Political News

కోమటిరెడ్డి, ఈటల..ఏం జరుగుతోంది?

సీనియర్ నేతలు కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి, ఈటల రాజేందర్ విషయంలో బీజేపీలో ఏమి జరుగుతోందో అర్థం కావటం లేదు. వీళ్ళిద్దరితో మూడు రోజుల్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా రెండు సార్లు భేటీ అయ్యారు. దాంతో పార్టీలోని నేతలందరి చూపు ఇపుడు వీళ్ళిద్దరిపైనే నిలిచింది. ఇంతకీ విషయం ఏమిటంటే కోమటిరెడ్డి, ఈటల తొందరలోనే బీజేపీకి రాజీనామా చేసి కాంగ్రెస్ లో చేరబోతున్నారనే ప్రచారం అందరికీ తెలిసిందే. వీళ్ళిద్దరిని పార్టీలోనే ఉండేట్లుగా చర్చలు మొదలయ్యాయి. వీళ్ళిద్దరికి పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్ తో అంత సఖ్యత లేదు.

అందుకనే ఇద్దరినీ అమిత్ షా ఢిల్లీకి పిలిపించుకున్నారు. వీళ్ళ ప్రధాన డిమాండ్ ఏమిటంటే ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో కీలక సూత్రదారైన కల్వకుంట్ల కవితను ఈడీ అరెస్టు చేయాలని. స్కామ్ లో ఇరుక్కున్న వాళ్ళలో చాలామందిని అరెస్టు చేసిన ఈడీ కవితను మాత్రం ఎందుకు అరెస్టు చేయటం లేదని అడుగుతున్నారు. ఈడీ వైఖరి వల్ల బీఆర్ఎస్-బీజేపీ మధ్య లోపాయికారీగా ఒప్పందం జరిగిందని జనాలు డైరెక్టుగానే తమను నిలదీస్తున్నారంటు వీళ్ళిదరు అమిత్ షాతో చెప్పారట.

రెండుపార్టీల మధ్య కుదిరిన లోపాయికారీ ఒప్పందం వల్లే నరేంద్రమోడీ గురించి కేసీయార్ ఎక్కడా మాట్లాడటంలేదని, కవితను ఈడీ అరెస్టుచేయటం లేదని కాంగ్రెస్ నేతలు పదేపదే ఆరోపణలు చేస్తున్నారు. దాంతో బీజేపీ నేతలు పూర్తిగా డిఫెన్సులో పడిపోయారు. ఈ ఆరోపణల నుండి బయటపడాలంటే కవితను వెంటనే ఈడీ అరెస్టు చేయాల్సిందే అని వీళ్ళు డిమాండ్లు చేస్తున్నారు. వీళ్ళకు అమిత్ షా సమాధానం చెప్పలేకపోతున్నారట.

జనాలు నమ్మని బీజేపీలో ఉండటం కన్నా బయటకు వెళ్ళిపోవటమే మేలని వీళ్ళు డిసైడ్ చేసుకున్నట్లు సమాచారం. అందుకనే అన్నీపనులను పక్కనపెట్టి అమిత్ వీళ్ళిద్దరితో మూడు రోజుల్లోల రెండుసార్లు భేటీ అయ్యింది. కవిత అరెస్టుపైన అమిత్ షా ఎలాంటి సమాధానం చెప్పలేకపోయారని బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. అందుకనే హైదరాబాద్ కు తిరిగొచ్చిన కోమటిరెడ్డి ఏమిచేస్తారో అనే ఉత్కంఠ పెరిగిపోతోంది. ఈటల సోమవారం సాయంత్రానికి హైదరాబాద్ కు చేరుకోవచ్చంటున్నారు. బహుశా ఢిల్లీలోనే ఉండిపోయింది కాంగ్రెస్ అధిష్టానంతో మాట్లాడేందుకే అనే ప్రచారం కూడా ఉంది. చివరకు ఏమవుతుందో ఏమో.

This post was last modified on June 26, 2023 10:59 pm

Share

Recent Posts

అంబానీని ఏం అనలేరా జగన్?

రాయ‌ల‌సీమ‌లో ఇండియ‌న్ స్కూల్ ఆఫ్ అగ్రిక‌ల్చ‌ర్(ఐఎస్ ఏ) ఏర్పాటుకు భూమి పూజ జ‌రిగిన విష‌యం తెలిసిందే. ఈ కార్య‌క్ర‌మంలో ప్ర‌ముఖ…

2 hours ago

స్వర్గానికి వెళ్ళిపోయిన సింగీతం శ్రీనివాసరావు

దక్షిణాది సినీ పరిశ్రమను తీవ్ర విషాదంలో ముంచెత్తుతూ దర్శకులు సింగీతం శ్రీనివాసరావు శాశ్వత సెలవు తీసుకున్నారు. టాలీవుడ్ పునాదుల నుంచి…

3 hours ago

అసలు తుస్సు… కొసరు ప్లస్సు

సాధారణంగా ఒక భాషలో విజయవంతమైన సినిమాను మళ్లీ రీమేక్ చేసి అంత మంచి ఫలితం రాబట్టడం అంత తేలిక కాదు.…

3 hours ago

డ్రాగన్ భామకు డబుల్ హ్యాట్రిక్ షాకులు

ఏ భాష అయినా ఇండస్ట్రీలో మాట్లాడేది, డిమాండ్ పెంచేది సక్సెసే. ఇందులో వేరే డిబేట్ లేదు. ఎన్ని హిట్లు పడ్డాయనే…

4 hours ago

కింగ్ కాస్త ఎక్కువ కనిపిస్తూ ఉండాలి

కింగ్ నాగార్జున కెరీర్ లో చాలా కీలకమైన మైలురాయి వందో సినిమా. కింగ్ 100 టైటిల్ తో రూపొందుతున్న ఈ…

4 hours ago

మహేష్ & తారక్ అభిమానుల విన్నపాలు

ఇంట్లోనే కాదు ఇండస్ట్రీలో కూడా కొన్ని మొహమాటాల మీద జరుగుతాయి. పాత బాకీ ఉందని ఒక సినిమా ఒప్పుకోవాల్సి వస్తుంది.…

4 hours ago