జనసేన అధినేత పవన్ కళ్యాణ్.. ముఖ్యమంత్రి కావాలన్నది తన ఆకాంక్ష కూడా అని ఏపీ అధికార పార్టీ వైసీపీ కీలక నాయకుడు, ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని అమలాపురం శాసన సభ్యుడు పినిపే విశ్వరూప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. ఆయన వ్యంగ్యాస్త్రం సంధించారో.. లేక నిజంగానే అన్నారో.. ప్రస్తుతానికి సస్పెన్స్‌గానే ఉన్నా.. ఆయన మాత్రం సీరియస్‌గానే వ్యాఖ్యానించారు.
తాజాగా తిరుమల శ్రీవారం దర్శనం చేసుకున్న మంత్రి పినిపే… కొండ మీద మీడియాతో మాట్లాడారు. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానంటూ మంత్రి వ్యాఖ్యానించా రు. పవన్ కల్యాణ్ సీఎం కావాలని ఆయన అభిమానులు మాత్రమే కాకుండా తానూ కోరుకుంటున్నా నన్నారు. రాష్ట్రంలో ఎవరైనా యాత్రలు చేసుకోవచ్చన్నారు. దీనికి ఎవరూ అడ్డు చెప్పబోరని అన్నారు. అయితే.. ప్రజలను ఇబ్బందులకు గురి చేయకూడదని వ్యాఖ్యానించారు.
పిఠాపురంలో వారాహి యాత్ర నిర్వహిస్తే.. ఎక్కడో ఉన్న విశాఖ వరకు కూడా జాతీయ రహదారిపై వాహనాలు నిలిచిపోయాయని.. ఈ విషయాన్ని పవన్‌తెలుసుకోవాలని.. అందుకే ప్రభుత్వం కొన్ని జీవోలు తీసుకువచ్చిందని.. అయితే.. వాటిని కోర్టులు కొట్టివేశాయని చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలగని రీతిలో పవన్ యాత్రలు చేస్తే బాగుంటుందన్నారు. ఇక, ముఖ్యమంత్రి పీఠం అనేది.. ఎవరో ఇస్తే.. వచ్చేది కాదని.. ప్రజలు కూడా ముఖ్యమంత్రి పీఠం ఇవ్వరని చెప్పారు.
సీఎం కావాలంటే 175 స్థానాల్లో పోటీ చేసి 88స్థానాల్లో గెలిస్తే.. గెలిచిన పార్టీ ఎమ్మెల్యేలు.. అసెంబ్లీ పక్ష నాయకుడిని ఎంచుకుంటే.. అప్పుడు పవన్ సీఎం అవ్వొచ్చని మంత్రి పినిపే తెలిపారు. పొత్తుతో 100 స్థానాల్లోనైనా పోటీ చేసి 50 స్థానాల్లోనైనా గెలవాలన్నారు. అప్పుడు పవన్‌కు ముఖ్యమంత్రి యోగం పడుతుందని చెప్పారు. ప్రజాస్వామ్యంలో రెండు విధాలుగా సీఎం అవుతారని మంత్రి విశ్వరూప్ అన్నారు. అంతే తప్ప.. ప్రజలను అడిగి సీఎం అయిన వారు ఎవరూ లేరని.. అయితే.. ఎమ్మెల్యే కావొచ్చని మంత్రి చెప్పారు.
This post was last modified on June 24, 2023 6:26 pm
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…
ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…
మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…
తమిళ దిగ్గజ నటుడు, తమిళగ వెట్రి కగళం(టీవీకే) అధ్యక్షుడు విజయ్ వ్యవహారం.. మరింత ముదురుతోంది. గత ఏడాది సెప్టెంబరు 27న…
రికార్డులు బద్దలు కొట్టేస్తుందని అభిమానులు గంపెడాశలు పెట్టుకున్న ది రాజా సాబ్ ఫలితం చూస్తున్నాం. ఆడియన్స్ ని పూర్తి స్థాయిలో…
ఏపీ సీఎం చంద్రబాబు సొంత గ్రామం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నారావారి పల్లెలో ముందస్తు సంక్రాంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.…