“షర్మిల లేదు.. గిర్మిలా లేదు.. పోవాయ్!! గామెను ఏపీలోకి పొమ్మను. అక్కడ బాగుంటది” అని తెలంగాణ కాంగ్రెస్ కురువృద్ధుడు వీ. హనుమంతరావు చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి. తాజాగా ఆయన వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు.. షర్మిలను ఉద్దేశించి.. వ్యాఖ్యానించారు. ముందుగా షర్మిల ఎవరో తనకు తెలియదని.. ఇటీవల కాలంలో పేపర్లలో ఎవరో ఏదో రాస్తున్నారని వ్యాఖ్యానించిన వీహెచ్.. మీడియా ప్రతినిధులు వైఎస్ కుమార్తె అని గుర్తు చేయడంతో.. “`ఆ.. ఆ.. ఆమెనా.. వైఎస్ కూతురా?” అని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
ఇక, షర్మిల కాంగ్రెస్‌లో చేరుతున్న విషయం తనకు తెలియదని వీ. హనుమంతరావు చెప్పుకొచ్చారు. అయినా తెలంగాణలో కంటే ఏపీలో ఉంటేనే షర్మిలకు ఉపయోగమని సూచించారు. “గిక్కడ ఆమెకు బోనమెత్తుట తెల్సా.. తెలంగాణ యాస తెలుసా? బాస తెలుసా?.. గేం చూసి ఆమె రాజకీయం చేస్తది. మాకు అవసరం లేదు. ఆమె వస్తానంటే.. ఎవరు మాత్రం రానిస్తరు” అని వీహెచ్ వ్యాఖ్యానించారు. ఇక, ఎన్నికల ముంగిట కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరు బయటకు వెళ్లడం లేదని తెలిపారు. ప్రస్తుతం కాంగ్రెస్‌కి వేవ్ స్టార్ట్ అయిందన్నారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకురావడమే ప్రతి ఒక్కరి కర్తవ్యంగా ముందుకు సాగుతున్నామన్నారు.
ఎవరి నోట చూసినా కాంగ్రెస్ పేరే వినిపిస్తోందని వీహెచ్ వివరించారు. ముస్లింలు కాంగ్రెస్ వైపే ఉన్నారని.. ఎందుకంటే కాంగ్రెస్ సెక్యులర్ పార్టీ అని పేర్కొన్నారు. ఎన్నికల కోసమే బీసీ బంధు తీసుకొచ్చారని.. లక్ష రూపాయలు ఇచ్చి ఓట్లు దండుకోవాలని చూస్తున్నారని సీఎం కేసీఆర్‌పై ఆయన విమర్శలు గుప్పించారు. హెచ్‌సీఏ భూముల లీజు తీసేసి.. రాజీవ్ పేరు తొలగించాలని చూస్తున్నారని, దీనిని ఎట్టి పరిస్థితిలోనూ అడ్డుకుని తీరుతామని చెప్పారు.
‘‘సేవ్ డెమోక్రసీ పేరుతో పాట్నాలో విపక్షాల సమావేశం జరిగింది. నితీష్ కుమార్ విపక్షాలను ఏకం చేయాలనుకోవడం స్వాగతిస్తున్నా. సిమ్లాలో ఖర్గే నేతృత్వంలో మరోసారి సమావేశం జరగనుంది. మోడీ ఆగడాలు ఆపాలంటే అన్ని పార్టీలు కలవాలి. పబ్లిక్ సెక్టర్ అమ్మివేస్తుంటే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీల రిజర్వేషన్స్ ఉండవు. 2024లో మోడీ పోయి రాహుల్ ప్రధాని కావాలి.’’ అని వీహెచ్ ఆకాంక్షించారు. ఏపీలో పరిస్థితి ఎలా ఉందో తనకు తెలియదని.. అక్కడకూడా పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్పారు.
This post was last modified on June 25, 2023 10:51 am
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…