రాజకీయ పరిణామాలు చూస్తుంటే అందరిలోనూ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. జాతీయ రాజకీయాల్లో వెలిగిపోవాలని కలలుకంటున్న కేసీఆర్ తన వైఖరి వల్లే ఇపుడు ఒంటరైపోతున్నట్లున్నారు. నిలకడలేనితనం, మాట స్ధిరత్వం లేకపోవటం హోలు మొత్తంమీద క్రెడిబులిటి పోగుట్టుకున్నారు. దాంతో కేసీయార్ ను ఇపుడు ఎవరూ నమ్మడం లేదు. ఒకసారి ఎన్డీయే మీద యుద్ధమంటారు. మరోసారి బీజేపీని అడ్డుకుంటానని ప్రకటిస్తారు. తర్వాత నరేంద్ర మోడీకి వ్యతిరేకంగా అందరూ జట్టుకట్టాలంటారు. ఇపుడేమో కేంద్ర ప్రభుత్వం మీద నరేంద్రమోడీ గురించి పల్లెత్తు మాట కూడా అనటం లేదు.
ఢిల్లీ లిక్కర్ స్కాం లో తన కూతురు కల్వకుంట్ల కవితను అరెస్టు చేయకుండా ఉండటం కోసమే కేసీఆర్ కేంద్ర ప్రభుత్వంతో రాజా పడిపోయినట్లు బాగా ప్రచారం జరిగింది. మామూలు జనాలు కూడా ప్రచారంతో ఏకీభవిస్తున్నారు. మోడీ-కేసీయార్ మధ్య రాజీ కుదరకపోతే దర్యాప్తు సంస్థలు కవితను ఎందుకు అరెస్టు చేయలేదని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే లిక్కక్ స్కామ్ లో సౌత్ గ్రూప్ తరపున కవితదే కీలకపాత్రగా ఈడీనే ఎన్నోసార్లు చెప్పింది. చివరకు కోర్టులో చార్జిషీట్లు కూడా దాఖలుచేసింది. పాత్రదారులందరినీ అరెస్టుచేసిన ఈడీ కవితను మాత్రం ఎందుకు అరెస్టుచేయలేదు ?
ఇక్కడే మోడీ-కేసీయార్ మధ్య ఏదో రాజీకుదిరిందనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఇలాంటి కారణాలతోనే కేసీయార్ ఇటు జనాల్లో అటు జాతీయస్ధాయిలో క్రెడిబులిటి పోగుట్టుకున్నారు. చివరకు ఏమైందంటే ఎన్డీయే పార్టీలు, యూపీఏ పార్టీలే కాకుండా నాన్ ఎన్డీయే, నాన్ యూపీఏ పార్టీలు కూడా ఏ విషయంలో కూడా కేసీయార్ తో మాట్లాడటం మానుకున్నాయి.
తాజాగా బీహార్ రాజధాని పాట్నాలో జరిగిన 15 ప్రతిపక్షాల కీలకమైన సమావేశానికి కేసీయార్ కు ఆహ్వానమే లేదు. తాము కేసీయార్ ను ఆహ్వానించలేదని జేడీయూ త్యాగి స్పష్టంగా ప్రకటించారు. కారణం ఏమిటంటే కేసీయార్ ను నమ్మలేకపోవటమే. ఏరోజు ఎప్పుడు ఏ పార్టీకి లేదా కూటమికి మద్దతుగా మాట్లాడుతారో ఎవరికీ తెలీదు. ఏమాత్రం నిలకడలేని నేతను కలుపుకుంటే ఇబ్బందులు వస్తాయన్న కారణంతోనే కేసీయార్ ను పాట్నా భేటీకి అన్నీపార్టీలు దూరంగా పెట్టేశాయి. ఎవరికి కాకుండా పోతున్న కేసీయార్ జాతీయరాజకీయాల్లో ఎలా వెలిగిపోవాలని అనుకుంటున్నారో అర్ధంకావటంలేదు.
This post was last modified on June 24, 2023 5:42 pm
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…