ఏపీలో జగనన్న సురక్ష
కార్యక్రమాన్ని సీఎం జగన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం.. పథకాలకు అర్హులై ఉండి కూడా.. ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి పథకాలు అందని వారు.. ఇప్పటికీ కొన్ని పథకాల గురించి తెలియనివారికి వాటిని తెలియజేసి.. వాటి దిశగా లబ్ధిపొందని వారికి అవగాహన కల్పించి.. తిరిగి వారికి పథకాలు అందించాలనేది ప్రధాన ఉద్దేశం.
దీనికి సంబంధించి సీఎం జగన్ అధికారులకు కూడా దిశానిర్దేశం చేశారు. అంతా బాగానే ఉంది.. ఇక, ఈ కార్యక్రమానికి సంబంధించి.. వలంటీర్లు… గృహసారథులు.. వంటి వారిని లైన్‌లో పెడుతున్నారు. వారంతా కూడా లబ్ధి పొందని వారిని గుర్తించి.. వారికి ఆయా పథకాలు వివరించి.. వాటిని అందిస్తారు. ఇక, ఇతర విలువైన పత్రాలు.. వంటివాటినికూడా ఇంటికే చేర్చేలా ఈ జగనన్న సురక్షను తీర్చిదిద్దినట్టు ప్రభుత్వం చెబుతోంది.
అయితే.. దీనిని కొంతలోతుగా చూస్తే.. మరో కీలక విషయం బయటపడుతోందని అంటున్నారు టీడీపీ నాయకులు. ఎందుకంటే.. ఎన్నికలకు ముందు ఇంత పెద్ద ఎత్తున జల్లెడ పట్టి మరీ… అందని వారికి లబ్ధి చేకూర్చడం వెనుక ఏదో జరుగుతోందని వారు అనుమానిస్తున్నారు. ఈ కోణంలోనే పరిశీలన చేసిన కొందరు నాయకులు.. సంచలన విషయాన్ని వెలుగులోకి తెచ్చారు. వైసీపీకి వ్యతిరేకంగా.. టీడీపీకి అనుకూలంగా ఉన్న ఓటు బ్యాంకును గుర్తించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశమని అంటున్నారు.
ఈ క్రమంలోనే టీడీపీ సానుకూల ఓటు బ్యాంకును గుర్తించి.. దానిని వైసీపీకి అనుకూలంగా మార్చాల నేది.. ఈ జగనన్న సురక్ష కార్యక్రమంలో అంతర్లీనంగా ఉన్న ప్రధాన విషయమని టీడీపీ నాయకులు అంటున్నారు. అందుకే గృహసారథులు, వలంటీర్లను వినియోగించి.. వైసీపీ వ్యతిరేక ఓటు బ్యాంకును గుర్తించి.. తమకు అనుకూలంగా మార్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని చెబుతున్నారు. మరి ఈ విషయంలో ఇదే నిజమైతే.. ప్రతిపక్షాలు ఏం చేస్తాయో చూడాలి.
This post was last modified on June 24, 2023 6:49 pm
భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) చంద్రయాన్-3 ద్వారా చంద్రుని దక్షిణ ధ్రువంపై విజయవంతంగా ల్యాండింగ్ చేయడంతో కొత్త ఆవిష్కరణలు…
వైసీపీ కీలక నాయకుడు, రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయిరెడ్డి.. ఆ రెండు పదవులు వదులుకున్న విషయం తెలిసిందే. అయితే.. సాయిరెడ్డి…
బీఆర్ ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్.. సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని ఉద్దేశించి ఆయన…
ఏపీ అసెంబ్లీలో తనకు ప్రధాన ప్రతిపక్ష నేత హోదా ఇవ్వాలని.. ఆలా అయితేనే తాను అసెంబ్లీకి వస్తానని వైసీపీ అధినేత…
తమిళ్ సూపర్ స్టార్ దళపతి విజయ్ రాజకీయాల్లోకి శరవేగంగా దూసుకువస్తున్నారు. ఇప్పటికే తమిళగ వెట్రిగ కజగం పేరిట రాజకీయ పార్టీని…
ఇప్పుడు ఇండస్ట్రీ మొత్తంలో జరుగుతున్న చర్చ ఒక్కటే. గేమ్ ఛేంజర్ నుంచి తండేల్ దాకా అసలు హెచ్డి ప్రింట్స్ పైరసీ…