వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజుపై విశాఖపట్నం ఎంపీ ఎంవీవీ సత్య నారాయణ తీవ్రస్థాయిలో ఫైరయ్యారు. రఘురామను గజ్జికుక్క అంటూ తీవ్రస్థాయిలో దూషించారు. తను, తన కుటుంబం కష్టాల్లో ఉంటే.. దానిని కూడా రాజకీయంగా వాడుకునేందుకు రఘురామ వంటి గజ్జికుక్కలు ప్రయత్నిస్తున్నాయని వ్యాఖ్యానించారు. తాజాగా మీడియాతో మాట్లాడిన ఎంవీవీ.. రఘురామకృష్ణ గజ్జి కుక్క అని.. ఇష్టం వచ్చినట్లు ఢిల్లీ నుంచి మాట్లాడుతారని మండిపడ్డారు. తన కొడుకుని, భార్యని 50 గంటల బంధించి, హింసిస్తే దీన్ని కూడా రాజకీయం చేస్తున్నారన్నారు.
కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయిన హేమంత్ మీద 13 కేసులు, రాజేష్ మీద 45 కేసులు ఉన్నాయని ఎంవీవీ తెలిపారు. హేమంత్‌తో తమకు ఎలాంటి లావాదేవీలు లేవని.. కేవలం డబ్బులు కోసం ఇదంతా చేశారని చెప్పారు. అనుమానం ఉంటే తన కాల్ డేటా ఐదు సంవత్సరాలు చెక్ చేసుకోవాలన్నారు. అందరూ కోరుతున్నారు కాబట్టి ఘటనపై సీబీఐ, ఎన్ఐఏ విచారణ వేయాలని తానే స్వయంగా కోరుతున్నట్లు తెలిపారు. విశాఖపట్నంలో వ్యాపారాలకు అనుకూల పరిస్థితులు లేవని చెప్పలేదన్నారు. తాను రాజకీయాల్లో ఉండడంతో ప్రతిదీ వక్రీకరిస్తున్నారని ఎంవీవీ వ్యాఖ్యానించారు.
తెలంగాణలో వ్యాపారం చేయాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ప్రస్తుతం ఎక్కడ ఉన్నా ప్రాజెక్టుని పూర్తి చేస్తామన్నా రు. ఈ ఘటనలో ఏ పార్టీకి, ఎవరికి, ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కేవలం డబ్బులు కోసమే ఇదంతా చేశారని ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ వెల్లడించారు. కానీ, ఏ విషయం జరిగినా.. దానికి వైసీపీకి, సీఎం జగన్‌కు ముడిపెట్టి మాట్లాడుతున్నా రని.. చంద్రబాబు హయాంలో ఇలాంటి ఘటనే జరిగితే ఇలా మాట్లాడేవారా? అని ప్రశ్నించారు. వైసీపీని బద్నాం చేయాలని అనుకునేవారే .. వచ్చే ఎన్నికల్లో అడ్రస్ లేకుండా పోతారని ఎంవీవీ వ్యాఖ్యానించారు. తాను వైసీపీలోనే ఉన్నానని, ఉంటానని.. వచ్చే ఎన్నికల్లో పోటీ కూడా చేస్తున్నానని సత్యనారాయణ చెప్పారు.
రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కలిగిందని గుండెలు బాదుకుంటున్నటీడీపీ తన హయాంలో ఏం జరిగిందో ఒక్కసారి తిరిగి చూసుకోవాలని ఎంవీవీ వ్యాఖ్యానించారు. ఆర్టికల్ 355 అనేది.. అన్ని రాష్ట్రాలకూ వర్తించదని.. అలా వర్తించే టట్టయితే.. మొదట మణిపూర్ వంటి రాష్ట్రాల్లోనే విధించాల్సి ఉంటుందని.. కేంద్రానికి కూడా కొన్ని పరిమితులు ఉంటాయని, రాష్ట్రాల విషయంలో జోక్యం చేసుకునే హక్కులు స్పష్టంగా రాజ్యాంగం పేర్కొందని ఎంవీవీ వ్యాఖ్యానించారు. ఈ విషయం తెలిసి కూడా టీడీపీ నేతలు.. రాజకీయం చేస్తున్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించే చర్యలు చేపడుతున్నారని ఆయన మండిపడ్డారు.
This post was last modified on June 22, 2023 12:00 pm
లగచర్లలో కలెక్టర్‌పై జరిగిన దాడి వెనుక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హస్తం ఉందని మంత్రి కొండా సురేఖ సంచలన…
రెండు రోజులుగా సౌత్ ఇండియన్ ఫిలిం సర్కిల్స్‌లో ధనుష్-నయనతార గొడవ గురించే చర్చలన్నీ నడుస్తున్నాయి. తన పెళ్లి, వ్యక్తిగత జీవితం…
ప్రపంచమంతటా ప్రతిష్ఠత కలిగిన మిస్ యూనివర్స్ పోటీల్లో ఈసారి డెన్మార్క్‌కు చెందిన విక్టోరియా కెజార్ హెల్విగ్ ఘనవిజయం సాధించారు. మెక్సికోలో…
సండే ఈజ్ ఏ హాలీడే కాబట్టి… ఆ మూడ్‌లోకి వెళుతూ ప్రజలంతా రిలాక్స్ మూడ్‌లోకి వెళ్తుంటే… రాజకీయ నాయకులు మాత్రం…
దేశ రాజధాని ఢిల్లీ రాజకీయాలు మరోసారి హాట్ టాపిక్ గా మారుతున్నాయి. ఒకప్పుడు బెస్ట్ లీడర్ అంటూ పొగిడిన సొంత…
ట్రెడిషనల్ హీరోయిన్ అనే ముద్ర నుంచి గ్లామర్ క్వీన్ ఇమేజ్ వైపు శరవేగంగా అడుగులేస్తున్న కథానాయిక కీర్తి సురేష్. దక్షిణాదిన…