రాజకీయాల్లో ఉన్న నాయకులు ఆచితూచి మాట్లాడాలి. పైగా.. సీనియర్లు, గతంలో మంత్రులుగా చేసిన వారు అయితే.. మరింత జాగ్రత్తగా వ్యవహరించాలి. ఏమాత్రం తేడా వచ్చినా.. ఇబ్బందులు తప్పవు. ఇప్పుడు మాజీ మంత్రి, బీజేపీ మాజీ నాయకుడు.. కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యలు.. సంచలనం గా మారాయనే చెప్పాలి. ప్రస్తుతం ఇవి.. రాజకీయంగా ప్రకంపనలు కూడా పుట్టిస్తున్నాయి.
ప్రస్తుతం టీడీపీలో ఉన్న కన్నా లక్ష్మీనారాయణ సత్తెనపల్లి నియోజకవర్గం ఇంచార్జ్‌గా నియమితుల య్యారు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. బీజేపీలో తాను ఎదుర్కొన్న పరిస్థితిని వివరించారు. గతంలో తాను.. బీజేపీ రాష్ట్ర చీఫ్‌గా ఉన్నానని చెప్పారు. అయితే.. తనను అకారణంగా తొలగించారనేది ఆయన వాదన. అంతేకాదు.. అసలు తనను తొలగించడం వెనుక.. ముఖ్యమంత్రి జగన్ ఉన్నారని బాంబు పేల్చారు.
“పదే పదే ఢిల్లీ వెళ్లిన ముఖ్యమంత్రి.. నన్ను పదవి నుంచి దింపే వరకు నిద్ర పోలేదు.” అని కన్నా వ్యా ఖ్యానించారు. తాను వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసేవాడినని.. అందుకే.. తనను పదవిలో లేకుండా చేశారని అన్నారు. ఇదిలావుంటే.. ఇప్పుడు ఈ వ్యాఖ్యలే సంచలనంగా మారాయి. బీజేపీకి జగన్ చెబితే.. కన్నాపదవి ఊడిపోయిందా? అనేది చర్చ. అంతేకాదు… కన్నాను గద్దెదింపేయగల పరిస్థితి జగన్ ఉందా? అంటే.. బీజేపీ పెద్దలు పార్టీ విషయంలోనూ జగన్ చెప్పిందే వింటున్నారా? అనేది సందేహం.
ఈ వ్యాఖ్యలు ఎన్నికల ముంగిట.. కన్నాకు ఎంత మేలు చేస్తాయో తెలియదు కానీ.. బీజేపీకి మాత్రం డ్యామేజీ తప్పదనే అంటున్నారు. జగన్ చెప్పినట్టు బీజేపీ వినే పరిస్థితి ఉంటే.. ఇక ప్రజలు బీజేపీని ఎలా నమ్ముతారు. రేపు ఈ పార్టీ వేరేవారితో పొత్తులు పెట్టుకున్నా.. ఒరిగేది ఏమీ ఉండదని పరిశీలకులు చెబుతున్నారు. సో.. మొత్తానికి కన్నా చేసిన వ్యాఖ్యలతో బీజేపీకి మరింత సెగ పెంచుతాయని చెప్పారు. ఇదిలావుంటే, 2019లోకన్నాపై బీజేపీలో ఆరోపణలు వినిపించాయి. ఎన్నికల ప్రచారం కోసం ఇచ్చిన నిధులను కన్నా నొక్కేశారని సోము వీర్రాజు ఆరోపించిన విషయం తెలిసిందే.
This post was last modified on June 27, 2023 2:39 pm
ప్రభాస్ సినిమా అంటే బడ్జెట్లు.. బిజినెస్ లెక్కలు.. వసూళ్లు అన్నీ భారీగానే ఉంటాయి. కొంచెం మీడియం బడ్జెట్లో తీద్దాం అని…
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ట్రైనీ కానిస్టేబుళ్లకు భారీ శుభవార్త అందించారు. మంగళగిరి ఏపీఎస్సీ పరేడ్ గ్రౌండ్లో 5,757…
అడిగిందే తడవు అన్నట్లు.. పాలనలో పవన వేగాన్ని చూపుతున్నారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. మొన్నటికి మొన్న విద్యార్థులు అడిగారని…
తమిళంతో పాటు తెలుగులోనూ ఫ్యాన్స్ ఉన్న హీరో సూర్య కొత్త సినిమా కరుప్పు ఆలస్యం పట్ల అభిమానులు తీవ్ర ఆగ్రహంతో…
అనుకున్న ప్రకారం డిసెంబరు 5నే ‘అఖండ-2’ సినిమా వచ్చి ఉంటే.. తర్వాతి వారం అరడజనుకు పైగా చిన్న సినిమాలు వచ్చి…
ఎనర్జిటిక్ స్టార్ రామ్ డైలమాలో ఉన్నాడు. మాస్ కోసమని వారియర్ చేస్తే జనం తిప్పి కొట్టారు. క్రైమ్ థ్రిల్లర్ ట్రై…