కొన్నాళ్లుగా బీజేపీ, బీఆర్ఎస్ మధ్య కొనసాగిన రాజకీయ ఉద్రిక్తతలు నెమ్మదించినట్లుగా ఉన్నాయి. నిన్నమొన్నటి వరకు కేంద్రాని లేఖపై లేఖ రాసిన కేటీఆర్ ఇప్పుడు తానే నేరుగా వెళ్లి బీజేపీ పెద్దలను కలవడం చర్చనీయమవుతోంది. అది కూడా.. బీజేపీకి వ్యతిరేకంగా విపక్షాలన్నీ పట్నాలో భేటీ అయిన రోజునే కేటీఆర్ దిల్లీ వెళ్లి అమిత్ షాను కలవడం ప్రాధాన్యం సంతరించుకుంది.
కాంగ్రెస్‌తో బీఆర్ఎస్ కలవడంలేదనే ఇండికేషన్ ఇవ్వడానికేనని.. రాష్ట్రంలో మాకు సహకరించండి.. కేంద్రంలో మీకు సహకరిస్తాం అనే పాత పాలసీ అమలు కోసం కేటీఆర్ బీజేపీ నేతలను కలిశారన్న ప్రచారం జరుగుతోంది.
రాష్ట్ర ప్రభుత్వ స్థాయిలో కేంద్రం నుంచి అందాల్సిన సహకారం, సాయం కోసం ఇంతకాలం లేఖలతో సరిపెట్టిన కేటీఆర్ ఇప్పుడు డైరెక్టుగా ఢిల్లీ వెళ్లి మంత్రులతో చర్చలు జరపడంపై రకరకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఐటీఐఆర్ ప్రాజెక్టును కేంద్రం మంజూరు చేయకున్నా ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ కంపెనీలుగా గుర్తింపు పొందినవాటిని తెప్పించుకున్నామని, జాతీయ హోదా ఇవ్వకున్నా కాళేశ్వరం కట్టుకున్నామని, కాజీపేటలో రైల్ కోచ్ ఫ్యాక్టరీ ఇవ్వకున్నా ప్రయివేట్ రంగంలో మేధా కోచ్ ఫ్యాక్టరీని తెప్పించుకున్నామని రెండు రోజుల క్రితం కూడా కేటీఆర్ ట్వీట్ చేశారు.
అటు కేసీఆర్ కూడా… కేంద్ర ప్రభుత్వంతో అయ్యేది లేదు.. పొయ్యేది లేదు అంటూ సీఎం కేసీఆర్ వ్యాఖ్యానించడంతో పాటు ప్రధాని అధ్యక్షతన జరిగే నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశాన్నీ బహిష్కరించారు. అందుకు గల కారణాలను వివరిస్తూ ఓపెన్ లెటర్ రిలీజ్ చేశారు.
కేంద్ర హోం మంత్రి అధ్యక్షుడిగా ఉండే సదరన్ జోనల్ కౌన్సిల్ సమావేశానికి సైతం రాష్ట్ర ప్రభుత్వం తరఫున సీఎంగానీ, మంత్రిగానీ హాజరుకాలేదు. తెలంగాణకు ప్రధాని మోదీ వచ్చినా కేసీఆర్ అటు కన్నెత్తి చూడలేదు. అమిత్ షా వచ్చినా ఆయనపై విమర్శలు కురిపించారే కానీ ఆయన్ను కలవలేదు. అలాంటిది ఇప్పుడు కేటీఆర్ సడెన్‌గా దిల్లీలో బీజేపీ పెద్దలను కలవడం రాజకీయ సమీకరణల మార్పునకు సంకేతమని వినిపిస్తోంది.
మరోవైపు బీజేపీకి వ్యతిరేకంగా ఏకమవుతామంటున్న విపక్సాలు కూడా బీఆర్ఎస్‌ను కలుపుకొని వెళ్లడం లేదు. విపక్షాల మీటింగ్‌కు బీఆర్ఎస్‌ను ఆహ్వానింలేదంటూ జేడీయూ సీనియర్ నేత ఢిల్లీలో జాతీయ మీడియాకు క్లారిటీ ఇచ్చారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు సమదూరం పాటిస్తున్నట్టు బీఆర్ఎస్ నేతలు సైతం చెప్పుకున్నారు. ఇన్విటేషన్ విషయంలో బీఆర్ఎస్ స్పష్టత ఇవ్వకపోయినా పాట్నా మీటింగ్‌కు గైర్హాజరైంది. అదే టైంలో కేటీఆర్ ఢిల్లీ వెళ్లి కేంద్ర మంత్రులను కలవడం ద్వారా తాము కాంగ్రెస్‌తో వెళ్లడంలేదనే స్పష్టత ఇచ్చినట్లయింది.
ఇప్పటికే బీజేపీకి ‘బీ-టీమ్’ అంటూ బీఆర్ఎస్‌పై ముద్ర ఉన్న సమయంలో కేటీఆర్ ఢిల్లీ టూర్‌కు రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. రాష్ట్ర అవసరాల కోసమే కేంద్ర మంత్రులను కలిసినట్లయితే గతంలో అనుసరించిన లేఖల సంప్రదాయాన్నే కంటిన్యూ చేయొచ్చు గదా అనే వాదన వినిపిస్తోంది.
అంతేకాదు… లిక్కర్ కేసులో కవిత విషయంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు జోరు తగ్గించడం.. కేసీఆర్ బీజేపీపై విమర్శలు తగ్గించడం, కేటీఆర్ దిల్లీ వెళ్లడం అన్నీ కూడా ఆ రెండు పార్టీల గేమ్ అని కాంగ్రెస్ నేతలు విమర్శిస్తున్నారు.
This post was last modified on June 24, 2023 10:35 am
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…