Political News

న‌న్ను తిట్టించ‌డ‌మే మీ హీరోయిజ‌మా?

మీ అభిమానులతో బండబూతులు తిట్టిస్తూ.. నాపైమెసేజ్‌లు పెట్టిస్తున్నారు.. అలా చేయడం వలన మీరు పెద్ద హీరో అనుకుంటున్నారేమో. ఆ మెసేజ్‌లకు భయపడి నేను లొంగిపోవడం ఈ జన్మకు జరగదు. పవన్ సినిమాలో హీరో తప్ప.. రాజకీయాలలో హీరో కాదన్నది గ్రహించాలి. న‌న్ను మీరు గాని, మీ అభిమానులు గాని తిట్టవలసిన అవసరం ఏమొచ్చింది?అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌కు కాపు ఉద్యమ మాజీ నాయ‌కుడు ముద్రగడ ప‌ద్మ‌నాభం మరో లేఖ సంధించారు.

లేఖ‌లో కీల‌క పాయింట్లు ఇవే..

  • ప‌వ‌న్‌.. మీ వద్ద నేనేమి నౌకరీ చేయడం లేదే? నాకు ఏ రకంగాను స్వంత అభిప్రాయలు ఉండకూడదా? మీకు తొత్తుగా ఉండాలా? మీకు నాకు సంబంధం ఏమిటి? మీకు డబ్బు ఉంది కాబట్టి మీ అభిమానుల చేత నన్ను తిట్టిస్తారా?
  • నా శరీరంలో చీము, నెత్తురు లేకపోవడం వలన పౌరుషం పూర్తిగా పోయింది నేనొక అనాథను, ఒంటరి వాడిని ఏమన్నా పడతాననే గర్వమా?
  • 1988లో వంగవీటి రంగాని హత్య చేసిన తరువా త ఎంతో మందిని అమాయకులను జైలులో పెట్టినప్పుడు ఎప్పుడైనా తమరు వెళ్ళి చూసారా? జైలులో ఉన్న వారి కుటుంబాలకు ధైర్యం చెప్పడం కోసం ఏ రోజైనా పలకరించడానికి వారి గృహాలకు వెళ్ళారా?
  • రంగా హ‌త్య త‌ర్వాత జైలులో ఉన్న వారికి బెయిల్స్ తేవడం కోసం ఎప్పుడైనా అడ్వకేట్స్‌తో మాట్లాడారా? జైలులో ఉన్న వారి మీద టెర్రరిస్టుల కోసం తయారు చేసిన చట్టంలోని కొన్ని సెక్షన్లు వేసి కేసులు పెట్టిన సంగతి మీకు తెలిసా?
  • 1988-89లో 3500 మంది అమాయకులపై పెట్టిన కేసులు తీసివేయమని ఎప్పుడైనా అప్పటి గౌరవ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి గారిని కలిసి కోరారా? 1993-94 లో రావులపాలెంలో అప్పటి ముఖ్యమంత్రి సభలో కాపులను గొడ్డును బాధినట్లుగా బాదిన బాధితులను ఏరోజైనా పలకరించారా?
  • 1999 ఉద్యమ సందర్భముగా అప్పట్లో పెట్టిన కేసులు అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబుని తీసివేయమని అడిగారా?
  • కాకినాడ ఎమ్మెల్యేతో పాటు నన్ను తిట్టాలని ఎందుకు అనుకున్నారో ప‌వ‌న్ చెప్పి తీరాలి.
  • కాకినాడ నుండి పోటీ చేయడానికి మీరు(ప‌వ‌న్‌) నిర్ణయం తీసుకోండి. ఏ కారణం చేతనైనా తమరు తోక ముడిస్తే పిఠాపురం నుండి పోటీ చేయడానికి తమరు నిర్ణయం తీసుకుంటే.. నేనే మీమీద పోటీ చేసేందుకు రెడీగా ఉన్నాను.
  • “చెగువేరా” మీకు ఆదర్శం అని చెప్పుకుంటారు. గుండెలనిండా ధైర్యం ఉందని అంటారు కాబట్టి ఏదో ఒక కోరిక తప్పకుండా(కాకినాడ‌, పిఠాపురంల నుంచి పోటీ చేసే ప‌రిస్థితి) తీర్చే శక్తి పౌరుషం మీకు ఉన్నాయని నేను భావిస్తాను.
  • ఎన్నికల బరిలో ఉండాలా లేదా అనుకుంటున్న సమయంలో మీరు, జనసైనికులు తిట్టడం వల్ల ఎక్కడా లేని ఉత్సాహాం నాలో వచ్చి యుద్ధానికి రెడీ అవ్వాలనే వాతావరణం కల్పించినందుకు చాలా సంతోషం. బంతిని ఎంత గట్టిగా కొడితే అంత ఎత్తుకు లేస్తుందనే సంగతి మరువవద్దు.

This post was last modified on June 23, 2023 11:50 am

Share
Show comments
Published by
Satya

Recent Posts

టైగర్ పవన్ కు మోడీ ప్రశంస

ఏపీ ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్ క‌ల్యాణ్‌కు మ‌రోసారి ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోడీ నుంచి ప్రశంస‌లు ల‌భించాయి. గ‌తంలోనూ ప‌లు…

32 minutes ago

‘చంద్ర‌బాబు ప‌నిరాక్షసుడు’

పండుగ అన‌గానే ఎవ‌రైనా కుటుంబంతో సంతోషంగా గ‌డుపుతారు. ఏడాదంతా ఎంత బిజీగా ఉన్నా పండగ పూట‌.. కొంత స‌మ‌యాన్ని ఫ్యామిలీకి…

4 hours ago

ఊపిరి పీల్చుకున్న విశ్వంభర

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ ఇచ్చాక ఆయన ఓకే చేసిన సినిమాల్లో అనౌన్స్ అవ్వగానే మాంచి హైప్ తెచ్చుకున్న చిత్రాల్లో ‘విశ్వంభర’…

6 hours ago

పోకిరి రేంజ్ ట్విస్ట్ ఇచ్చిన రావిపూడి

ఈ సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి నుంచి వచ్చిన ‘మన శంకర వరప్రసాద్’ బాక్సాఫీస్ దగ్గర బ్లాక్‌బస్టర్ అయ్యే దిశగా దూసుకెళ్తోంది.…

11 hours ago

ఇళయరాజా అభయమందుకున్న వరప్రసాద్ గారు

మన శంకరవరప్రసాద్ గారు రిలీజయ్యాక చాలా మందికి కలిగిన సందేహం ఒకటుంది. చిరంజీవి, నయనతార లవ్ ఎపిసోడ్స్ లో బ్యాక్…

12 hours ago

విజ‌య్‌కు సీబీఐ సెగ‌… `పొత్తు` కోసమా?

త‌మిళ దిగ్గ‌జ న‌టుడు, త‌మిళగ వెట్రి క‌గ‌ళం(టీవీకే) అధ్య‌క్షుడు విజ‌య్ వ్య‌వ‌హారం.. మ‌రింత ముదురుతోంది. గ‌త ఏడాది సెప్టెంబ‌రు 27న‌…

13 hours ago