Political News

కేసీఆర్‌కు కొరుకుడు ప‌డ‌ని తెలంగాణ కాంగ్రెస్ వ్యూహాలు!

తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ అంటేనే.. రాజ‌కీయ దురంధ‌రుడిగా.. వ్యూహాల‌కు ప్ర‌తి వ్యూహాలు వేయ గ‌ల దిట్ట‌గా పేరు తెచ్చుకున్నారు. అయితే.. ముచ్చ‌ట‌గా మూడో సారి విజ‌యం ద‌క్కించుకుని తెలంగా ణ‌పై త‌న‌దైన ముద్ర వేయాల‌ని భావిస్తున్న కేసీఆర్‌కు కాంగ్రెస్ వ్యూహాలు ఇర‌కాటంగా మారాయ‌నే చ‌ర్చ సాగుతోంది. తెలంగాణ ఇచ్చింది తామేన‌ని చెప్పుకొంటున్న కాంగ్రెస్‌పార్టీ.. నిన్న మొన్న‌టి వ‌ర‌కు ఒక విధంగా ఉంటే.. ఇప్పుడు చాలా వ‌ర‌కు పుంజుకునే ప్ర‌య‌త్నాలు ప్రారంభించింది.

మ‌రీ ముఖ్యంగా బీఆర్ ఎస్ నాయ‌కుల‌కు.. అందునా.. బ‌ల‌మైన సామాజిక‌వ ర్గం, ప్ర‌జ‌ల్లో మ‌న్న‌న‌, వారి ఫాలోయింగ్ ఉన్న జూప‌ల్లి కృష్ణారావు, పొంగులేటి, నాగం జ‌నార్ద‌న్‌రెడ్డి వంటివారికి వ్యూహాత్మ‌కంగా గేలం వేసి.. వారిని పార్టీలోకి చేర్చుకోవ‌డం ద్వారా కేసీఆర్‌కు స‌వాల్ రువ్వుతోంది. నిజానికి వీరిని త‌క్కువ‌గా అంచ‌నా వేసే ప‌రిస్థితి లేకుండా పోయింది. వీరంతా కూడా.. రాజ‌కీయంగా ఉద్ధండులు. వీరితోపాటు.. మ‌రికొంద‌రు కూడా.. లైన్‌లో ఉన్నార‌నేది మ‌రో చ‌ర్చ‌.

తొలుత బ‌ల‌మైన వారిని పార్టీలో చేర్చుకుంటే.. త‌ర్వాత‌.. మిగిలిన చేప‌ల‌ను ఒడిసి ప‌ట్టుకోవ‌చ్చ‌న్న రేవంత్‌రెడ్డి వ్యూహం చ‌కాచ‌కా అమ‌లైతే.. ఖ‌చ్చితంగా క్షేత్ర‌స్థాయిలో కేసీఆర్ వ్యూహాల‌కు ప‌దును త‌గ్గుతుంద‌ని ప‌రిశీల‌కులు కూడా భావిస్తున్నారు. ఇదిలావుంటే వైఎస్ త‌న‌య‌, వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్య‌క్షురాలు.. వైఎస్ ష‌ర్మిల కూడా.. కాంగ్రెస్ వైపు మొగ్గు చూపుతున్నార‌ని వార్త‌లు వ‌స్తున్నాయి. ఈ ప‌రిణామాల‌పై గుంభ‌నంగా వ్య‌వ‌హ‌రిస్తున్న కేసీఆర్‌.. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో మాత్రం ఒకింత జాగ్ర‌త్త ప‌డుతున్నారని ప్ర‌గ‌తి భ‌వ‌న్ వ‌ర్గాలు చెబుతున్నాయి.

మ‌రోవైపు.. సొంత పార్టీలోనే స‌గం మంది ఎమ్మెల్యేల ప‌రిస్థితి విమ‌ర్శ‌ల‌కు… దారితీస్తోంది. ఎన్నిక‌లు ఎప్పుడు జ‌రిగినా.. ఓడిపోయే నాయ‌కుల జాబితా కూడా కేసీఆర్ వ‌ద్ద ఉంది. ఇప్ప‌టికిప్పుడు వీరిని కాద‌న్నా తంటానే.. అలాగ‌ని టికెట్లు ఇచ్చినా.. పెద్ద మైన‌స్సే అవుతుంది. ఈ ప‌రిణామాల‌ను అంచ‌నా వేసుకుని.. కాంగ్రెస్ బ‌ల‌పేతం కాకుండా.. ఎలా అడ్డుకోవాల‌నేది ఇప్పుడు కేసీఆర్ ముందున్న భారీ టాస్క్ అని అంటున్నారు ప్ర‌గ‌తి భ‌వ‌న్ సీనియ‌ర్ నాయ‌కులు. మ‌రి ఏం చేస్తారో చూడాలి.

This post was last modified on June 23, 2023 2:36 pm

Share

Recent Posts

సుమంత్ అదే దారిలో వెళ్తే ఎలా

హీరోలన్నాక అన్ని రకాల జానర్లు ట్రై చేయాలి. ఏదో ట్రెండ్ నడుస్తోంది కదాని ఒకదానికే కట్టుబడితే సానుకూల ఫలితాలు రావు.…

26 minutes ago

మండాడి మెరుపు దాడి ఎవరు ఊహించారు

త్రివిక్రమ్ అన్నట్టు కొన్ని అద్భుతాలు ఎవరూ ఊహించరు, అవి జరిగినప్పుడు చూస్తూ ఉండిపోవాలంతే. దానికి గొప్ప ఉదాహరణగా బాలీవుడ్ 'హనుమాన్…

2 hours ago

త్రినాథుడి బ్యాటింగ్ ఆపే టైమొచ్చింది

పాతిక రోజులకు చేరుకున్నా బాక్సాఫీస్ వద్ద దూకుడు కొనసాగిస్తూనే ఉన్న ఇరుముడి ఎట్టకేలకు థియేటర్ రన్ ముగింపుకి వచ్చినట్టే. నెట్…

2 hours ago

టాలీవుడ్‌లో ఇలాంటి కలయికలు అసాధ్యమా

నిన్న లండన్ సిల్వర్ స్టోన్ పార్క్ లో జరిగిన కార్ రేసింగ్ లో అజిత్ కు మద్దతు ఇచ్చేందుకు తమిళనాడు…

3 hours ago

హిందూపురం ఇలాకాలో… బాల‌య్యదే హ‌వా!

శ్రీ సత్యసాయి జిల్లాలోని హిందూపురం నియోజకవర్గంలో స్థానిక సంస్థల రాజకీయం ఎమ్మెల్యే నంద‌మూరి బాల‌కృష్ణ చుట్టూనే తిరుగుతోంది. ఆయ‌న అనుకూల…

3 hours ago

కార్తీ అర్జెంటుగా అప్‌డేట్ కావాల్సిందే

మంచి నటన, చలాకీతనం, అందం అన్నీ ఉన్నా కార్తీ విషయంలో జరుగుతున్న పరిణామాలు అభిమానులను తెగ కలవరపెడుతున్నాయి. సరైన హిట్…

4 hours ago