Political News

వచ్చే నెలలో కీలక పరిణామాలు ?

ఏపీ లక్ష్యంగా వచ్చే నెలలో రాజకీయంగా కీలక పరిణామాలు జరిగే అవకాశాలున్నాయి. జగన్మోహన్ రెడ్డి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు పట్టు బిగించేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టాయి. టీడీపీ నుండి రెండు రకాలుగాను, జనసేన నుండి వారాహి యాత్ర రూపంలోనే అధికార వైసీపీని ఇరుకున పెట్టేందుకు ప్రయత్నాలు మొదలయ్యాయి. లోకేష్ పాదయాత్రకు తోడు మినీ మ్యానిఫెస్టోతో జనాల్లోకి వెళ్ళేందుకు టీడీపీ బస్సుయాత్రకు రెడీ అవుతోంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఇప్పటికే వారాహి యాత్ర మొదలుపెట్టేశారు.

ఇదే సమయంలో బీజేపీ అగ్రనేతలు కూడా జగన్ టార్గెట్ గా ఆరోపణలతో విరుచుకుపడుతున్నారు. ఒకవైపు చంద్రబాబు మరోవైపు పవన్ తమ పర్యటనల్లో జనాలకు హామీలు ఇచ్చేస్తున్నారు. బీజేపీ మాత్రమే ఇంకా ఆ పనిచేయలేదు. మారుతున్న రాజకీయ సమీకరణల్లో టీడీపీ, జనసేన, బీజేపీ ఉమ్మడిగా పోటీ చేయడం దాదాపు ఖాయమనే అనిపిస్తోంది. ఉమ్మడిగా పోటీచేయాలని అనుకుంటున్నపుడు ప్రణాళిక లేదా మ్యానిఫెస్టో కూడా ఉమ్మడిగానే ఉండాలి కదా.

అందుకనే పొత్తులపై వచ్చే నెలలో ఏదో ఒకటి తేల్చేయాలని అనుకుంటున్నాయి. ఏపీలో ఎన్నికలకు ఇంకా పదినెలల సమయముంది. కానీ తెలంగాణ లో ఉన్నది ఆరు నెలలు మాత్రమే. పొత్తులుపెట్టుకునే విషయంలో బీజేపీ ఇప్పుడు కూడా క్లారిటి ఇవ్వకపోతే తీవ్రంగా నష్టపోవటం ఖాయం. అందుకనే టీడీపీతో పొత్తు విషయంలో వచ్చే నెలలో బీజేపీ ఫైనల్ డెసిషన్ తీసుకోబోతోందని సమాచారం. వచ్చేనెలలో నరేంద్రమోడీ లేదా అమిత్ షా మరోసారి చంద్రబాబుతో భేటీ జరపబోతున్నారట. అప్పుడు పొత్తులపై క్లారిటీ వచ్చేస్తుంది.

ఢిల్లీలో భేటీ తర్వాత మూడు పార్టీలు సంయుక్తంగా సమావేశం అవటానికి రంగం సిద్ధమవుతోంది. అప్పుడు మూడుపార్టీల తరపున ఉమ్మడి ప్రణాళికను రెడీచేయబోతున్నట్లు ప్రకటిస్తారట. మూడుపార్టీల్లోని సీనియర్లు కూర్చుని ఉమ్మడి మ్యానిఫెస్టోకు రూపకల్పన చేస్తారని తెలుస్తోంది. జరుగుతున్నది చూస్తుంటే జగన్ను ఎలాగైనా ఓడించి మళ్ళీ అధికారంలోకి రావాలన్న పట్టుదల ప్రతిపక్షాల్లో బలంగానే కనబడుతోంది. మరి పొత్తులంటే సీట్ల సర్దుబాటు, పోటీచేయబోయే నియోజకవర్గాలు తదితరాలను ఏ విధంగా సర్దుబాటు చేసుకుంటాయో చూడాల్సిందే. ఏదేమైనా రాబోయే ఎన్నికలు మాత్రం జగన్ చెప్పినట్లుగా కురుక్షేత్ర యుద్ధాన్ని తలపించేట్లే ఉంది.

This post was last modified on June 18, 2023 4:50 pm

Share

Recent Posts

మహా కథ మళ్ళీ కంచెర్లపాలెంకే

మహేష్ బాబు సమర్పణలో సత్యదేవ్ హీరోగా వెంకటేష్ మహా రూపొందించిన ‘రావు బహదూర్’ సినిమా మీద టీం అంతా చాలా…

4 minutes ago

నష్టాలు వచ్చాయని ఒప్పుకున్న నాని

తమ సినిమాలు థియేటర్లలో ఉండగా అందులో లోపాల గురించి.. దాని మీద వచ్చే విమర్శల గురించి, కలెక్షన్లు తక్కువ రావడం…

21 minutes ago

చివరి మ్యాచ్‌లోనూ అదే మెస్సీ… వారసుడికే గోల్ ఇచ్చి వెళ్లాడు!

21 ఏళ్ల కెరీర్‌లో అర్జెంటీనా కోసం ఎన్నో మ్యాచ్‌లను ఒంటిచేత్తో మార్చిన లియోనెల్ మెస్సీ.. చివరి మ్యాచ్‌లోనూ తన మార్క్…

26 minutes ago

అక్కడ కలెక్షన్ల వర్షం… ఇక్కడ వసూళ్ల నీరసం

కొన్ని సినిమాలు నేటివిటీ మీద ఆడతాయి. ఒక చోట బ్లాక్ బస్టర్ అయినంత మాత్రాన పక్కన కూడా అదే రిజల్ట్…

1 hour ago

వరప్రసాద్ స్నేహితులకు ఒకే సమస్య

మన శంకరవరప్రసాద్ గారులో ఫ్రెండ్స్ గా నటించిన చిరంజీవి, వెంకటేష్ కు ఒకే సమస్య వచ్చింది. అదేంటంటే తక్కువ గ్యాప్…

2 hours ago

నాలుగేళ్ల తర్వాత టీమ్ఇండియాలో

ఒకసారి టీమ్ఇండియా నుంచి బయటకు వెళ్లాక నాలుగేళ్ల తర్వాత మళ్ళీ రావడం అంత ఈజీ కాదు. అందులోనూ 36 ఏళ్ల…

3 hours ago