ఎన్నికల సమయం వచ్చిందంటే.. చాలు నాయకులు శివాలెత్తిపోతారు. ప్రజలకు విచ్చలవిడిగా హామీలు ఇచ్చేస్తారు. అధికారమే పరమావధిగా నాయకులు పార్టీలు కూడా.. పెద్ద ఎత్తున హామీలు గుప్పిస్తారు. అయితే… ఇలాంటి హామీలే ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పట్టుమని నెల రోజులు కూడా గడవకముందే.. ఆపశోపాలు పడుతోంది. కర్ణాటకలో గత నెల మేలో జరిగిన ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ అనేక హామీలు గుప్పించింది.
ముఖ్యంగా మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం అని ప్రకటించింది. దీనిని జిల్లాకే పరిమితం చేసినట్టు చెప్పింది. అయినా.. కూడా ఇప్పుడు బస్సులు మహిళలతో కిక్కిరిసిపోతున్నాయి. రోజుకు రాష్ట్ర వ్యాప్తంగా కర్ణాటక ఆర్టీసీకి 84 కోట్లరూపాయల వరకు నష్టం వస్తోందని అధికారులు తాజాగా సీఎం సిద్దరామయ్యకు నివేదిక సమర్పించారు. అంతేకాదు.. అసలు సీట్లన్నీ.. మహిళలకే కేటాయించేశామని.. వారు తప్ప.. ఇంకెవరూ బస్సులు ఎక్కడం లేదని కూడా వారు చెప్పారు.
దీంతో ఆర్టీసీ తీవ్ర నష్టాల్లో కూరుకుపోంతోందన్నది కర్ణాటక ఆర్టీసీ అధికారుల ఆవేదన, ఆందోళన కూడా. అంతేకాదు.. అన్నభాగ్య పథకం కింద.. కుంటాబానికి మనిషికి 10 కిలోలు ఇస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్ సర్కారు.. బియ్యం కొరతతో దీనిని 5 కేజీలకు తగ్గించింది. అయితే.. దీనిపై ఎలాంటి ప్రకటనా చేయలేదు. ఇప్పుడు ప్రతిపక్షాల నుంచి అనేక విమర్శలు వస్తున్నాయి. ఇలా.. అనేక పథకాలు.. ఉన్నాయి. ముఖ్యంగా ఉచిత విద్యుత్ అంశం.. సర్కారుకు చెమటలు పట్టిస్తోంది.
మొత్తంగా చూస్తే.. ఉచితాలు ప్రజలకు బాగానే ఉన్నప్పటికీ.. ప్రభుత్వాలకు ఎన్ని ఇబ్బందులు తీసుకువస్తాయో చెప్పడానికి కర్ణాటకలో తాజాగా అమలవుతున్న ఆర్టీసీ విషయం ప్రధాన ఉదాహరణగా నిలిచింది. దీని నుంచి బయటకు రాలేక.. సిద్దరామయ్య సర్కారు తర్జన భర్జన పడుతోంది. కాబట్టి.. త్వరలోనే ఎన్నికలు జరగనున్న రాష్ట్రాల్లో అయినా.. పార్టీ ఒకింత జాగ్రత్తగా వ్యవహరించాలని .. మేధావులు పరిశీలకులు సూచిస్తున్నారు. ఏపీ కూడా అప్పుల ఊబిలో కూరుకుపోవడానికి ఎన్నికల హామీలేనని చెబుతున్నారు.
This post was last modified on June 21, 2023 4:11 pm
ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాల్లో నాలుగు స్తంభాలాట జోరుగా సాగుతోంది. అంటే.. నాయకుల మధ్య వివాదాలు, విభేదాల గురించి కాదు.. నాలుగు…
మాస్ రాజా రవితేజ ఇమేజ్ ఛట్రం నుంచి బయటికి వచ్చి విభిన్నమైన సినిమాలు చేస్తున్నాడు ఈ మధ్య. ఈ క్రమంలో…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, తమిళ స్టార్ డైరెక్టర్ అట్లీల కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘రాకా’ సినిమా మీద అంచనాలు ఏ…
ఈ మధ్య భారీ బడ్జెట్ సినిమాలకు ముందు రోజు వేస్తున్న ప్రీమియర్ షోలు పెద్ద సమస్యగా మారాయి. అసలు కంటెంట్…
ప్రధాని మోదీ, సీఈసీ జ్ఞానేశ్ కుమార్ లపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఓట్ల…
ఒకప్పుడు వైసీపీలో ఓ వెలుగు వెలిగిన విజయ సాయిరెడ్డి ఇప్పుడు ఆ పార్టీపై ఒంటికాలిపై లేస్తున్న వైనం పలువురిని ఆశ్చర్యపరుస్తోంది.…