు ఎదురుచూడాల్సి ఉంటుందన్నారు.
తనకున్న అవగాహన ప్రకారం రష్యా వ్యాక్సి్ న్ కు భారీగా పరీక్షలు చేసినట్లుగా కనిపించలేదన్నారు. ఒకవేళ అలా చేసి ఉంటే..సమాచారాన్ని గోప్యంగా ఉంచాల్సిన అవసరం లేదన్నారు. రష్యా తయారుచేసినట్లుగా చెబుతున్న వ్యాక్సిన్.. ఎంతమేరకు సురక్షితం అన్నది తెలీదని.. టీకా తయారీని వేగవంతంగా చేసేందుకు మాత్రం కొన్ని నెలలు ఆ దేశం ఒక చట్టాన్ని తీసుకొచ్చిందన్నారు. మొత్తంగా చూస్తే.. సామాన్యులకే కాదు.. శాస్త్ర సాంకేతిక రంగాలకు చెందిన వారిలోనూ రష్యా వ్యాక్సిన్ వివరాలపై పెద్దగా అవగాహన లేదని చెప్పక తప్పదు.
This post was last modified on August 13, 2020 12:21 pm
సంధ్య థియేటర్ ఘటన నుంచి క్రమంగా బయటపడుతున్న అల్లు అర్జున్ కొత్త సినిమాల ప్రపంచంలోకి వచ్చేస్తున్నాడు. పుష్ప 3 ఉంటుందో…
డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌కు అభిమానుల నుంచి తిప్పలు మామూలుగా ఉండడం లేదు. ఆయన ఎక్కడికి వెళ్లినా..…
ఏపీలోని కూటమి ప్రభుత్వం తనకు భయపడుతోందని వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్ షాకింగ్ కామెంట్స్ చేశారు. తనకు భయపడుతున్న…
ఏపీ రాజకీయాల్లో ఉప్పు-నిప్పుగా వ్యవహరించే జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, వైసీపీ అధినేత, మాజీ సీఎం జగన్‌లు…
కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామి దర్శనం కోసం వచ్చి ఆయన పాదాల చెంత తిరుపతిలో చోటుచేసుకున్న తొక్కిసలాటలో భక్తులు ప్రాణాలు…
ఒక హీరో దర్శకత్వం వహించి నిర్మించడమంటే మాములు విషయం కాదు. ఒకప్పుడు ఎన్టీఆర్, కృష్ణ లాంటి లెజెండ్స్ దీన్ని సమర్ధవంతంగా…