రాబోయే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలన్నది కాంగ్రెస్ పట్టుదల. ఒకవేళ మళ్ళీ ఓడిపోతే పార్టీ పరిస్ధితి ఏమిటో అందరికీ బాగా తెలుసు. ఎందుకంటే ఇఫ్పటికే రెండు వరుస ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. అందుకనే బలమైన నేతలు, ప్రజాధరణ ఉన్న నేతలు అనుకున్న వాళ్ళని ఏదో పద్దతిలో పార్టీలో చేర్చుకుంటోంది. ఇదే సమయంలో కర్నాటక ఎన్నికల్లో ఘనవిజయం సాధించటంతో తెలంగాణాలో కాంగ్రెస్ ఊపు ఒక్కసారిగా పెరిగిపోయింది. దీంతో కొందరు బలమైన నేతలు కాంగ్రెస్ లో చేరటానికి మొగ్గుచూపుతున్నారు.
ఇందులో భాగంగానే ఖమ్మం మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కాంగ్రెస్ లో చేరబోతున్నారు. ఈనెల 30వ తేదీన ఖమ్మంలోనే బహిరంగసభ ఏర్పాటుచేసి తన మద్దతుదారులతో కాంగ్రెస్ కండువా కప్పుకునేందుకు రెడీ అయిపోయారు. రెండు, మూడురోజులుగా వరుసగా కాంగ్రెస్ సీనియర్లతో భేటీ అవుతున్నారు. సో, పొంగులేటి కాంగ్రెస్ లో చేరటం ఖాయమైపోయింది. అయితే ఎక్కడినుండి పోటీచేస్తారు ? ఇపుడిదే సస్పెన్సుగా మారింది.
జిల్లాలో పొంగులేటి పోటీచేయబోయే నియోజకవర్గాలపై హాట్ టాపిక్ నడుస్తోంది. పార్టీవర్గాల సమాచారం ఏమిటంటే ఖమ్మం లేదా కొత్తగూడెం అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎక్కడో ఒకచోట నుండి పోటీచేస్తారట. ఖమ్మం, కొత్తగూడెం జిల్లాలు వేరన్న విషయం తెలిసిందే. ఖమ్మం పొంగులేటి సొంతూరు. పైగా మంత్రి పువ్వాడ అజయ్ కూడా ఖమ్మం వాసే. వచ్చే ఎన్నికల్లో అజయ్ ఖమ్మం లోనే పోటీ చేస్తారు. కాబట్టి మంత్రిని ఓడించాలంటే తాను ఖమ్మంలోనే పోటీచేయాలని అనుకుంటున్నారట.
ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం నియోజకవర్గంలో కూడా పొంగులేటికి బలమైన మద్దతుదారులున్నారు. ఇక్కడి నుండి బీఆర్ఎస్ పోటీ చేయాలా లేకపోతే పొత్తుకుదిరితే సీపీఐ పోటీచేయాలా అనేది తేలలేదు. బహుశా రెండుపార్టీలు పోటీలో ఉండేట్లే ఉంది. అందుకనే కాంగ్రెస్ తరపున పొంగులేటి పోటీచేస్తే గెలుపు చాలా సులభమవుతుందని మద్దతుదారులు చెబుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని పది నియోజకవర్గాల్లో పినపాక, అశ్వారావుపేట, ఇల్లెందు నియోజకవర్గాల్లో పొంగులేటి మద్దతుదారులకు టికెట్లు ఇవ్వటానికి అధిష్టానం అంగీకరించినట్లు ప్రచారంలో ఉంది. ప్రచారమే నిజమైతే పొంగులేటికి అధిష్టానం బాగా ప్రాధాన్యత ఇచ్చినట్లే అనుకోవాలి.
This post was last modified on June 18, 2023 4:48 pm
ఏపీ సీఎం చంద్రబాబు మళ్లీ పాతకాలపు పాలనను ప్రజలకు పరిచయం చేయనున్నారా? ప్రభుత్వ ఆఫీసులు, ప్రాజెక్టుల పనుల ను ఆయన…
సరికొత్త చరిత్ర లిఖితమయ్యింది. ఇప్పటిదాకా హిందీ బ్లాక్ బస్టర్స్ అంటే షోలే, హమ్ ఆప్కే హై కౌన్, దిల్వాలే దుల్హనియా…
ఏపీ సీఎం చంద్రబాబు 45 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్నారు. ఇప్పటికి మూడు సార్లు ముఖ్యమంత్రిగా పనిచేశారు. ఇప్పుడు నాలుగో సారి…
థియేటర్లో సినిమా చూస్తున్నప్పుడు నచ్చకపోతేనో లేదా చిరాకు వస్తేనో వెళ్లిపోవాలనిపిస్తుంది. కానీ టికెట్ డబ్బులు గుర్తొచ్చి ఆగిపోతాం. ఇష్టం లేకపోయినా…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప: ది రూల్ చిత్రం దేశవ్యాప్తంగా రికార్డుల మోత మోగిస్తున్న సంగతి తెలిసిందే.…