జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో హాట్ టాపిక్. చాలా కాలానికి పవన్ కొన్ని రోజుల పాటు గ్రౌండ్ లెవెల్లో తిరుగుతూ హాట్ హాట్ ప్రసంగాలతో కాక రేపుతుండటంతో ఏపీ రాజకీయం మొత్తం ఆయన చుట్టూనే తిరుగుతోంది.
జనం కూడా పవన్‌కు బ్రహ్మరథం పడుతున్నారు. ఇది చూసి పవన్ కూడా ఎమోషనల్ అవుతున్నాడు. మరింత ఉత్సాహంగా యాత్రలో ముందుకు సాగుతున్నారు. తాజాగా నరసాపురంలో పవన్ కళ్యాణ్‌కు అంతా మంచి జరగాలని.. ఆయన సంకల్పం సిద్ధించాలని నరసాపురం నియోజకవర్గ పరిధిలోని ప్రధాన దేవాలయాల అర్చకులు తరలి వచ్చి ఆయనకు ఆశీర్వచనాలు ఇచ్చారు.
సోమవారం నరసాపురంలో పవన్‌కు కలిసి పవిత్ర వస్త్రాలు అందించి.. వేదమంత్రోచ్చరణలు చేశారు. అలాగే నరసాపురం క్రైస్ట్ లూథరన్ చర్చికి చెందిన పాస్టర్లు ప్రత్యేక ప్రార్ధనలు చేశారు. బైబిల్ వాక్యం చదివి ఆశీర్వాదాలు అందించారు. అర్చకులు పవన్ కళ్యాణ్‌కు కలిసిన సందర్భంగా ఒక బధిర అర్చకుడు.. జనసేనాని మీద చూపించిన అభిమానం అందరి దృష్టినీ ఆకర్షించింది.
తనకు మాటలు రావని, చెవులు వినబడవని సైగలతో చెబుతూ.. పవన్‌కు తానెంతటి అభిమానినో ఆ సైగలతోనే వివరించాడు ఆ అర్చకుడు. తన పేరు భాస్కర్ అట. పవన్ సినిమాలన్నీ చూస్తాడట. మెడపై చేయి వేసి నిమిరే పవన్ ట్రేడ్ మార్క్ స్టైల్ కూడా చూపిస్తూ.. రాజకీయంగా పవన్ ఎదగాలని.. ఆయనకు అంతా మంచి జరగాలని చాలా ఎమోషనల్‌గా, కన్నీళ్లు పెట్టుకుంటూ ఆశీర్వచనం ఇచ్చాడు భాస్కర్.
ఈ వీడియో సోషల్ మీడియాలో కాసేపటికే వైరల్ అయిపోయింది. ఇంతటి అభిమానం చాలా కొద్ది మంది మీదే ఉంటుందంటూ పవన్ అభిమానులు ఈ వీడియోను విస్తృతం చేస్తున్నారు.
This post was last modified on June 27, 2023 1:17 pm
సంధ్య థియేటర్ విషాదం సినిమాని మించిన మలుపులు తిరుగుతూ విపరీత రాజకీయ రంగు పులుముకుని ఎక్కడ చూసినా దీని గురించే…
పవన్ కళ్యాణ్ అభిమానులకు ఓజి తప్ప ఇంకే మాట వినిపించేలా లేదు. సినిమాకు సంబంధించిన ఎవరైనా ఎక్కడైనా కనిపించినా వెళ్లినా…
సాధారణంగా ప్రతి ప్రభుత్వం తన పని తాను చేసుకుని పోతుంది. ప్రజలకు సేవ చేస్తుంది. దీనిలో కొన్ని ప్రణాళికలు.. కొన్ని…
బాహుబలి-2 తర్వాత వరుసగా మూడు డిజాస్టర్లు ఎదుర్కొన్న ప్రభాస్‌కు సలార్ మూవీ గొప్ప ఉపశమనాన్నే అందించింది. వరల్డ్ వైడ్ ఆ…
ఐకాన్ స్టార్.. అల్లు అర్జున్ ఇంటిపై ఆదివారం సాయంత్రం కొందరు వ్యక్తులు దాడికి దిగిన విషయం తెలిసిందే. భారీ ఎత్తున…
ఏపీ సీఎం చంద్రబాబు మనవడు, మంత్రి నారా లోకేష్, బ్రాహ్మణి దంపతుల కుమారుడు నారా దేవాన్ష్.. రికార్డు సృష్టించారు. ఇటీవల…