Political News

ఎవరీ లాస్య నందిత?

తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడుతున్నకొద్దీ సిటింగులతో పాటు ఇతర నేతలు కూడా టికెట్ల దృష్టితోనే రాజకీయాలు చేస్తున్నారు.. అధిష్టానం దృష్టిలో పడేందుకు అన్ని ప్రయత్నాలూ చేస్తున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో అయితే ఈసారి కొత్త ముఖాలు పార్టీ ఆఫీసుల్లో కనిపిస్తున్నాయి.

కార్పొరేటర్లలోనూ చాలామంది ఎమ్మెల్యే టికెట్లపై ఆశ పెట్టుకున్నప్పటికీ బీఆర్ఎస్ పెద్దలు మాత్రం కార్పొరేటర్లను అసెంబ్లీ వైపు చూడొద్దని సుతిమెత్తగా హెచ్చరిస్తున్నారు. సిటింగులకు టికెట్లు ఇస్తామని పార్టీ పెద్దలు ఇప్పటికే ప్రకటించినప్పటికీ ఆశావహులు మాత్రం తమ ప్రయత్నాలు ఏమాత్రం ఆపడం లేదు. గ్రేటర్ పరిధిలో ఈసారి వారసుల ఎంట్రీ కూడా బాగానే ఉండొచ్చన్న అంచనాలు వినిపిస్తున్నాయి.

మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో మైనంపల్లి హన్మంతరావు తన కుమారుడు రోహిత్‌ను పోటీ చేయించాలని ట్రై చేస్తున్నారు. ఆయన ఇంకా టికెట్ హామీ దొరకనప్పటికీ మల్కాజ్‌గిరి నియోజకవర్గంలో రోహిత్ నిత్యం ఏదో ఒక కార్యక్రమం చేపడుతూ హడావుడి చేస్తున్నారు. ముషీరాబాద్ ఎమ్మెల్యే ముఠా గోపాల్ కూడా తన కుమారు జయసింహకు టికెట్ కోరుతున్నారు.
ఇకపోతే మంత్రి సబితా ఇంద్రారెడ్డి కుమారుడు కార్తీక్ రెడ్డి రాజేంద్ర నగర్ స్థానం నుంచి పోటీ చేయాలని భావిస్తున్నారట.

సికింద్రాబాద్ ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ కూడా తాను కాకుండా తన కుమారుడికి టికెట్ ఇవ్వాలని కేసీఆర్‌ను ఇప్పటికే కోరారని.. దానికి కేసీఆర్ అంగీకరించలేదని చెప్తున్నారు. కంటోన్మెంట్ ఎమ్మెల్యే శాయన్న కుమార్తె లాస్య నందిత వచ్చే ఎన్నికల బరిలో ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇబ్రహింపట్నంలో మంచిరెడ్డి కిషన్ రెడ్డి కుమారుడు ప్రశాంత్ రెడ్డికి టికెట్ ఇవ్వొచ్చన్న ప్రచారం జరుగుతోంది.

కంటోన్మెంట్ నియోజకవర్గానికి వచ్చేసరికి అక్కడి ఎమ్మెల్యే శాయన్న ఇటీవల మరణించడంతో ఆ స్థానం ఖాళీగా ఉంది. రానున్న ఎన్నికలలో శాయన్న కుమార్తె లాస్య నందితను అక్కడి నుంచి పోటీ చేయిస్తారని తెలుస్తోంది. అయితే.. ఇక్కడ టికెట్ కోసం స్థానిక నేతలు కొందరు గట్టి ప్రయత్నాలే చేస్తున్నారు. నందిత సాయన్న చిన్న కుమార్తె.

ఈమె 2016లో కవాడిగూడ నుంచి కార్పొరేటర్‌గా గెలిచారు. అయితే.. 2020లో జరిగిన జీహెచ్‌ఎంసీ ఎన్నికలలో మాత్రం ఓటమి పాలయ్యారు. అప్పటి నుంచి తండ్రి వెంటే ఉంటూ నియోజకవర్గంలో పట్టు పెంచుకున్నారు. కానీ, సాయన్న మరణం తరువాత ఆయన అనుచరులు, బీఆర్ఎస్ నేతలు కొందరు నందితకు సహకరించడం లేదని.. వారు నందితకు కాకుండా తమకే టికెట్ ఇవ్వాలంటూ బీఆర్ఎస్ పెద్దలను కోరుతున్నారని తెలుస్తోంది.

This post was last modified on June 25, 2023 4:35 pm

Share
Show comments
Published by
Satya

Recent Posts

నాగచైతన్య కస్టడీ గురించి కొత్త ట్విస్టు!

అక్కినేని అభిమానులు ఇది గుర్తుకురాకపోతే మంచిదనేంత పెద్ద డిజాస్టర్ కస్టడీ. అజిత్ గ్యాంబ్లర్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చిన దర్శకుడు…

1 hour ago

నేటి నుంచి ట్రాఫిక్ విధుల్లోకి ట్రాన్స్ జెండర్లు!

హైదరాబాద్ లోని ట్రాఫిక్ సిగ్నల్స్, చౌరస్తాల దగ్గర ట్రాన్స్ జెండర్లను విధుల్లో పెట్టాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే.…

2 hours ago

బాబా మ‌జాకా: వ్య‌క్తిగ‌త భ‌ద్ర‌త‌కూ.. డ్రోన్లు.. నెల‌కు 12 కోట్ల పొదుపు!

ఏపీ సీఎం చంద్ర‌బాబు అంటేనే..'టెక్నాల‌జీ గురు' అన్న పేరు వినిపిస్తుంది. ఐటీ రంగంలో ఆయ‌న సాధించిన ప్ర‌గ‌తి ఇప్ప‌టికీ ఘ‌న…

2 hours ago

RRR డాక్యుమెంటరీ వర్కౌట్ అయ్యిందా!

మొన్న శుక్రవారం కొత్త సినిమాల హడావిడి పెద్దగా కిక్ ఇవ్వలేదు కానీ నాలుగు రిలీజులు ఒకేసారి పలకరించడం బాక్సాఫీస్ వద్ద…

2 hours ago

మ‌నిషే పోయాక ఐకాన్ స్టారైతే ఏంటి సూప‌ర్ స్టారైతే ఏంటి? : మంత్రి

సంధ్య థియేట‌ర్ తొక్కిస‌లాట ఘ‌ట‌న‌కు సంబంధించి జ‌రుగుతున్న గొడ‌వంతా తెలిసిందే. అల్లు అర్జున్ మీద తెలంగాణ అసెంబ్లీలో ముఖ్య‌మంత్రి రేవంత్…

3 hours ago

ర‌చ్చ గెలుస్తున్న మోడీ.. 20 అంత‌ర్జాతీయ పుర‌స్కారాలు!

ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీకి దేశంలో ఎలాంటి ప‌రిస్తితి ఎదుర‌వుతోందో తెలిసిందే. ఈ ఏడాది జ‌రిగిన సార్వత్రిక ఎన్నిక‌ల్లో కూట‌మి…

3 hours ago